ఈ WR-V జాజ్ లో ఉండేటటువంటి అవే పవర్ ట్రెయిన్ ని కలిగి ఉంది. అయితే దీనిలో జాజ్ లో ఉన్నటువంటి ఆప్ష్నల్ CVT ఆటోమెటిక్ లేదు. అయితే 1.2 పెట్రోల్ కొత్త 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ని కలిగి ఉంది. హోండా చెబుతుంది, ఈ ట్రాన్స్మిషన్ BR-V లో ఉన్న గేర్బాక్స్ మీద ఆధారపడి ఉంటుందని మరియు దీనిలో ఆక్సిలరేషన్ అభివృద్ధి చేయడం జరిగింది కానీ దీనివలన వచ్చే లాభాలు ఏవీ కూడా మనదానిలో కనిపించవు.
నిజం చెప్పాలంటే 90Ps పెట్రోల్ ఇంజన్ నీరసత్వంగా ఉంటుంది. మీరు ఒక్కరే ప్రయాణం చేసినట్లయితే మోటార్ బాగా పనిచేస్తుంది, కానీ అందరు ప్రయాణికులు నిండి ఉన్నట్లయితే మీరు ఇంజన్ కి బాగా ఎక్కువ యాక్సిలరేషన్ ఇవ్వాలి. ఈ ఇంజన్ చాలా స్మూత్ గా మరియు మంచి శబ్ధం కలిగి ఉంటుంది. ఇది 110Nm టార్క్ ని 5000rpm దగ్గర అందిస్తుంది దీనివలన కొండలు అలాంటివి ఎక్కాలంటే కష్టపడాలి. ఈ WR-V పెట్రోల్ జాజ్ లో ఇదే వేరియంట్ తో పోల్చుకుంటే 62Kg భారీగా ఉంటుంది మరియు మార్చిన గేరింగ్ వలన మైలేజ్ కొంచెం తగ్గి 17.5kmpl ఇస్తుంది.
1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అదే 100Ps పవర్ మరియు 200Nm టార్క్ ని అందిస్తుంది మరియు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్ తక్కువ టార్క్ లో కూడా బాగుంటుంది మరియు తక్కువ స్పీడ్ తో ఎక్కువ గేర్ కలయికను కలిగి ఉంటుంది. దీని యొక్క పవర్ డెలివరీ అన్ని వేళలా స్మూత్ గా మరియు సమానంగా ఉంటుంది. కానీ దీని డ్రైవింగ్ సులభంగా మాత్రమే ఉంటుంది, కానీ ఎంజాయి చేసే విధంగా ఉండదు. ఎక్కువగా ఆక్సిలరేషన్ ఇవ్వడం వలన చాలా నాయిస్ వస్తుంది, కానీ స్పీడ్ ఏమీ పెరగదు. మీ డ్రైవింగ్ స్టయిల్ రిలాక్స్డ్ గా ఉంటే సిటీలో లేదా హైవే లో మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. ఒక ఫ్యామిలీ కారు కావాలనుకొనే వినియోగదారులకు ఇది చాలా బెటర్ ఇంజన్. వేరియంట్ ని బట్టి WR-V డీజిల్ 31 నుండి 50kg లు జాజ్ కంటే భారీగా ఉంటుంది, కానీ పనితీరులో గుర్తించదగినంత తేడా ఏమీ లేదు. కానీ 25.5Kmpl దగ్గర ఇంధన సామర్ధ్యం 1.8Kmpl తగ్గుతుంది.
హోండా చెబుతుంది WR-V యొక్క సస్పెన్షన్ భాగాలు దాని మిడ్ సైజ్ SUV అయిన HR-V నుండి తీసుకోబడినవి. దీని యొక్క పెద్ద వీల్ ట్రావెల్ మరియు పెద్ద వీల్స్ వలన గతకల రోడ్డుల మీద కూడా సులభంగా ప్రయాణం చేయవచ్చు. ఈ క్రాసోవర్ఫ్ రఫ్ రోడ్ సామర్ధ్యం ఇది ఆధారపడి ఉన్న హ్యాచ్బాక్ కంటే ఎక్కువ. అయితే మొత్తం సస్పెన్షన్ సెటప్ కొద్దిగా సాఫ్ట్ గా ఉంటుంది, ముఖ్యంగా పెట్రోల్ ఇంజన్ వెర్షన్ లో.
దీని ఫలితంగా వాహనం పైకి క్రిందకి కదులుతూ ఉంటుంది మరియు ప్రక్కకి ఊగుతూ ఉంటుంది. ఈ కారణం చేత అధిక స్పీడ్ లో ప్రశాంతత తగ్గుతుంది. అలాగే కార్నర్స్ లో వెళ్ళేటపుడు కూడా కారు బాడీ ఊగినట్టుగా ఉంటుంది. అందువలన ఇది వినోదాన్ని అందించదు కానీ దీని పెద్ద వీల్ బేస్ మరియు వెడల్పు టైర్స్ వలన అధిక వేగాలలో సురక్షితంగా ఫీల్ అవుతారు.
దీని హ్యాండిలింగ్ చాలా డీసెంట్ గా ఉంటుంది. దీనిలో SUV మార్పులు ఉన్నప్పటికీ ఇది ఒక హ్యాచ్‌బ్యాక్ లా ప్రవర్తిస్తుంది. దీని స్టీరింగ్ చాలా బాగుంటుంది మరియు డ్రైవింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఆఫ్ రోడ్ సామర్ధ్యం: దీనిలో 188mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నా సరే, WR-V పట్టణ ప్రాంతాలకు తగ్గట్టుగానే ఉంటుంది మరియు దీనిలో ఆల్ వీల్ డ్రైవ్ లేదు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా లేదా రోడ్డు బాలేకపోయినా WR-V తో కొంచెం కష్టమనే చెప్పాలి.
టెక్నాలజీ: ఈ WR-V కొత్త హోండా సిటీ లో ఉన్నటువంటి అదే ఆండ్రాయిడ్ ఆధారిత "డిజిపాడ్"ఇంఫొటైన్మెంట్ సిష్టం ని కలిగి ఉంది. అలాగే దీనిలో మిర్రర్ లింక్,WI-FI కనెక్టివిటీ HDMI పోర్ట్ తో ఉన్నాయి. ఈ మిర్రర్ లింక్ కి ఫోన్ USB ద్వారా కనెక్ట్ చేసుకోవడం అవసరం, తద్వారా ఈ ఫీచర్ లో ఉన్న యాప్స్ మీరు ఉపయోగించుకోవచ్చు. ఇంకా దీనిలో మ్యూజిక్ ప్లేయర్ మరియు నావిగేషన్ యాప్ వంటి ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో పోల్చుకుంటే యాప్స్ సంఖ్య పరిమితంగా ఉన్నాయి.
దీనిలో WIFI కనెక్షన్ ద్వారా మీరు దగ్గర లో ఉన్న WIFI ని కనెక్ట్ చేసుకోవచ్చు తద్వారా బ్రౌజర్ యాప్ తో ఫంక్షన్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. WIFI వాడడానికి మీకు USB రిసీవర్ కావాలి. ఒక్కసారి కనెక్ట్ అయితే మీరు ఇంఫొటైన్మెంట్ డిస్ప్లే ద్వారా ఏ వెబ్‌సైట్ ని అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనిలో ఇన్-బిల్ట్ నావిగేషన్ వ్యవస్థ ద్వారా లైవ్ ట్రాఫిక్ అప్డేట్స్ ని రిసీవ్ చేసుకోవచ్చు. అధనంగా, ఈ సెటప్ నావిగేషన్,ఎంటర్టైన్మెంట్ మరియు టెలిఫోనీ సిష్టంస్ కొరకు వాయిస్ కమాండ్ ని కలిగి ఉంది. ఇతర లక్షణాలైన ఇంఫొటైన్మెంట్ సిష్టం మీడియా ఫైల్స్ కొరకు SD స్లాట్ ని,బ్లూటూత్ ఆడియో స్ట్రీమింగ్ మరియు 1.5GB ఇంటర్నల్ మెమొరీతో టెలీఫోనీ ని కలిగి ఉంది.