Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

రెండు కొత్త వివరాలను వెల్లడిస్తూ మళ్ళీ కెమెరాకు చిక్కిన నవీకరించిన మహీంద్రా XUV300

జూన్ 15, 2023 07:29 pm shreyash ద్వారా ప్రచురించబడింది
67 Views

తాజా రహస్య చిత్రాలలో XUV700 నుండి ప్రేరణ పొందిన ఫ్లోటింగ్ టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు సరికొత్త అలాయ్ వీల్స్ సెట్ؚను చూడవచ్చు

  • ఎక్స్ؚటీరియర్‌లో స్ప్లిట్ గ్రిల్ సెట్అప్ మరియు కనెక్టెడ్ టెయిల్‌లైట్‌లలో మార్పులు ఉంటాయని అంచనా.

  • ఇది భారీగా అప్ؚడేట్ చేసిన క్యాబిన్‌తో రానుంది.

  • కొత్త ఫీచర్‌లలో డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉండవచ్చు.

  • ప్రస్తుత మోడల్ؚలో ఉన్నట్లుగానే అవే ఇంజన్ ఎంపికలతో కొనసాగవచ్చు; AMT ఎంపికకు బదులుగా టార్క్ కన్వర్టర్ యూనిట్ؚతో రావచ్చు.

  • వచ్చే సంవత్సరం ప్రారంభంలో విక్రయాలు ప్రారంభం అవుతాయని అంచనా, దీని ధర రూ.9 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చు.

నవీకరించిన మహీంద్రా XUV300 ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది మరియు ఈ SUV మరొక టెస్ట్ మోడల్ కనిపించింది. భారీగా కప్పబడినప్పటికీ, ఎక్స్ؚటీరియర్ మరియు ఇంటీరియర్ؚలలో కొన్ని కొత్త వివరాలు కనిపించాయి. ఈ వివరాలు ఏం సూచిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.

ఏమి కనిపిస్తున్నాయి?

మొదటి లుక్‌లో, ఈ టెస్ట్ వాహనంలో గమనించగలిగినది సరికొత్త డిజైన్ గల అలాయ్ వీల్స్. అంతేకాకుండా, టెస్ట్ వాహనం ఇంటీరియర్‌లో కొత్త ఫ్లోటింగ్ టచ్ؚస్క్రీన్ కనిపిస్తోంది, ఇది తోటి పెద్ద వాహనం అయిన XUV700 నుండి పొందినట్లుగా ఉంది.

అప్‌డేట్ చేయబడిన XUV300 ముందు మరియు వెనుక చివర్లో కూడా సమగ్రమైన మార్పులు చేశారు. ఇందులో సరికొత్త స్ప్లిట్ గ్రిల్ సెట్అప్, బోనెట్ మరియు బంపర్ కూడా ఉన్నాయి. వెనుక వైపు, బూట్ లిడ్ ఇంతకు ముందు కంటే ప్రస్తుతం దృఢంగా కనిపిస్తోంది, మరియు స్పష్టంగా కనిపించేలా లైసెన్స్ ప్లేట్ స్థానం మార్చబడింది. XUV700 ఉన్నట్లుగానే ముందు వైపు C-ఆకారపు LED DRLలు మరియు LED హెడ్‌లైట్‌లు మరియు వెనుక వైపు LED టెయిల్ؚలైట్ సెట్అప్ ఉంటుంది అని అంచనా.

ఇది కూడా చూడండి: బయటపడిన మహీంద్రా BE.05 మొదటి రహస్య చిత్రాలు

ఆశించదగిన సౌకర్యాలు

మహీంద్రా సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో భారీ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ సెట్అప్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 360-డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు వంటి ఫీచర్‌లు ఈ నవీకరించిన XUV300లో ఉండవచ్చని అంచనా. సింగిల్-పేన్ సన్ؚరూఫ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రస్తుతం ఉన్న కొన్ని ఫీచర్‌లను కొనసాగించవచ్చు.

ప్రస్తుత మోడల్‌లోని భద్రత కిట్‌ను నవీకరించిన సబ్‌కాంపాక్ట్ SUVలో కూడా కొనసాగిస్తున్నారు, ఇందులో ఆరు వరకు ఎయిర్ؚబ్యాగ్ؚలు, EBDతో ABS, ఆల్-వీల్ డిస్క్ బ్రేకులు మరియు రేర్ వ్యూ కెమెరా ఉన్నాయి.

దీన్ని ఏది నడుపుతుంది?

2024 XUV300 ప్రస్తుత మోడల్ؚలో ఉన్న అవే ఇంజన్ ఎంపికలు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (110PS/200Nm) మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (117PS/300Nm)తో రావచ్చు. రెండు ఇంజన్‌లు 6-స్పీడ్‌ల మాన్యువల్ లేదా 6-స్పీడ్‌ల AMTతో జోడించబడాయి. మహీంద్రా 1.2-లీటర్ TGDi టర్బో-పెట్రోల్ ఇంజన్ (130PS/250Nm)ని కూడా అందిస్తుంది, ఇది కేవలం 6-స్పీడ్‌ల మాన్యువల్ؚతో మాత్రమే లభిస్తుంది. నవీకరించిన SUVలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న AMT గేర్‌బాక్స్ؚకు బదులుగా టార్క్ కన్వర్టర్ యూనిట్ؚను మహీంద్రా అందిస్తుందని ఆశిస్తున్నాము.

విడుదల, ధర అంచనా పోటీదారులు

నవీకరించిన మహీంద్రా XUV300 2024 ప్రారంభంలో విడుదల అవుతుందని అంచనా, దీని ప్రారంభ ధర రూ.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా మరియు కియా సోనెట్ؚతో తన పోటీని కొనసాగిస్తుంది.

చిత్రం మూలం

ఇక్కడ మరింత చదవండి: మహీంద్రా XUV300 AMT

Share via

Write your Comment on Mahindra ఎక్స్యువి 3XO

M
mohan
Jan 17, 2024, 9:17:28 PM

When it will launch

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.67.65 - 73.24 లక్షలు*
ఫేస్లిఫ్ట్
కొత్త వేరియంట్
Rs.8.25 - 13.99 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర