త్వరలోనే భారతదేశంలో విడుదలకానున్న Facelifted Kia Sonet
కియా సోనేట్ కోసం rohit ద్వారా జనవరి 11, 2024 12:04 pm సవరించబడింది
- 2.5K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను జనవరి 12 న విడుదల చేయనున్నారు, దీని ధర సుమారు రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
-
2020 లో భారతదేశంలో ప్రవేశపెట్టిన తరువాత ఇది మొదటి పెద్ద నవీకరణ.
-
కొత్త SUV యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
-
రివైజ్డ్ గ్రిల్ మరియు పదునైన హెడ్ లైట్లు మరియు DRLలతో సహా కొత్త ఎక్స్టీరియర్ డిజైన్ను పొందుతుంది.
-
క్యాబిన్ నవీకరణలలో రీడిజైన్ చేసిన క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ మరియు సెల్టోస్ లాంటి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి.
-
ఇందులో సెమీ పవర్డ్ డ్రైవర్ సీటు, 360 డిగ్రీల కెమెరా, ADAS వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
-
ఇది పెట్రోల్ మరియు డీజిల్ పవర్ట్రెయిన్ ఎంపిలలలో లభిస్తుంది; డీజిల్-MT ఎంపిక మళ్ళీ లభించనుంది.
కియా సోనెట్ యొక్క ఫేస్‌లిఫ్ట్ మోడల్ కు సంబంధించిన దాదాపు ప్రతి సమాచారం బహిర్గతం చేయబడింది మరియు దాని నవీకరించిన మోడల్ కూడా కొన్ని డీలర్ షిప్ ల వద్ద అందుబాటులో ఉంది. ఈ కొత్త SUV యొక్క విడుదల తేదీ వెల్లడి కావలసి ఉంది. చాలా కాలంగా కియా సోనెట్ విడుదల కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక శుభవార్త, నవీకరించిన కియా సోనెట్ ను జనవరి 12 న భారతదేశంలో విడుదల చేయనున్నారు. కొత్త సోనెట్ లో ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి:
కొత్త ఎక్స్టీరియర్ డిజైన్
సోనెట్ సబ్ కాంపాక్ట్ SUVని 2020 సంవత్సరంలో విడుదల చేశారు, ఆ తరువాత ఇది మొదటిసారి ముఖ్యమైన నవీకరణ పొందింది. దీని ఎక్స్టీరియర్ లో రీడిజైన్ చేసిన గ్రిల్, ఫాంగ్ ఆకారంలో LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్తో అప్డేటెడ్ LED హెడ్లైట్లు, సొగసైన LED ఫాగ్ల్యాంప్స్, సవరించిన కనెక్టెడ్ LED టెయిల్లైట్లు, కొత్త బంపర్లు ఉన్నాయి. ఇది కాకుండా, ఇందులో టెక్ లైన్, GT లైన్ మరియు X-లైన్ వేరియంట్లకు అనుగుణంగా విభిన్న డిజైన్లను కలిగి ఉన్న కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ కూడా అందించబడ్డాయి.
ఇంటీరియర్ మరియు ఫీచర్లు
సవరించిన క్లైమేట్ కంట్రోల్ వంటి చిన్న మార్పులతో కియా సోనెట్ SUV యొక్క కొత్త మోడల్ యొక్క క్యాబిన్ దాదాపు మునుపటి మాదిరిగానే ఉంటుంది. ఇందులో సన్ రూఫ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. కియా సోనెట్ తరహాలో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, హ్యుందాయ్ వెన్యూ తరహాలో ఫోర్ వే అడ్జస్టబుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేను ఇందులో అందించారు.
మెరుగైన భద్రత కోసం, ఇందులో ఇప్పుడు లెవల్ 1 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ను అందించారు, అలాగే లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ మరియు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఫ్రంట్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా ఫీచర్లు కూడా మునుపటి మాదిరిగానే అందుబాటులో ఉంటాయి.
సంబంధిత: 2024 కియా సోనెట్ కోసం వేచి ఉండడం సరైందేనా లేదా దాని ప్రత్యర్థులు మెరుగైన డీల్ను అందిస్తారా?
హుడ్ కింద ఏముంది?
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వివిధ రకాల పవర్ ట్రైన్ లతో వస్తుంది:
స్పెసిఫికేషన్లు |
1.2-లీటర్ పెట్రోల్ |
1-లీటర్ టర్బో-పెట్రోల్ |
1.5-లీటర్ డీజిల్ |
పవర్ |
83 PS |
120 PS |
116 PS |
టార్క్ |
115 Nm |
172 Nm |
250 Nm |
ట్రాన్స్మిషన్ |
5-స్పీడ్ MT |
6-స్పీడ్ iMT, 7-స్పీడ్ DCT |
6-స్పీడ్ iMT, 6-స్పీడ్ MT (కొత్త), 6-స్పీడ్ AT |
క్లైమ్డ్ మైలేజ్ |
18.83 కి.మీ. |
18.7 కి.మీ, 19.2 కి.మీ. |
22.3 కి.మీ, T.B.D.^, 18.6 కి.మీ. |
^ - ప్రకటించాలి
ఫేస్‌లిఫ్ట్ మోడల్ తో, 2023 ప్రారంభంలో నిలిపివేసిన డీజిల్ మాన్యువల్ కలయిక సోనెట్ లో మళ్ళీ అందించబడుతుంది. డీజిల్-మాన్యువల్ కలయిక యొక్క మైలేజ్ గణాంకాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ధర మరియు ప్రత్యర్థులు
కొత్త సోనెట్ ధర రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా XUV300, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ మరియు సబ్-4m క్రాసోవర్: మారుతి ఫ్రాంక్స్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.
మరింత చదవండి : సోనెట్ ఆటోమేటిక్