• English
  • Login / Register

సర్వీస్ కాస్ట్ పరంగా హోండా సిటీ హైబ్రిడ్ తన పెట్రోల్ వెర్షన్ؚతో ఎలా పోటీ పడుతుంది

honda city కోసం shreyash ద్వారా మార్చి 09, 2023 12:27 pm ప్రచురించబడింది

  • 37 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

10,000 కిమీల తర్వాత హోండా సిటి అన్నీ వేరియెంట్‌లకు సాధారణ నిర్వహణ అవసరం ఉంటుంది.

Honda City and Honda City Hybrid

హోండా ఐదవ-జనరేషన్ కాంపాక్ట్ సెడాన్ సిటీకి తేలికపాటి మార్పులను చేసింది. డీజిల్ ఇంజన్ؚను నిలిపివేస్తూ, ఈ సెడాన్ ఇంజన్ అలాగే ట్రాన్స్ؚమిషన్ ఎంపికలైన పెట్రోల్ మరియు హైబ్రిడ్ؚలను నిలుపుకుంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ సిస్టమ్ؚలో పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ రెండిటి ఆపరేషన్ ఉండటం వలన సాధారణ ICE వెర్షన్ సెడాన్ؚతో పోలిస్తే, దీని నిర్వహణ ఖర్చు ఎలా ఉంటుందని వినియోగదారులకు ఆందోళన ఉండవచ్చు. 

పది సంవత్సరాల కాలానికి (లేదా 1 లక్ష కిమీలకు) రెండు మోడల్‌ల సర్వీసింగ్ ఖర్చుల విభజన కింద ఇవ్వబడింది. 

సర్వీస్ ఖర్చు 

సంవత్సరం/కిమీ

హోండా సిటీ హైబ్రిడ్ 

హోండా సిటీ పెట్రోల్ 

e-CVT

MT

CVT

1వ సంవత్సరం/10,000కిమీ

రూ.  3,457

రూ.3,460 వరకు

రూ.3,460 వరకు 

2వ సంవత్సరం/20,000కిమీ 

రూ.  7,382

రూ.7,385 వరకు

రూ.8,941 వరకు 

3వ సంవత్సరం /30,000కిమీ

రూ.  6,213

రూ.6,216 వరకు 

రూ.6,216 వరకు 

4వ సంవత్సరం/40,000కిమీ 

రూ. 8,462

రూ.7,385 వరకు 

రూ.8,941 వరకు 

5వ సంవత్సరం/50,000కిమీ 

రూ.  5,817

రూ.5,820 వరకు

రూ.5,820 వరకు

6వ సంవత్సరం/60,000కిమీ 

రూ.  7,778

రూ.8,306 వరకు

రూ.9,337 వరకు 

7వ సంవత్సరం / 70,000కిమీ 

రూ.  5,817

రూ.5,820 వరకు 

రూ.5,820 వరకు 

8వ సంవత్సరం/80,000కిమీ 

రూ. 8,462

రూ.7,385 వరకు

రూ.8,941 వరకు

9వ సంవత్సరం/90,000కిమీ 

రూ. 6,213

రూ.6,216 వరకు 

రూ.6,216 వరకు 

10వ సంవత్సరం/1,00,000కిమీ 

రూ. 10,032

రూ.10,079 వరకు

రూ.11,769 వరకు 

10 సంవత్సరాలలో మొత్తం సర్వీస్ ఖర్చు

రూ.  69,633

రూ.68,072 వరకు

రూ.75,461 వరకు

*పరిత్యాగ ప్రకటనలు: 

  • పేర్కొన్న హోండా సిటి పెట్రోల్ వేరియెంట్‌ల సర్వీస్ ఖర్చు గరిష్టంగా సూచించబడింది, ఇది ఎంచుకున్న ఇంజన్ ఆయిల్ రకంపై (మినరల్, సింథటిక్ మరియు సింథటిక్ 2.0) ఆధారపడుతుంది.

  • ట్రాన్స్ؚమిషన్ ఫ్లూయిడ్, స్పార్క్ ప్లగ్ؚలు, బ్రేక్ ఆయిల్. కూలెంట్ؚలను మార్చవలసిన ఫ్రీక్వెన్సీ డ్రైవింగ్ శైలి, వాహన స్థితి లేదా వాహన వయసుపై ఆధారపడుతుంది. 

  • ఈ కథనంలోని నిర్వహణ షెడ్యూల్, హోండా సిఫార్సులను అనుసరించి వివరించబడింది. 

  • పట్టికలో పేర్కొన్న సర్వీస్ ఖర్చులు మారవచ్చు (ఢిల్లీ కోసం) వాహనం, డీలర్ మరియు ప్రదేశాన్ని బట్టి మొత్తం విలువ మారుతూ ఉంటుంది. 

2023 Honda City and City Hybrid

  • పై పట్టికలో చూసినట్లు, ఈ మూడింటిలో హోండా సిటీ పెట్రోల్ మాన్యువల్ వేరియెంట్ నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. పది సంవత్సరాలకు దీని మొత్తం సర్వీసింగ్ ఖర్చు రూ.68,072, ఇది పెట్రోల్ CVT మోడల్ కంటే రూ.7,389 తక్కువ మరియు హైబ్రిడ్ మోడల్ కంటే రూ.1,561 తక్కువ. 

  • ప్రతి 10,000 కిమీ తర్వాత సాధారణ మెయింటెనెన్స్ చేయించాలి, దీనిలో డ్రెయిన్ వాషర్, దుమ్ము మరియు పోలెన్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్ మార్పు ఉంటాయి. 

  • ప్రతి ప్రత్యామ్నాయ సర్వీస్ؚలో పెట్రోల్ CVT గేర్‌బాక్స్ ట్రాన్స్ؚమిషన్ ఆయిల్ మార్చవలసి ఉంటుంది, అయితే e-CVT హైబ్రిడ్ మరియు MT పెట్రోల్ వేరియెంట్‌లకు అవసరం ఉండదు. 

  • మూడు మోడల్‌లకు మూడవ సర్వీస్ ఖర్చు దాదాపుగా సమానంగా ఉంది, బ్రేక్ ఫ్లూయిడ్ మార్చవలసిన అవసరం అదనంగా ఉంటుంది. 

  • పెట్రోల్, హైబ్రిడ్ మోడల్‌ల CVT మరియు e-CVT ట్రాన్స్‌మిషన్లు రెండిటికీ నాలుగవ సర్వీస్ؚలో తాజా ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్ నింపవలసిన అవసరం ఉంటుంది, ఇది 40,000 కిమీ తర్వాత చేస్తారు. 

  • అలాగే, సిటీ మూడు మోడల్‌లకు ఐదవ సర్వీస్ ఖర్చు దాదాపుగా సమానం, ఎందుకంటే అన్నిటిలో కేవలం ఇంజన్ ఆయిల్, డ్రెయిన్ వాషర్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, దుమ్ము మరియు పోలెన్ ఫిల్టర్లను మార్చాల్సి ఉంటుంది. 

2023 Honda City ADAS

  • CVT పెట్రోల్ మరియు e-CVT హైబ్రిడ్ ట్రాన్స్ؚమిషన్‌లతో పాటు, సెడాన్ MT వేరియెంట్ؚకు కూడా 60,000 కిమీ తర్వాత తాజా ట్రాన్స్ؚమిషన్ ఆయిల్ అవసరం ఉంటుంది, MT ట్రాన్స్ؚమిషన్ ఆయిల్ ధర రూ.525 ఉంటుంది, CVT, e-CVTల ఆయిల్ ధర రూ.1,557 ఉంటుంది. 

  • మూడు మోడల్‌ల ఏడవ సాధారణ సర్వీస్ ఖర్చు రూ. 6,000 కంటే తక్కువగా ఉంటుంది.  

  • 80,000 కిమీ వద్ద, హైబ్రిడ్ మరియు పెట్రోల్ మోడల్‌ల CVT ట్రాన్స్ؚమిషన్‌లకు మరొక ట్రాన్స్ؚమిషన్ ఆయిల్ మార్పు అవసరం. 

  • తొమ్మిది సంవత్సరాల తర్వాత, తొమ్మిదవ సర్వీస్ ఖర్చు అన్నీ మోడల్‌లకు రూ.6,200 కంటే కొంత ఎక్కువ అవుతుంది, ఇందులో సాధారణ ఇంజన్ ఆయిల్ మరియు ఫిల్టర్ మార్పు చేయాల్సి ఉంటుంది.

  • 1,00,000 కిమీ వద్ద, అన్నీ మోడల్‌లకు భారీ సర్వీసింగ్ అవసరం అవుతుంది, దీనికి రూ. 10,000 ఖర్చు అవుతుంది, దీనిలో స్పార్క్ ప్లగ్ؚలు, కూలెంట్ؚలను మారుస్తారు. 

పవర్ ట్రెయిన్ వివరాలు 

స్పెసిఫికేషన్‌లు 

1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ 

1.5-లీటర్ పెట్రోల్

పవర్ మరియు టార్క్ 

126PS మరియు 253Nm (కంబైన్డ్)

121PS మరియు 145Nm

ట్రాన్స్ؚమిషన్

e-CVT

6-స్పీడ్ MT/CVT

ఇంధన సామర్ధ్యం

27.13kmpl

18.4kmpl వరకు

ఇంతకు ముందు పేర్కొన్నట్లుగా, సిటీలో 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్ ట్రెయిన్‌ల (0.7kWh బ్యాటరీ ప్యాక్ؚతో జత చేయబడింది) ఉపయోగం కొనసాగిస్తుంది. రానున్న BS6 ఫేజ్ II ఉద్గార నియమాలకు అనుగుణంగా రెండు ఇంజన్‌లు నవీకరించబడతాయి, E20 ఇంధనంపై నడవగలదు.

2023 Honda City Hybrid

సాధారణ పెట్రోల్ మోడల్ CVTతో 18.4kmpl మరియు మాన్యువల్ గేర్‌బాక్స్ؚతో 17.8kmpl మైలేజ్‌తో పోలిస్తే సిటీ హైబ్రిడ్ వెర్షన్ 27.13kmpl మైలేజ్‌ను అందించవచ్చు.

ధర & పోటీదారులు

నవీకరించబడిన సిటీ వెర్షన్ ధరలను ఇప్పటికే ప్రకటించారు, సాధారణ పెట్రోల్ వాహనం ధర రూ. 11.49 లక్షలు మరియు రూ.15.97 లక్షలు ఉండగా, పెట్రో హైబ్రిడ్ ధర (ఎక్స్-షోరూమ్) రూ. 18.89 లక్షలు మరియు రూ.20,39 లక్షల మధ్య ఉంది. హోండా కాంపాక్ట్ సెడాన్, స్కోడా స్లావియా, వోక్స్ؚవ్యాగన్ విర్టస్, మారుతి సుజుకి సియాజ్, కొత్త-జనరేషన్ హ్యుందాయ్ వెర్నాలతో పోటీ పడుతుంది. 

ఇక్కడ మరింత చదవండి: సిటీ ఆన్ؚరోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Honda సిటీ

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience