నవీకరించిన కియా సెల్టోస్ ఎంత ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉందో చూడండి
డీజిల్-iMT కలయిక మినహాయించి, ఇది మునుపటి సెల్టోస్ వర్షన్ కంటే మరింత సామర్ధ్యం కలిగింది
-
కియా కొత్త సెల్టోస్‌ను 1.5-లీటర్ పెట్రోల్, టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందిస్తుంది.
-
మాన్యువల్ మరియు CVT ఎంపికలతో పెట్రోల్ ఇంజన్ వరుసగా 17kmpl మరియు 17.7kmpl మైలేజ్‌ను అందిస్తుంది.
-
దీని డీజిల్ iMT వేరియెంట్ 20.7kmpl మరియు ఆటోమ్యాటిక్ 19.1kmpl సామర్ధ్యాన్ని క్లెయిమ్ చేస్తుంది.
-
కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్ 17.9kmpl సామర్ధ్యాన్ని ఖచ్చితంగా అందిస్తుంది.
-
సెల్టోస్ ఫేస్ؚలిస్ట్ ధరలు రూ.10.90 నుండి రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
నవీకరించిన కియా సెల్టోస్ ఇంధన సామర్ధ్యాల గణాంకాలు అధికారికంగా వెల్లడించబడ్డాయి. ఈ కాంపాక్ట్ SUV ఇటీవల గణనీయమైన నవీకరణను అందుకుంది, ఇందులో భాగంగా సరికొత్త స్టైలింగ్, మరిన్ని ఫీచర్‌లు మరియు కొత్త టర్బో-పెట్రోల్ మోటార్ కూడా ఉంది. దాన్ని పూర్తిగా పరీక్షించే అవకాశం మాకు రాలేదు, అయినా సెల్టోస్ؚతో అందించే అనేక పవర్‌ట్రెయిన్ؚల నుండి ఆశించగలిగే ఇంధన సామర్ధ్యం కోసం ఈ క్లెయిమ్ చేసిన గణాంకాలు మంచి సూచికలు, ఇవి మునుపటి వర్షన్ కంటే మెరుగైనవి.
ఇది కూడా చదవండి: నవీకరించిన సెల్టోస్ వేరియెంట్-వారీ ఫీచర్ లను వెల్లడించిన కియా
ఇంజన్-వారీ మైలేజ్ గణాంకాలు
మైలేజ్ (ARAI-క్లెయిమ్ చేసిన గణాంకాలు) |
కొత్త సెల్టోస్ |
పాత సెల్టోస్ |
కియా క్యారెన్స్ |
1.5-లీటర్ P-MT |
17kmpl |
16.5kmpl |
15.7kmpl |
1.5-లీటర్ P-CVT |
17.7kmpl |
16.8kmpl |
- |
1.4-లీటర్ టర్బో-MT |
- |
16.1kmpl |
- |
1.4-లీటర్ టర్బో-DCT |
- |
16.5kmpl |
- |
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ iMT |
17.7kmpl |
- |
- |
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ DCT |
17.9kmpl |
- |
- |
1.5-లీటర్ D-MT (ఇప్పుడు iMT) |
20.7kmpl |
21kmpl |
21.3kmpl |
1.5-లీటర్ D-AT |
19.1kmpl |
18kmpl |
18.4kmpl |
-
1.5-లీటర్ నేచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లలో ఏకైక మార్పు, అవి ప్రస్తుతం BS6.2కు అనుగుణంగా ఉంటాయి, ఇవి మునపటి పవర్ మరియు టార్క్ గణాంకాలతో వస్తాయి.
-
నవీకరించిన సెల్టోస్ؚలో, పెట్రోల్ ఇంజన్ ఇంతకు ముందు వర్షన్ కంటే, CVT ఆటోమ్యాటిక్ 0.9kmpl వరకు మరియు 6-స్పీడ్ మాన్యువల్ 0.5kmpl వరకు స్వల్పంగా మరింత సమర్ధవంతమైనది.
-
మరొకవైపు, 6-స్పీడ్ మాన్యువల్‌తో డీజిల్ ఇంజన్ ఇకపై అందుబాటులో ఉండదు, 0.3kmpl వరకు కొంత తక్కువ సామర్ధ్యం ఉన్న iMTతో (క్లచ్ పెడల్ లేని మాన్యువల్) వస్తుంది. అయితే, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమ్యాటిక్ؚతో అదే ఇంజన్ ప్రస్తుతం 1.1kmpl వరకు ఎక్కువ సమర్ధవంతమైనది.
-
నవీకరించిన సెల్టోస్‌ను కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికతో కూడా పొందవచ్చు. ఇది 20PS వరకు మరింత శక్తివంతమైనది. మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ స్థానంలో iMT (మాన్యువల్ లేకుండా క్లచ్) వస్తుంది.
-
మరింత శక్తివంతమైనది అయినప్పటికీ, కొత్త టర్బో వేరియెంట్ؚలు పాత 1.4-లీటర్ ఎంపిక కంటే మరింత సమర్ధవంతమైనవి.
-
మరొకవైపు, కియా క్యారెన్స్ MPV కొత్త సెల్టోస్ విధంగానే మునపటి ఇంజన్ ఎంపికలను పొందుతుంది మరియు డీజిల్-iMT ఎంపిక విషయానికి వస్తే, సామర్ధ్యం విషయంలో ఇది SUVని మించింది.
ఇతర వివరాల సారాంశం
2023 కియా సెల్టోస్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేల కోసం డ్యూయల్ 10.25-అంగుళాల డిస్ప్లేలు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్ؚలెస్ ఫోన్ చార్జర్ మరియు హెడ్స్-అప్ డిస్ప్లే వంటి ఫీచర్‌లు ఉన్నాయి. భద్రత కోసం ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, ESC, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి, ప్రస్తుతం రాడార్-ఆధారిత ADAS సాంకేతికతను కూడా పొందుతుంది.
ఇది కూడా చదవండి: కియా సెల్టోస్ HTX వేరియెంట్ؚను చిత్రాలలో పరిశీలించండి
నవీకరించిన కియా సెల్టోస్ ధరలు రూ.10.90 లక్షల నుండి రూ.20 లక్షల వరకు (పరిచయ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉన్నాయి. డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కానీ బుకింగ్ ప్రారంభమైన రోజు నుండి ఇది 10,000 కంటే ఎక్కువ ప్రీ-ఆర్డర్ؚలను అందుకుంది కాబట్టి వెయిట్ టైమ్ؚను మరింతగా ఉంటుంది అని ఆశించవచ్చు. ఇది హ్యుందాయ్ క్రెటా, వోక్స్వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, MG ఆస్టర్, మరియు రాబోయే సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ మరియు హోండా ఎలివేట్ؚలతో పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: సెల్టోస్ ఆన్ؚరోడ్ ధర