2016 భారత ఆటో ఎక్స్పో కోసం లైనప్ ను ప్రకటించిన హోండా
జనవరి 19, 2016 12:05 pm raunak ద్వారా సవరించబడింది
- 27 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారత ఆటో ఎక్స్పో వద్ద బి ఆర్ వి ప్రీమియర్ తో పాటు కొత్త ఎకార్డ్ కూడా ప్రదర్శింపబడుతుంది దీనితో పాటు, జాజ్ రేసింగ్ కాన్సెప్ట్ కూడా ప్రదర్శన ఉంటుంది.
హోండా కార్స్ భారతదేశం లిమిటెడ్ (హెచ్సీఐఎల్) 2016 ఆటో ఎక్స్పో వద్ద వారి లైనప్ ను ప్రకటించింది. జపనీస్ తయారీదారుడు, బి ఆర్ వి కాన్సెప్ట్ క్రాస్ ఓవర్ / ఎస్యువి ను మరియు ఎకార్డ్ తో పాటు హోండా ప్రోజెక్ట్ 2 & 4, హోండా జాజ్ రేసింగ్ కాన్సెప్ట్ వంటి కాన్సెప్ట్ వెర్షన్లు అలాగే బ్రియో, జాజ్, అమేజ్, సిటీ, మొబిలియో, సి ఆర్ వి వంటి ఉత్పత్తి మోడళ్ళను ప్రదర్శించనున్నాడు. ఎల్లప్పుడూ, హోండా కూడా అసిమో (వినూత్న మొబిలిటీ అడ్వాన్స్డ్ దశ) హ్యూమనాయిడ్ రోబోట్ ను ప్రదర్శిస్తుంది. అంతేకాక, మెక్లారెన్-హోండా ఎం పి4- 30 ఎఫ్ 1 రేసింగ్ కారు కూడా ఎక్స్పో వద్ద ప్రదర్శించబడుతుంది.
హోండా బి ఆర్ వి వాహనం, ఎక్స్పో వద్ద భారతదేశంలోకి అరంగేట్రం చేయనుంది మరియు ఈ వాహనం, హ్యుందాయ్ క్రెటా , డస్టర్ ఫేస్లిఫ్ట్ (ఎక్స్పో వద్ద బహిర్గతం) మరియు ఇతర వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. ఈ బి ఆర్ వి వాహనం, మూడు వరుసల సీటింగ్ తో వస్తుంది. ఈ వాహనం, 1.5 లీటర్ ఐ విటెక్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ ఐ డి టెక్ డీజిల్ వంటి ఇంజన్ లతో అందుబాటులో ఉంది. ఈ పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్ లు కూడా, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. అదే పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో కూడా వచ్చే అవకాసాలు ఉన్నాయి.
ఎకార్డ్ యొక్క తాజా వెర్షన్, 2016 ఆటో ఎక్స్పో వద్ద హోండా లైనప్ లో చేరనుంది మరియు ఇది, ప్రపంచ 9 వ తరం మోడల్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ గా ఉంటుందని భావిస్తున్నారు. ఫేస్లిఫ్ట్ మోడల్ జూలై 2015 బహిర్గతమైంది. ఈ ఫేస్లిఫ్ట్ వెర్షన్ యొక్క లోపలి మరియు బాహ్య భాగాలలో అనేక మార్పులు జరిగాయి. ఎక్కువ మార్పులు ఈ వెర్షన్ యొక్క లోపలి భాగంలో జరిగాయి అవి వరుసగా, హోండా యొక్క కొత్త 7 అంగుళాల సమాచార వ్యవస్థ, ఆపిల్ కార్ ప్లే కు మద్దతు మరియు గూగుల్ ఆండాయిడ్ ఆటో వంటివి అదనంగా అందించబడ్డాయి. యాంత్రికంగా, ఈ ఎకార్డ్ వాహనంలో 2.4 లీటర్ ఐ వి టెక్ పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు మరియు ఇది, 6- స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ లతో జత చేయబడే అవకాశం ఉంది. హోండా టయోటా క్యామ్రీ హైబ్రిడ్ యొక్క ప్రజాదరణ పరిగణనలోకి తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా సంస్థ, ఎకార్డ్ యొక్క హైబ్రిడ్ వెర్షన్ ను అందించేఅ అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి: