సరికొత్త ముందు భాగాలను వెల్లడిస్తూ, మళ్ళీ టెస్టింగ్ؚ చేస్తుండగా కనిపించిన నవీకరించబడిన టాటా సఫారీ
రహస్యంగా తీసిన చిత్రాలలో, హ్యారియర్ EV కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొంది రీడిజైన్ చేసిన ముందు భాగం మరియు హెడ్ؚలైట్‌లను చూడవచ్చు.
-
నవీకరించిన టాటా సఫారీ వెనుక మరియు ముందు భాగాలలో భారీ డిజైన్ అప్ؚడేట్‌లతో వస్తుందని అంచనా.
-
ఇది 170PS పవర్ మరియు 350Nm టార్క్‌ను అందించే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది.
-
2023 ఆటో ఎక్స్ؚపోؚలో ఆవిష్కరించిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (170PS మరియు 280Nm)ను కూడా టాటా అందించవచ్చు.
-
ఇది 2024 ప్రారంభంలో మార్కెట్‌లో అందుబాటులోకి రావచ్చు, దీని ధర రూ.16 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభం కావచ్చు.
నవీకరించబడిన టాటా హ్యారియర్ మరియు సఫారీలు టెస్టింగ్ చేస్తుండగా చిత్రీకరించిన ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్ؚలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనిపించిన నవీకరించబడిన సఫారీ టెస్టింగ్ వాహనం చిత్రాలలో, రీడిజైన్ చేసిన ముందు భాగాన్ని చూడవచ్చు, ఇది 2023 ఆటో షోలో ఆవిష్కరించబడిన హ్యారియర్ EV కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందినట్లు కనిపించింది.
కొత్త ఫ్రంట్ డిజైన్
ఈ చిత్రాలలో వాహనం పూర్తిగా కప్పి ఉంచినప్పటికి కొత్త హెడ్‌ల్యాంప్‌ల డిజైన్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత సఫారీలా కాకుండా, నవీకరించిన మోడల్ నిటారుగా అమర్చిన ట్రెపెజోడియల్-ఆకారపు హెడ్‌లైట్ హౌసింగ్ؚతో వస్తుంది. హ్యారియర్ EV కాన్సెప్ట్ؚను పోలి ఉన్న, వెడల్పు అంతటా LED DRL స్ట్రిప్ؚను కలిగి ఉన్న నాజూకైన బోనెట్ లైన్ؚను కలిగి ఉంది. అలాయ్ వీల్స్ؚ కూడా సరికొత్త డిజైన్‌తో వచ్చినట్లు కనిపించాయి.
ప్రొఫైల్ మరియు వెనుక భాగం గురించి చెప్పాలంటే, మునపటి చిత్రాల ఆధారంగా, డిజైన్ దాదాపుగా ఒకేలా ఉంది. దీని వెనుక భాగం లైటింగ్ సెటప్, మరింత ఆధునిక లుక్ కోసం భారీ లైటింగ్ మార్పులతో వస్తాయని ఆశించవచ్చు. ఇంటీరియర్‌లో కొత్త గేర్ సెలక్టర్ మరియు స్టీరింగ్ వీల్ బటన్‌లు ఉండవచ్చు, ఇవి నవీకరించిన హ్యారియర్ మునుపటి రహస్య చిత్రాలలో కనిపించాయి. 5- మరియు 7-సీటర్‌ల SUVలలో డిజైన్ పరంగా మార్పులు ఒకేలా ఉండవచ్చని అంచనా.
ఆశించదగిన ఫీచర్‌లు
హ్యారియర్ మరియు సఫారీ SUVలలో 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 360-డిగ్రీల కెమెరా మరియు ఫుల్ సూట్ అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)తో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి తాజా ఫీచర్‌లను టాటా ఇప్పటికే ప్రవేశపెట్టింది.
దీని భద్రత కిట్ؚలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP) మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్‌లు ప్రామాణికంగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: మార్చి 2023లో అత్యధికంగా అమ్ముడైన 15 కార్‌ల వివరాలు
ఆశించదగిన పవర్ؚట్రెయిన్ ఎంపికలు
నవీకరించిన టాటా హ్యారియర్ మరియు సఫారీ, ఒకే విధమైన 2.0-లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్ (170PS మరియు 350Nm)ను ఉపయోగించవచ్చు, ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో జత చేయబడుతుంది. టాటా దీనిలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (170PS/280Nm) కూడా అందించవచ్చు, ఇది 2023 ఆటో ఎక్స్ؚపోలో ఆవిష్కరించబడింది.
అంచనా ధర పోటీదారులు
నవీకరించబడిన సఫారీని టాటా వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదల చేయవచ్చు, దీని ధర రూ.16 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభం కావచ్చు. ఇది MG హెక్టార్ ప్లస్, మహీంద్రా XUV700 మరియు హ్యుందాయ్ ఆల్కజార్ వంటి వాటితో పోటీ పడనుంది. ప్రస్తుత ప్రారంభ ధరలు రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే కొంత ఎక్కువ ధరతో నవీకరించిన హ్యారియర్ మార్కెట్‌లో అడుగుపెట్టవచ్చు.