భారతదేశంలో హోండా జనవరి 2016 నుండి రూ. 10,000 నుండి 16,000 ల వరకు ధరల పెంపు ఉంటుందని ప్రకటించింది.
న్యూ డిల్లీ ;
భారతదేశంలో హోండా కార్స్ వారు వాటి అన్ని కార్ల ఉత్పత్తుల కి రూ.16,000. ల వరకు ధరల పెంపు ని ప్రకటించింది. జపనీస్ కార్ ఉత్పత్తిదారుడు కార్లని బ్రియో (ఎంట్రీ స్థాయి చిన్న కారు) ధర. రూ. రూ 4.25 లక్ష లు ,(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుండి , CR-V, ధర . రూ. 25.13 వరకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు విక్రయిస్తుంది. ఎప్పుడయితే తయారీ లో ఇన్ పుట్ ఖర్చులు పెరుగుతాయో అప్పుడు ధరల పెంపు ని ప్రకటిస్తామని తెలియజేసింది. ఈ ధరల పెంపు సుమారు రూ. 10,000 నుండి 16,000 ల వరకు కారు యొక్క మోడల్ ని బట్టి ఉంటుందని చెప్పారు.
"జనవరి నుంచి రూ 10,000-16,000 వరకు మోడల్ ఆధారంగా ధరలు పెంచుతున్నట్లు, ఈ ధరల పెరుగుదల ఇన్ పుట్ ఖర్చులు పెరగటం కారణంగా తప్పనిసరి అయినదని," హోండా కార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ తెలియజేసారు.
ఈ కార్ల యొక్క ధరల పెంపు పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి కాదు. దీనికి పోటీగా ఉన్నటువంటి దాదాపు అన్ని కార్ల తయారీదారులు దాదాపు ఇదే విధమయిన ధరల పెంపు ని ఇప్పటికే ప్రకటించారు .
ఎప్పుడయితే హ్యుందాయ్ 30,000వరకు ధరల పెంపు ని ప్రకటించినదో మారుతి కుడా 20,000 లు పెంచింది నిస్సాన్ మరియు స్కోడా సంస్థలు తమ ధరలని 3% వరకు పెంచుతామని ప్రకటించారు. ఈ పెరిగిన ధరలు జనవరి , 2016 నుండి అమలులో ఉంటాయి.
బ్రియో అమెజ్, సిటీ ,మోబిలియో జాజ్ మరియు సి ఆర్ వి , వంటి కార్లని విక్రయిస్తూ , హోండా ప్రస్తుతం భారత మార్కెట్ లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.