• English
    • లాగిన్ / నమోదు

    హ్యుందాయ్ ఐ 10 N లైన్ భారతదేశంలో గ్రాండ్ ఐ 10 నియోస్ యొక్క హాట్ హాచ్ కావచ్చు!

    సెప్టెంబర్ 13, 2019 09:58 am dhruv ద్వారా ప్రచురించబడింది

    26 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఇటీవల వెల్లడించిన యూరో-స్పెక్ థర్డ్-జెన్ ఐ 10 ఇప్పుడు స్పోర్టియర్ వేరియంట్‌ను పొందుతుంది

    Hyundai i10 N Line Could Be The Grand i10 Nios Hot Hatch In India!

    • ప్రపంచవ్యాప్తంగా స్పోర్టియర్ N వెర్షన్‌ను పొందిన నాల్గవ హ్యుందాయ్ కారు ఇది.
    •  వెన్యూ నుండి 1.0-లీటర్ టర్బో-పెట్రోల్‌ను ఇది ఉపయోగిస్తుంది, కాకపోతే కొద్దిగా పనితీరు తగ్గించి దీనిలో అందించడం జరిగింది.
    • ఐరోపాలో విక్రయించే సాధారణ ఐ 10 నుండి డిజైన్‌ లో తేడా ఉంటుంది.
    • భారతదేశంలో 2020 ఆటో ఎక్స్‌పో లో దీనిని ప్రదర్శించవచ్చు.
    • భారతదేశంలో దీని ప్రారంభం 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో ఉండవచ్చని అంచనా.
    • టాప్-స్పెక్ పెట్రోల్ గ్రాండ్ ఐ 10 నియోస్‌ పై లక్ష రూపాయల ప్రీమియంను దీని కోసం అధనంగా చెల్లించాల్సి ఉంటుంది. 

    భారతదేశానికి ఇటీవల గ్రాండ్ ఐ 10 నియోస్ లభించగా, థర్డ్-జెన్ ఐ 10 యూరోపియన్ మార్కెట్ కోసం ఆవిష్కరించబడింది. కానీ కొనసాగుతున్న ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో మన కోసం మరో ఐ 10 స్టోర్ ఉంది, అది ఐ 10 ఎన్ లైన్. హ్యుందాయ్ బాగా స్పోర్టీరియర్ గా ఉండే కార్లకు మాత్రమే N లైన్ బ్యాడ్జ్‌ను రిజర్వు చేసింది, ఇప్పటివరకు మూడు కార్లు మాత్రమే అందించింది: అవి ఐ 30, ఐ 30 ఫాస్ట్‌బ్యాక్ మరియు టక్సన్

    ఇది కూడా చదవండి: హోండా e ప్రొడక్షన్-స్పెక్ EV 200 కిలోమీటర్ల వరకూ ఉంటుంది అని వెల్లడించింది

    ఐ 10 ఎన్ లైన్ డైనమిక్ చేయడానికి, హ్యుందాయ్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ని అందించడం జరిగింది, ఇదే ఇంజన్ హ్యుందాయ్ వెన్యూ లో కూడా అందించబడింది. ఏదేమైనా, ఐ 10 ఎన్ లైన్ లో, ఈ ఇంజన్ పనితీరు తగ్గించి 100Ps అందించడం జరిగింది మరియు వెన్యూ లో 120 ps శక్తిని అందిస్తుంది. టార్క్ ఫిగర్ 172Nm వద్ద అదే విధంగా ఉంది. ట్రాన్స్మిషన్ వెన్యూ లోని 6-స్పీడ్ మాన్యువల్  తో ఉండగా, ఐ 10 N లైన్ లో 5-స్పీడ్ మాన్యువల్ మాత్రమే అందించడం జరిగింది. 

    పవర్‌ట్రెయిన్‌ గురించి ప్రక్కన పెడితే, ఐ 10 N లైన్ యొక్క లుక్స్ గురించి మాట్లాడుదాం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది సరిగ్గా స్పోర్టిగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో ప్రతి హ్యుందాయ్‌ లో మనం చూసే క్యాస్కేడింగ్ గ్రిల్‌ కు విస్తృత మైన, తక్కువ లుక్ ఇవ్వబడింది, ఇది ఐ 10 N లైన్ యొక్క స్పోర్టి పాత్రను మరింత పెంచుతుంది. గ్రిల్‌ లోని రెడ్ రంగు యాక్సెంట్స్ దీని స్పోర్టీ లుక్ ని ఇంకా పెంచుతాయి.సాధారణ యూరో-స్పెక్ ఐ 10 లేదా గ్రాండ్ ఐ 10 నియోస్ మాదిరిగా కాకుండా మూడు స్లాట్ డిజైన్‌లో డిఆర్‌ఎల్‌లు అమర్చబడి ఉంటాయి మరియు అల్లాయ్ వీల్స్ కారు మొత్తం థీమ్‌ తో సరిపోతాయి.

    Hyundai i10 N Line Could Be The Grand i10 Nios Hot Hatch In India!

    ఐ 10 ఎన్ లైన్ ఐరోపాలో 2020 వేసవిలో అమ్మకం కానుంది. అయితే అది భారతదేశానికి వస్తుందా? హ్యుందాయ్ ఐ 10 ఎన్ లైన్‌ను ఇక్కడికి తీసుకువస్తుందని ఊహాగానాలు చెలరేగాయి. కానీ దీనికి ముందు, వారు 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించే మంచి అవకాశం ఉంది. అది డిమాండ్‌కు దారితీస్తే, వారు 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో భారతదేశానికి తీసుకురావచ్చు.

    ఇది కూడా చదవండి: వోక్స్‌వ్యాగన్ ID.3, ఆల్-ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ వెహికల్, ఫ్రాంక్‌ఫర్ట్ వద్ద వెల్లడించింది

    హ్యుందాయ్ ఐ 10 ఎన్ లైన్‌ను భారత్‌కు తీసుకురావాలని నిర్ణయించుకుంటే, అది ఖచ్చితంగా గ్రాండ్ ఐ 10 నియోస్‌కు ఆ ట్యాగ్ జోడించబడుతుంది, ఎలాగైతే టియాగో JTP టియాగోకు జోడించబడిందో లేదా పోలో GT TSI పోలోకు జోడించబడిందో అదే విధంగా ఇది కూడా జోడించబడుతుంది. హ్యుందాయ్ ఐ 10 ఎన్ లైన్‌ను భారత్‌కు తీసుకువస్తే టాప్-స్పెక్ గ్రాండ్ ఐ 10 నియోస్‌ పై లక్ష రూపాయల ప్రీమియంను ఆశిస్తారు. ప్రస్తుతం గ్రాండ్ ఐ 10 నియోస్ ధర రూ .4.99 లక్షల నుంచి రూ .7.99 లక్షల(ఎక్స్-షోరూమ్ ఇండియా) మధ్య ఉంది. 

    మరింత చదవండి: గ్రాండ్ ఐ 10 నియోస్ AMT

    was this article helpful ?

    Write your Comment on Hyundai గ్రాండ్ ఐ 10 నియోస్ 2019-2023

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం