భారతదేశంలో ఐదవ తరం హోండా సిటీ ఎమిషన్ టెస్టింగ్ చేయబడుతూ మా కంటపడింది
published on మార్చి 04, 2020 05:57 pm by rohit కోసం హోండా సిటీ
- 40 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హోండా కొత్త సిటీ ని BS 6-కంప్లైంట్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో అందిస్తుందని భావిస్తున్నాము
- మార్చి 16 న హోండా ఐదవ తరం సిటీ భారతదేశంలో ప్రారంభించబడుతుంది.
- ఇది 2019 నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో ప్రపంచవ్యాప్తంగా అడుగుపెట్టింది.
- పెట్రోల్ వేరియంట్ లతో 6-స్పీడ్ MT, డీజిల్ వేరియంట్‌లతో CVT గేర్‌బాక్స్ లభిస్తుందని భావిస్తున్నాము.
- వెంటిలేటెడ్ సీట్లు, కనెక్ట్ చేయబడిన కార్ టెక్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి కొత్త ఫీచర్లతో హోండా సెడాన్ ను అందిస్తుందని భావిస్తున్నాము.
- ప్రస్తుత-జెన్ సిటీ కంటే ఇది ప్రీమియంను కమాండ్ చేస్తుంది.
- దీనికి ముఖ్య ప్రత్యర్థులు మారుతి సుజుకి సియాజ్ మరియు రాబోయే హ్యుందాయ్ వెర్నా ఫేస్ లిఫ్ట్.
ఐదవ తరం హోండా సిటీ మార్చి 16 న భారతదేశంలో ప్రవేశిస్తుంది. భారతదేశంలో ఎమిషన్ పరీక్షలో ఉన్న సెడాన్ ను వెల్లడించే ఇటీవలి రహస్య షాట్‌పై ఇప్పుడు మా కంటపడింది.
హోండా కొత్త సిటీ ని BS6-కంప్లైంట్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో అందిస్తుందని భావిస్తున్నాము. ప్రస్తుత-జెన్ సిటీ లో ఉన్నట్టుగానే పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, రాబోయే ఉద్గార నిబంధనలకు అనుగుణంగా డీజిల్ ఇంజిన్ అప్‌గ్రేడ్ చేయబడుతుంది. BS 6 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ నాల్గవ-జెన్ సిటీలో 119Ps పవర్ ని మరియు 145Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.
హోండా పెట్రోల్-పవర్ తో పనిచేసే సిటీ ని 5-స్పీడ్ MT మరియు CVT తో అందిస్తుంది, డీజిల్-పవర్ తో కూడిన మోడల్ 6-స్పీడ్ MT గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఏదేమైనా, కార్ల తయారీసంస్థ అమేజ్ మాదిరిగానే ఐదవ-జెన్ సిటీ తో డీజిల్-CVT ఎంపికను అందించనున్నందున ఇవి మారే అవకాశం ఉంది. కొత్త సిటీ యొక్క పెట్రోల్ వెర్షన్ 6-స్పీడ్ MT తో రానుంది. హోండా 2021 లో సెడాన్ యొక్క పెట్రోల్-హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా అందించవచ్చు.
సంబంధిత వార్త: 30 కిలోమీటర్లకు పైగా అందించబడే జాజ్ హైబ్రిడ్ వలె అదే టెక్ ని పొందనున్న హోండా సిటీ హైబ్రిడ్!
ఇండియా-స్పెక్ ఐదవ-తరం సిటీ ని ఇంకా ఆవిష్కరించనప్పటికీ, థాయిలాండ్-స్పెక్ మోడల్ లో కనీసం అందించే లక్షణాలతో ఇది ప్యాక్ చేయబడుతుందని మేము భావిస్తున్నాము. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేతో కొత్త 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు కనెక్ట్ చేయబడిన కార్ టెక్ ఉన్నాయి. ఆటో AC, సన్‌రూఫ్, ఆటో LED హెడ్‌ల్యాంప్స్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు నెక్స్ట్-జెన్ మోడల్‌లోకి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. భద్రతా లక్షణాలలో ఆరు ఎయిర్‌బ్యాగులు, వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు EBD తో ABS ఉండవచ్చు.
2020 ఏప్రిల్ లో హోండా ఐదవ తరం సిటీ ని భారతదేశంలో ప్రారంభిస్తుందని మేము ఆశిస్తున్నాము. ప్రస్తుత సిటీ ధర రూ .9.91 లక్షల నుంచి రూ .14.31 లక్షల (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉండగా, నెక్స్ట్-జెన్ సిటీ ప్రస్తుత మోడల్ పై ప్రీమియంను కమాండ్ చేస్తుంది. ఇది మారుతి సుజుకి సియాజ్, టయోటా యారిస్, రాబోయే హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్, వోక్స్వ్యాగన్ వెంటో, మరియు స్కోడా రాపిడ్ వంటి వాటికి ఇది ప్రత్యర్థిగా కొనసాగుతుంది.
మరింత చదవండి: హోండా సిటీ డీజిల్
- Renew Honda City Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful