హ్యుండై ఇండియా వారు 20వ ఉచిత కార్ కేర్ క్లినిక్ ని ప్రారంభించారు
అక్టోబర్ 29, 2015 03:18 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
దేశం యొక్క ప్రముఖ కారు తయారీదారి అయిన హ్యుండై మోటర్ ఇండియా లిమిటెడ్ వారు "ఫ్రీ కారు కేర్ క్లినిక్" యొక్క 20వ ఎడిషన్ ని ప్రారంభించారు. ఇది 10 రోజుల పాటు దేశ వ్యాప్తంగా నడుస్తుంది మరియూ నవంబరు 2, 2015 న ముగుస్తుంది. ఈ క్యాంప్ దాదాపుగా 1,150 సర్వీసు సెంటర్లను దేశ వ్యాప్తంగా కవరు చేస్తుంది.
90 పాయింట్ల సమగ్ర కారు చెకింగ్ కాకుండా, కంపెనీ వారు స్పేర్ పార్ట్లపై, లేబర్ చార్జీలు, ఎంపిక గల పరికరాలు మరియూ ఇతర వాల్యూ ఆడెడ్ సర్వీసులపై డిస్కౌంట్ ని కూడా అందిస్తూ కస్టమర్లను ఆకర్షించనున్నారు.
20వ ఫ్రీ కార్ కేర్ క్లినిక్ యొక్క ప్రకటన పై స్పందిస్తూ, హోండా మోటర్స్ ఇండియా లిమిటెడ్ లో సేల్స్ & మార్కెటింగ్ కి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన మిస్టర్. రాకేష్ శ్రీవాస్తవ గారు," మేము పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ది చేస్తాము. ఈ కార్యక్రమం అనూహ్య స్పందనను అందుకుంది. అన్ని టచ్ పాయింట్ల వద్ద హ్యుండై సర్వీసు యొక్క ఉన్నతమైన అనుభవాన్ని కస్టమర్లు అందుకోవాలని మా ఆకాంక్ష," అని అన్నారు.
కస్టమర్లు వారి సర్వీసుని అడ్వాన్స్ లో "హ్యుండై కేర్" మొబైల్ ఆప్లికేషన్ ద్వారా లేదా కస్టమర్ కేర్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చును.