డిజైన్ స్కెచ్‌తో హ్యుందాయ్ ఎక్స్టర్ ఫస్ట్ లుక్ మీ కోసం
టాటా పంచ్ؚతో పోటీ పడే ఈ హ్యుందాయ్ కొత్త మైక్రో SUV జూన్ؚలో ఆవిష్కరించబడుతుందని అంచనా
-
SUV అనుభూతి కలిగించే కొన్ని దృఢమైన అంశాలతో నిటారైన, బాక్సీ డిజైన్ؚను హ్యుందాయ్ ఎక్స్టర్ కలిగి ఉంటుంది.
-
ఇతర విజువల్ అంశాలతో పాటు H-ఆకారపు LED DRLలు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ؚలు, మరియు రూఫ్ రెయిల్స్ؚను కలిగి ఉంటుంది.
-
భారీ టచ్‌స్క్రీన్ సిస్టమ్, వైర్ؚలెస్ ఛార్జర్, క్రూజ్ కంట్రోల్, మరియు ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు ఉంటాయని అంచనా.
-
మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికతో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది.
-
ధర సుమారు రూ.6 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.
హ్యుందాయ్ ఎక్స్టర్ SUV డిజైన్ స్కెచ్ؚను కొత్త టీజర్ؚలో అందించింది. ఈ కొత్త మైక్రో SUV జూన్‌లోగా విడుదల కానుంది. ఇది టాటా పంచ్, నిసాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్, మరియు సిట్రోయెన్ C3 వంటి వాటితో పోటీ పడనుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్ ముందు భాగం జియోమెట్రిక్ షేప్స్‌ల నుండి ప్రేరణ పొంది బాక్సీ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది నాజూకైన నల్లని చారతో అనుసంధానించబడిన H-ఆకారపు LED DRLలతో వస్తుంది. విలక్షణంగా రూపొందించిన గ్రిల్ؚలో రెండు చతురస్రాకార అకారపు కేసులలో కవర్ చేసిన LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ؚలు ఉంటాయి. దిగువ భాగంలో, దీని ధృడమైన లుక్‌ను మరింతగా మెరుగుపరిచేలా ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌ను పొందింది
ఇది కూడా చదవండి: రూ.10 లక్షల కంటే తక్కువ ధరతో ఆటోమ్యాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో వచ్చే 10 అత్యంత చవకైన కార్‌లు
ఇతర డిజైన్ అంశాలలో రూఫ్ రైల్స్, టాల్-బాయ్ లుక్, మరియు కొద్దిగా పొడిగించిన వీల్ ఆర్చ్ؚలను చూడవచ్చు. H-ఆకారపు LED టెయిల్ ల్యాంప్ؚలు, విలక్షణమైన అలాయ్ వీల్స్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ؚను కూడా చూడవచ్చు.
హ్యుందాయ్ ఎక్స్టర్ యువతను ఆకర్షించే ఫీచర్‌లతో ప్రత్యేకంగా-కనిపించే క్యాబిన్‌తో వస్తుందని అంచనా. ఇందులో భారీ టచ్ؚస్క్రీన్ ఇన్ఫో టైన్ మెంట్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్ؚలెస్ ఛార్జర్, క్రూజ్ కంట్రోల్, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, వెనుక కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్‌లు ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ వెర్నా 2023 సమీక్ష నుండి నేర్చుకున్న 5 విషయాలు
ఎక్స్టర్ؚలో మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ఎంపికలతో గ్రాండ్ i10 నియోస్ 83PS 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. CNG కూడా ఎంపికగా అందిస్తారని ఆశిస్తున్నాము. మరింత ఆకర్షణీయమైన ప్రతిపాదనగా, హ్యుందాయ్ ఈ SUVలో 100PS 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను అందించవచ్చు.
హ్యుందాయ్ ఎక్స్టర్ ధరలు సుమారు రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటాయని అంచనా. ధరల పరంగా ఇది కొత్త ఎంట్రీ-లెవెల్ SUV స్థానంలో, నియోస్ మరియు i20ల మధ్య ఉంటుంది.
Write your Comment on Hyundai ఎక్స్టర్
Hundai should launch a car positioned between EON and NIOS