Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

భారత హ్యుందాయ్ డిసెంబర్ లో నమోదయిన అమ్మకాల వృద్ధి 8% గా ఉంది .

జనవరి 05, 2016 03:18 pm sumit ద్వారా ప్రచురించబడింది

భారత హ్యుందాయ్ డిసెంబర్ నెలలో తన అమ్మకాలు 7.98% వృద్ధి గా నమోదు చేసింది. దక్షిణ కొరియా కార్ల తయారీదారుడు డిసెంబర్ 2014 లో 59,391 యూనిట్లు విక్రయించింది . ఈ సమయంలో, అమ్మకాలు ఫిగర్ 64,135 యూనిట్లకు పెరిగాయి. మొత్తం మీద ఈ నెలలో వృద్ధి ఆకట్టుకునే ఉండగా , డొమెస్టిక్ మార్కెట్ లో డిసెంబర్ 2014 లో 32,504 యూనిట్లు తో పోలిస్తే గత నెల 41,861 యూనిట్లను విక్రయించేలా చేయగలిగింది. దీని వృద్ది 28,78% గా నమోదయ్యింది.

కార్ల డిసెంబర్ అమ్మకాలు పరిశీలించిన తరువాత అంతర్జాతీయ మార్కెట్లో స్పందన కారు తయారీదారుడికి అంత ప్రోత్సాహకరంగా లేదు. ఎగుమతి యూనిట్ల సంఖ్య గత ఏడాది డిసెంబర్లో 26,887 కాగా గత నెల 22,274 యూనిట్లకు తగ్గింది. దీనియొక్క వృద్ది పాక్షికంగా క్షీణించటం వలన ఇండియన్ మార్కెట్ లో క్రిట వాహనానికి వచ్చినటువంటి అద్భుతమయిన స్పందన దృష్ట్యా కంపనీ అంతర్జాతీయ మార్కేట్లోకన్నా ఎక్కువగా భారత మార్కెట్ పైన దృష్టి సారించింది.

భారత హ్యుందాయ్ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ పెరుగుదల కి కారణం "గ్రాండ్ ఐ 10, ఎలైట్ ఐ 20 యొక్క బలమయిన పోటీ ప్రదర్శన " అని తెలిపారు.

హ్యుందాయ్ ఇటీవల 2015 సంవత్సరం రికార్డు బుకింగ్స్ నమోదు చేసుకున్న సమయం లో అమ్మకాలలో పెంపును ప్రకటించారు. దక్షిణ కొరియా వాహన తయారీదారులు 4.65 లక్షల యూనిట్ల వార్షిక లక్ష్యం కన్నా 4.76 లక్షల యూనిట్లు విక్రయించి ఆదిక్యత ని ప్రదర్శించారు. 2015 డిసెంబర్ మొదట్లో ఈ సంస్థ కార్ల ధరలు పెరగనున్నాయి అని ప్రకటించింది. 2015 న ఈ వాహనాలు కొన్న వారు ఈ అదనపు భారాన్ని చెల్లించే అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా స్పందన అంత ప్రేరేపించే విధంగా లేనప్పుడు, భారత మార్కెట్ లో వస్తున్నటువంటి స్పందన తయారీదారుడికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ఇది కుడా చదవండి ;

హ్యుందాయ్ క్రిట 90,000 కన్నా ఎక్కువ బుకింగ్స్ ని సాధించి, ఇప్పటికీ మార్కెట్లో బలంగా కొనసాగుతోంది.

s
ద్వారా ప్రచురించబడినది

sumit

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర