20 చిత్రాలలో వివరించబడిన హ్యుందాయ్ ఎక్స్టర్
హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం ansh ద్వారా జూలై 20, 2023 11:47 am ప్రచురించబడింది
- 4.5K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హ్యుందాయ్ ఎక్స్టర్ క్యాబిన్ రంగులలో తప్ప దాదాపుగా గ్రాండ్ ఐ10 నియోస్ క్యాబిన్‌తో సమానంగా ఉంటుంది.
-
ఎక్స్టర్, గ్రాండ్ i10 నియోస్‌పై ఆధారపడి ఉంటుంది మరియు అదే పోలికతో రూపొందించిన క్యాబిన్‌ను పంచుకుంటుంది.
-
H- ఆకారపు లైట్ సిగ్నేచర్‌లతో ముందు మరియు వెనుక ఒక బోల్డ్ SUV డిజైన్‌ను కలిగి ఉంటుంది.
-
పూర్తిగా నలుపు రంగుతో కూడిన సెమీ-లెథెరెట్ అప్హోల్స్టరీతో క్యాబిన్ ఉంటుంది.
-
8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు సింగిల్-పేన్ సన్‌రూఫ్ వంటి అంశాలు అందించబడ్డాయి
-
1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 83PS మరియు 114Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
-
హ్యుందాయ్, ఎక్స్టర్ ధరను రూ. 6 లక్షల నుండి రూ. 10.10 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది.
హ్యుందాయ్ గ్యారేజ్ లో, కొత్త కారు హ్యుందాయ్ ఎక్స్టర్, రూ. 6 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ప్రారంభించబడింది మరియు ఇది గ్రాండ్ ఐ10 నియోస్ యొక్క హ్యాచ్‌బ్యాక్ పై ఆధారపడిఉంది . ఇది గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ వలె అదే క్యాబిన్ డిజైన్‌తో వస్తుంది,కానీ SUV రూపంలో వస్తుంది. మేము ఎక్స్టర్‌తో దగ్గరగా కొంత సమయం గడిపాము మరియు ఇప్పుడు, మీరు ఈ వివరణాత్మక చిత్రాల ద్వారా దీని గురించి తెలుసుకోవచ్చు .
బాహ్య రూపము
ముందు భాగము
హ్యుందాయ్ ఎక్స్టర్ బాగా వివరించదగిన ఫీచర్లు మరియు బాక్సీ అవుట్‌లైన్‌తో బోల్డ్ ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది. ఇది చంకీ బంపర్‌లో ఎక్కువ భాగం తీసుకుంటుంది మరియు అంచుల వరకు విస్తరించి, చతురస్రాకారపు ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌ల కోసం హౌసింగ్‌తో కలిసిపోయే ఆకృతి గల గ్రిల్‌ను పొంది ఉంది . ముఖ్యమైన స్కిడ్ ప్లేట్ కి దృఢమైన డిజైన్ జోడింపబడింది.
మైక్రో-SUV స్ప్లిట్-హెడ్‌లైట్ డిజైన్ కోసం బోనెట్ లైన్‌తో పాటు విలక్షణమైన H-ఆకారపు LED DRLలను కలిగి ఉంది.
ఇది కూడా చదవండి:హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ vs వెన్యూ Vs ఎక్స్టర్: ధరల పోలిక
ప్రక్క భాగము
ఎక్స్టర్ యొక్క ప్రక్కభాగము, అది ఎంత పొడవుగా మరియు నిటారుగా ఉందో ఎంత మెరుగైనదో మీకు తెలుయచేస్తుంది. దీని యొక్క వెనుక భాగము మరింత విస్తృత వైఖరి తో మందపాటి క్లాడింగ్ తో కలిపి, వైవిధ్యమైన ఆకృతిని కలిగి ఉంది. ఇక్కడ దాని అగ్ర శ్రేణి వేరియంట్లో చూస్తే, బ్లాక్-అవుట్ పిల్లర్లు మరియు రూఫ్ రైల్స్ వంటి ప్రీమియం టచ్‌లను పొందుతుంది.
గ్రిల్‌కు సరిపోయేలా సి-పిల్లర్‌పై చిన్న ఆకృతి గల విభాగం కూడా ఉంది.
హ్యుందాయ్ SUV 175-సెక్షన్ రబ్బరుతో చుట్టబడిన 15-అంగుళాల డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.
వెనుక భాగం
వెనుక భాగము మేము ముందు చూసిన బోల్డ్ రూపాన్ని కలిగి ఉంది, ఇది ముందు డిజైన్ కు బాగా సరిపోతుంది. ఇది స్ట్రెయిట్ లైన్స్‌తో కూడిన మస్క్యులర్ వెనుక భాగమును మరియు ఎత్తైన సిల్వర్ స్కిడ్ ప్లేట్‌ను చూపించే భారీ బంపర్‌ను పొందింది.
టెయిల్ ల్యాంప్‌లు H-ఆకారపు LED ఎలిమెంట్ లను కూడా పొందుతాయి మరియు హ్యుందాయ్ లోగోను కలిగి ఉన్న గ్రిల్ వలె అదే ఆకృతితో ఒక మందపాటి నలుపు రంగు స్ట్రిప్‌తో కలుపబడి ఉంటాయి.
లోపలి భాగము
డాష్బోర్డు
ఎక్స్టర్ గ్రాండ్ i10 నియోస్ వలె అదే డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కలిగి ఉంది మరియు రంగుల మేళవింపులో మాత్రమే వ్యత్యాసము ఉంది ఎక్స్టర్ పూర్తిగా నలుపు రంగు క్యాబిన్‌తో వస్తుంది, అయితే రూఫ్ లైనింగ్ మరియు పిల్లర్ల లోపలి భాగాలు బూడిద రంగుతో ఉంటాయి బయటి రంగు ఆధారంగా క్యాబిన్ యాక్సెంట్‌లతో కలర్ స్ప్లాష్ కూడా ఉంది.
ఇక్కడ, మీరు డ్యాష్‌బోర్డ్‌లోని ప్రయాణీకుల వైపు డైమండ్ నమూనాను మరియు AC వెంట్ చుట్టూ ఉన్న నీలి రంగు ఇన్సర్ట్‌ను కాస్మిక్ బ్లూ ఎక్స్‌టీరియర్ షేడ్‌తో సరిపోల్చవచ్చు (బాహ్య రంగు ఆధారంగా కలర్ భిన్నంగా ఉంటుంది). చిన్న వస్తువులను ఉంచడానికి ఒక చిన్న స్థలము కూడా ఉంది.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ టాటా పంచ్ కంటే అధికంగా ఈ 7 ఫీచర్లను పొందింది
గ్రాండ్ i10 నియోస్ నుండి ఎక్స్టర్ డ్యాష్‌బోర్డ్‌కి చేసిన కీలక మార్పులలో ఒకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. మైక్రో SUV 4.2-అంగుళాల TFT మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేతో ప్రామాణికంగా రుపొందించబడిన సెటప్‌ను కలిగి ఉంది. అగ్ర శ్రేణి వేరియంట్ కూడా లెదర్తో చుట్టబడిన స్టీరింగ్ వీల్‌తో వస్తుంది, ఇక్కడ వెలుపలికి సరిపోయేలా కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో చూడవచ్చు.
ఈ కోణం నుండి, ఎక్స్టర్ యొక్క డ్యూయల్-కెమెరా డాష్ క్యామ్ ఎర్గోనామిక్‌గా అలాగే IRVM వెనుక మరియు కొద్దిగా ఎడమ వైపున ఉంచబడినట్లు కనిపిస్తోంది, తద్వారా ముందుకు వెళ్లే రహదారిపై డ్రైవర్ వీక్షణకు అంతరాయం కలగదు.
హ్యుందాయ్ ప్యాడిల్ షిఫ్టర్‌లతో ఎక్స్టర్ AMTని అందించడం ద్వారా ఈ విభాగంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలచింది.
ఇన్ఫోటైన్మెంట్ & క్లైమేట్ కంట్రోల్
ఎక్స్టర్ గ్రాండ్ i10 నియోస్‌లో కూడా కనిపించే విధంగా ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే తో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందిస్తుంది.
ఆటో AC (వెనుక AC వెంట్లతో) కోసం వాతావరణ నియంత్రణ కూడా హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్‌లో కనిపించే ప్యానెల్ వలె ఉంటుంది. వృత్తాకార AC వెంట్లలో అందించిన విధంగా డయల్ డెయిల్ చుట్టూ ప్రకాశవంతమైన అసెంట్లను అందించడం జరిగింది.
వాతావరణ నియంత్రణ కింద, మీరు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌తో పాటు 12V పవర్ సాకెట్‌తో పాటు USB టైప్-C మరియు టైప్-A పోర్ట్‌లను పొందవచ్చు.
ఇవి కూడా చూడండి:మీరు హ్యుందాయ్ ఎక్స్టర్‌ను 9 విభిన్న రంగులలో కొనుగోలు చేయవచ్చు
సీట్లు
సీట్ల విషయానికి వస్తే, మధ్యలో సెమీ-లెదర్ అప్హోల్స్టరీ తో ఫాబ్రిక్ మరియు అన్ని ప్రక్కల లెదర్ ఎలిమెంట్లు అందించబడతాయి. ఫాబ్రిక్ బ్యాక్‌రెస్ట్‌ల రంగు కూడా బాహ్య రంగులపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ, కాస్మిక్ బ్లూ పెయింట్ ఎంపికకు సరిపోయేలా సీట్లలో క్రాస్ స్టిచింగ్ మరియు బీడింగ్ కూడా లభిస్తుంది.
ఈ సీట్ల నుండి, మీరు వాయిస్-కంట్రోల్డ్ సింగిల్-పేన్ సన్‌రూఫ్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు, ఇది హ్యుందాయ్ ఎక్స్టర్‌కు ప్రతిష్టాత్మకమైనది అలాగే మైక్రో-SUV సెగ్మెంట్‌లో మొదటిది.
హ్యుందాయ్ ఎక్స్టర్ ధర రూ. 6 లక్షల నుండి రూ. 10.10 లక్షల మధ్య ఉంది (పరిచయ, ఎక్స్-షోరూమ్) మరియు దీనికి ప్రత్యక్ష ప్రత్యర్థి టాటా పంచ్ అలాగే మారుతీ ఇగ్నిస్. మారుతీ ఫ్రాంక్స్, సిట్రోయెన్ C3, రెనాల్ట్ కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి మైక్రో-ఎస్‌యూవీలను కూడా ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు.
మరింత చదవండి:హ్యుందాయ్ ఎక్స్టర్ AMT