హోండా వారు తమ ప్రాజెక్ట్ 2 & 4 ను ఆటో ఎక్స్పో లో బహిర్గతం చేసారు

ఫిబ్రవరి 04, 2016 03:40 pm saad ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

సాధారణంగా ఆటో ఎక్పో భిన్నంగా మరియు ఆశ్చర్యపరిచేదిగా ఉన్న నవీకరణలతో మరియు వినోద విశేషాలతో ఎంతో ఉత్సాహకరంగా కొనసాగుతుంది. ఇటువంటి ఒక కాన్సెప్ట్ ఫిలాసఫీ ను హోండా వారు కొనసాగుతున్న ఆటో ఎక్స్పో లో ప్రదర్శించారు. ఈ హోండా వారు ప్రాజెక్ట్ 2& 4 అనేది ఒక క్యాబిన్ లేనటువంటి మరియు పైకప్పు లేనటువంటి ఒక వాహనం. జపనీస్ తయారీదారుల ప్రకారం ఈ కాన్సెప్ట్ ఒక మోటార్ సైకిల్ లాగా మరియు ఒక కారుకి ఉండేటటువంటి తీరుతెన్నులను కలిగి సౌకర్యవంతంగా ఉంటుంది.

హోండా వారి ఈ కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా తమ 80 ఇంజినీర్లకు మరియు డిజైనర్లకు ఎన్నో అవార్డ్డులను గెలిపించింది. హోండా వారి అసకా మోటార్ సైకిల్ డిజైన్ సెంటర్ ద్వారా మార్టీన్ పెటర్సన్ ఈ పోటీ లలో ఎన్నో అవార్డ్డులను గెలుచుకున్నారు. డిజైన్ పరంగా ఈ వాహనం ప్రత్యేకమైన రెండు విష్బోన్ సస్పెన్షన్ లను కలిగి మధయ్లో అమర్చిన ఫ్యుయల్ ట్యాంక్ తో మరియు మలచుకోగలిగే డాంపర్లను కలిగి ఉంటుంది. డ్రైవర్ యొక్క సీటు బయటకి కనిపిస్తూ కారు యొక్క ప్రయాణంలో ఉత్తేజం కలిగించేదిగా ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్ 2&4కాన్సెప్ట్ సింగిల్ సీటర్ గా ప్రదర్శించినప్పటికీ ఇది ఒక అదనపు ప్రదేశాన్ని కలిగి అది వీలుని బట్టి అమర్చుకొనే సౌకర్యంతో ఉంటుంది. ఈ వాహనం RC 213 నుండి ఇంజిన్ పొంది 999cc మోటార్ తో 212bhp సామర్ధ్యాన్ని 13000Rpm వద్ద అందించగలుగుతుంది. అంతేకాకుండా ఒక ప్రత్యేకంగా చేయబడినటువంటి ఒక టైటానియం ఎగ్జాస్ట్ వ్యవస్థను కలిగి ఉంటుంది. కేవలం405kg ల బరువుతో 6 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మిష ని కలిగి ఈ ప్రాజెక్ట్ 24 అద్భుతమైన వేగాన్ని సౌకర్యాన్ని అందించగలుగుతుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience