కొత్త తరం హ్యుందాయ్ వెర్నాలో 5-సరికొత్త లక్షణాలు
హ్యుందాయ్ వెర్నా 2017-2020 కోసం rachit shad ద్వారా మే 20, 2019 12:24 pm ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ లక్షణాలలో ఎక్కువ భాగం విభాగంలోని మొదటి లక్షణాలు
నవీకరణ: 2017 హ్యుందాయ్ వెర్నా రూ. 7.99 లక్షలు ధరకు ప్రారంభించబడింది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా సంస్థ భారతదేశంలో వెర్నా సెడాన్ యొక్క మూడో తరం ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. ఈ బుకింగ్స్ అనేవి మొదలయ్యయి మరియు అవి ఆగస్ట్ 21 వరకూ ఉన్నాయి. రూ.25000 వరకూ ఆ డబ్బులు తిరిగి తీసుకోవచ్చు అని తెలిపారు మరియు ఈ కారు ఆగస్టు 22 న ప్రారంభమవుతుంది. ఇది హోండా సిటీ, వోక్స్వాగన్ వెంటో, స్కొడా రాపిడ్, మారుతి సుజుకి సియాజ్ లాంటి కార్లతో పోటీ పడనుంది కాబట్టి హ్యుందాయి దీని యొక్క ధరను ఈ విభాగంలోనే అద్భుతమైనదిగా ఉంచుదామని అనుకుంది.
రష్యా-స్పెక్ హ్యుందాయ్ సోలారిస్ పై ఆధారపడిన హ్యుందాయ్ వెర్నా, దక్షిణ కొరియా C- సెగ్మెంట్ సెడాన్ లో ఎన్నడూ లేని విధంగా ఐదు లక్షణాలతో లభిస్తుంది. వాటిలో కొన్ని విభాగంలోని మొదటి లక్షణాలుగా ఉన్నాయి. సమయాన్ని వృధా చేయకుండా ఈ లక్షణాలు ఏమిటో చూద్దాము పదండి.
సన్రూఫ్: అవును, చివరకు! కొత్త హ్యుందాయ్ వెర్నా ఒక విద్యుత్ తో నడిచే సన్రూఫ్ తో వస్తుంది మరియు ఇది ఈ విభాగంలో ప్రశంసించడానికి రెండవ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఒక సన్రూఫ్ కలిగి ఉన్న మరొక కారు హోండా సిటీ మాత్రమే. మారుతి సుజుకి సియాజ్ దాని యొక్క మిడ్-లైఫ్ నవీకరణలో ఈ లక్షణాన్ని జోడిస్తుందని పుకార్లు ఉన్నాయి.
హ్యాండ్స్-ఫ్రీ బూట్ విడుదల (సెగ్మెంట్-ఫస్ట్): హ్యుండాయ్ యొక్క కొత్త వెర్నా హ్యాండ్స్ ఫ్రీ బూట్ రిలీజ్ టెక్నాలజీని కలిగి ఉంది. మీరు చేయవలసిందల్లా మీ యొక్క పాదాన్ని కింద కదిపితే ఆటోమెటిక్ గా ఇది ఓపెన్ పాప్ అవుతుంది. ఈ లక్షణం చాలా బాగుంది కదూ? ఈ సాంకేతికత విభాగంలో మొదటిదిగా వెర్నాకు వస్తుంది మరియు సౌకర్యవంతమైన కారకాన్ని మరింత విధంగా ఉంటుంది.
కూల్డ్ సీట్లు (విభాగంలో-మొదటి): వెర్నా దాని పెద్ద తోబుట్టువు ఎలంట్రా నుంచి తీసుకున్న లక్షణం ఏంటంటే, వెంటిలెటెడ్ ఫ్రంట్ సీట్లు. అయితే ఇవి హీటింగ్ ఫంక్షన్ అనే లక్షణాన్ని కలిగి లేదు(మన దేశంలో ఉన్న పరిస్తితులకి ఇది అంతగా అవసరం లేదు) ఈ సీట్లు A.C నుండి గాలిని తీసుకొని, దానిని వదిలి పెడుతూ దాదాపు ప్రతి కోణం నుండి మీరు చల్లని ఉంచడానికి ప్రయత్నిస్తుంది.
ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్ (విభాగంలో- మొదటవి): మనందరికీ తెలుసు ఈ ప్రొజక్టర్ లెన్స్ అనేవి చీకటి ప్రదేశాలలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంతగా ఉపయోగపడతాయో. అయితే కొత్త వెర్నాలో, మీరు ఫాగ్‌ల్యాంప్స్ లో ప్రొజెక్టర్ లెన్సులు కూడా పొందుతారు. దీనివలన రోడ్డుపై మరింత దృష్టి కలిగించేలా చేస్తూ ఆ కాంతిని అటూ ఇటూ వెళ్ళిపోకుండా జాగ్రత్త కూడా తీసుకుంటుంది.
ఎకో కోటింగ్ (సెగ్మెంట్-ఫస్ట్):
ఈ ఎకో-కోటింగ్ అనేది ఏమిటంటే, హ్యుందాయ్ ప్రపంచంలో ఎకో కోటింగ్ అనేది చాలా ముఖ్యమైన టెక్నాలజీ ఇది A.C నుండి మంచి వాసనను అందిస్తుంది. దీని ఫలితం ఏమిటి? మీ యొక్క సౌకర్యవంతమైన ఏరియా నుండి కారు లోనికి వెళ్ళగానే చెడు వాసన కలగకుండా చూసుకుంటుంది.
ఒకవేళ మీరు కొత్త వెర్నా ఎలా ఉంటుంది? అని డ్రైవ్ చేయడానికి ఆరాట పడుతున్నట్లయితే మా మొదటి డ్రైవ్ రివ్యూ ని ఇక్కడ చదవండి.(first drive rivew)
Also Read: 2017 Hyundai Verna: All You Need To Know
Read More on : Hyundai Verna Automatic