హోండా WR-V: మీకు తెలియని 5 విషయాలు
published on మార్చి 27, 2019 01:18 pm by cardekho for హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020
- 12 సమీక్షలు
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మా మొదటి డ్రైవ్ సమీక్ష చదివిన తర్వాత మీకు ఖచ్చితంగా WR-V గురించి తెలుసుకోవలసిన అంశాలు మీకు తెలిసే ఉండాలి. ఈ కారు హోండా యొక్క మొదటి సబ్-4 మీటర్ క్రాస్ఓవర్ గా ఉంటుంది మరియు ఇతర క్రాస్-హ్యాచ్ లు అయిన హ్యుందాయ్ i20 యాక్టివ్ మరియు క్రాస్ ఓవర్స్ అయిన మారుతి విటారా బ్రజ్జా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి వాటితో పోటీ పడుతుంది.
అయితే, మీకు ఇంకా తెలియనటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి:
హోండా ఇండియా R&D చే అభివృద్ధి చేయబడిన గ్లోబల్ ప్రోడక్ట్
హోండా WR-V దాని యొక్క చాలా అంశాలను జాజ్ మరియు సిటీ తో పంచుకుంటుంది. ఎందుకంటే ఈ మూడు కార్లు ఒకే ప్లాట్‌ఫార్మ్ పై ఆధారపడి ఉంటాయి.అయినప్పటికీ, హోండా కార్ ఇండియా యొక్క R & D డివిజన్ కారును సరిగ్గా కఠినమైన రహదారి సామర్థ్యానికి తిరిగి మార్చింది మరియు అది ఆధారపడి ఉన్న హాచ్బ్యాక్స్ తో పోలిస్తే అది ప్రత్యేకమైనదిగా కనిపించేలా డిజైన్ చేయబడింది. WR-V భారతీయ రోడ్డు పరిస్థితులను మనసులో ఉంచుకొని అభివృద్ధి చెందుతోంది, కానీ బ్రెజిల్ తో సహా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో విక్రయించబడుతోంది.
బ్రెజిల్ కారులో ఉండే అదే గ్రౌండ్ క్లియరెన్స్
పేపర్ మీద చూస్తే భారతదేశం-స్పెక్ WR-V 188mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. అందరూ ఏమనుకున్నారంటే బ్రెజిల్ మోడల్ కి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లా 200mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, ఇండియా మోడల్ కి తక్కువ ఉంది అని భావించారు కానీ, ఈ విషయంలో ఈ రెండు కార్ల మధ్య ఎటువంటి తేడా లేదు. ఎందుకంటే భారతదేశం కనీస గ్రౌండ్ క్లియరెన్స్ వేరలా కొలవడం జరుగుతుంది, బ్రెజిల్ లో వేరొక పద్ధతి ఉపయోగిస్తారు.
బ్రెజిల్ లో 1.5 లీటర్ పెట్రోల్
హోండా యొక్క క్రాస్ ఓవర్ యొక్క లోపము దాని తక్కువ పవర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 1.2 లీటర్ యూనిట్ జాజ్ తో పంచుకుంది మరియు దీనిలో పెద్ద పంచ్ లేదు. WR-V జాజ్ కన్నా భారీగా ఉండటం వలన ఇది సాయపడదు. ఏదేమైనప్పటికీ, బ్రెజిల్ కారు 1.5 లీటర్ i-VTEC ఇంజిన్ ను పొందుతుంది, ఇది మంచి పనితీరును అందిస్తుంది.
WR-V ఒక సబ్ -4 మీటర్ కార్ గా ఉన్నందున, అధనపు డ్యూటీ టాక్స్ లు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం) పడకుండా ఉండే విధంగా, హోండా కార్ ఇండియా 1.2 లీటర్ పైగా పెట్రోలు ఇంజిన్ ను ఉపయోగించదు. ఒకవేళ అలా గానీ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది.
HR-V సస్పెన్షన్
WR-V మెరుగైన స్థిరత్వం మరియు చెడు రహదారి సామర్థ్యం కోసం HR-V మిడ్-సైజు SUV నుండి స్వీకరించబడిన సస్పెన్షన్ భాగాలు ఉపయోగిస్తుంది.
BR-V ఆధారిత ట్రాన్స్మిషన్
పెట్రోల్ ఇంజిన్ జాజ్ నుంచి తీసుకున్నా కూడా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రం భిన్నంగా ఉంటుంది.హోండా ఏం చెప్తుంది అంటే, ఇది BR-V లో కనిపించే యూనిట్ పై ఆధారపడిన హోండా ఒక "హెవీ డ్యూటీ, అధిక బరువు కాటగిరీ ట్రాన్స్మిషన్". గేర్ నిష్పత్తులు మరలా మరలా మార్చబడ్డాయి, అయితే ముఖ్యంగా కారు యొక్క పనితీరును ఆఫ్-ది-మార్క్ ని మెరుగుపరచడం జరిగింది. అయితే, మా మొదటి డ్రైవ్ లో ఎలాంటి వ్యత్యాసం కనిపించలేదు.
- Renew Honda WRV 2017-2020 Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful