• English
  • Login / Register

విడుదలకానున్న ఫేస్ లిఫ్ట్ Hyundai Creta

హ్యుందాయ్ క్రెటా కోసం rohit ద్వారా జనవరి 16, 2024 01:49 pm ప్రచురించబడింది

  • 67 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2024 హ్యుందాయ్ క్రెటా మునుపటి కంటే స్టైలిష్ గా మరియు మరింత ఫీచర్ లోడ్ చేయబడుతుంది

2024 Hyundai Creta

  • 2020 లో విడుదల అయిన రెండవ తరం క్రెటా మొదటిసారి ఒక ప్రధాన నవీకరణను పొందబోతోంది.

  • దీని బుకింగ్ రూ.25,000 టోకెన్ అమౌంట్ తో ప్రారంభమైంది.

  • ఎక్ట్సీరియర్ సవరణలలో రీడిజైన్ చేయబడిన గ్రిల్ మరియు కనెక్టెడ్ లైటింగ్ సెటప్లు ఉన్నాయి.

  • క్యాబిన్ లో కొత్త డ్యాష్ బోర్డు, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ ఉంటాయి.

  • ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, 360 డిగ్రీల కెమెరా, ఏడీఏఎస్ వంటి కొత్త ఫీచర్లు ఉండనున్నాయి.

  • వెర్నా యొక్క కొత్త 1.5-లీటర్ టర్బో యూనిట్ తో సహా మూడు ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది.

  • దీని ధర రూ.11 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఫేస్ లిఫ్ట్ హ్యుందాయ్ క్రెటా రేపు భారతదేశంలో విడుదల కానుంది. ఈ SUV కారు ఫీచర్లు, స్పెసిఫికేషన్లకు సంబంధించిన అన్ని సమాచారాన్ని కంపెనీ ఇప్పటికే వెల్లడించారు. డీలర్షిప్ల వద్ద దీని బుకింగ్ ప్రస్తుతం రూ.25,000 టోకెన్ అమౌంట్ తో కొనసాగుతోంది.

2024 క్రెటా SUVలో ప్రత్యేకత ఏమిటి, మరింత తెలుసుకోండి:

కొత్త ఎక్ట్సీరియర్

బహుళ చిత్రాలలో చూసిన దాని బట్టి 2024 హ్యుందాయ్ క్రెటా మునుపటి కంటే బోల్డ్ మరియు స్టైలిష్ గా ఉండనుంది. కొత్త గ్రిల్, బానెట్ వెడల్పు వరకు విస్తరించే పొడవైన LED DRLలు, కొత్త స్క్వేర్ హెడ్లైట్లతో సహా ఫ్రంట్ ఫ్యాసియాలో చాలా మార్పులు కనిపిస్తాయి. దిగువ విభాగానికి సిల్వర్ ఫినిష్ స్కిడ్ ప్లేట్ ఇవ్వబడుతుంది.

ఈ SUV కారు సైడ్ ప్రొఫైల్ మునుపటి మాదిరిగానే ఉంటుంది, ఇందులో డిజైన్ అల్లాయ్ వీల్స్ ఒకటే మార్చబడ్డాయి. వెనుక భాగంలో, కొత్త క్రెటా L-ఆకారంలో ఉన్న డిజైన్తో కనెక్టెడ్ LED టెయిల్ల్యాంప్లను కలిగి ఉంటుంది. రేర్ బంపర్ కూడా కొత్తగా ఉంటుంది మరియు ఇది రగ్డ్ లుక్ ఇవ్వడానికి పెద్ద సిల్వర్ స్కిడ్ ప్లేట్ ను పొందుతుంది.

క్యాబిన్ నవీకరణలు

2024 Hyundai Creta cabin

2024 హ్యుందాయ్ క్రెటా యొక్క క్యాబిన్ కొత్తగా ఉంటుంది. ఇందులో డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ 10.25 అంగుళాల డిస్ ప్లే (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు మరొకటి ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం) ఉండనుంది. ఇది ఇప్పుడు ప్యాసింజర్ సైడ్ డ్యాష్ బోర్డు పైన భాగంలో పియానో బ్లాక్ ప్యానెల్ ను పొందుతుంది. దీని క్రింద పరిసర లైటింగ్ తో ఓపెన్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. కియా సెల్టోస్ మాదిరిగానే ఇది నవీకరించబడిన క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ కియా సెల్టోస్ వంటి టచ్-ఆధారిత నియంత్రణలను కూడా పొందుతుంది.

ఇది కూడా చదవండి: ఈ జనవరిలో కొన్ని హ్యుందాయ్ కార్లపై రూ.3 లక్షల వరకు ఆదా చేయవచ్చు 

కొత్త ఫీచర్లు

2024 Hyundai Creta six airbags

10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్ జోన్ AC, 360 డిగ్రీల కెమెరా, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి కొత్త ఫీచర్లు 2024 క్రెటాలో ఉండనున్నాయి. అంతే కాకుండా ఇందులో 8-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇంజన్ మరియు గేర్ బాక్స్ ఎంపికలు

2024 Hyundai Creta

కొత్త క్రెటాలో ఈ క్రింది ఇంజన్ మరియు గేర్ బాక్స్ ఎంపికలు ఉండనున్నాయి:

  • 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (115 PS / 144 Nm): 6-స్పీడ్ MT, CVT

  • 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ (160 PS / 253 Nm): 7-స్పీడ్ DCT

  • 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ (116 PS / 250 Nm): 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ వేరియంట్లు మరియు పవర్ట్రెయిన్ ఎంపికల వివరాలు వెల్లడి

ఆశించిన ధర మరియు ప్రత్యర్థులు

2024 Hyundai Creta rear

2024 హ్యుందాయ్ క్రెటా ధర రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్, సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

మరింత చదవండి: హ్యుందాయ్ క్రెటా ఆటోమేటిక్

was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా

1 వ్యాఖ్య
1
M
m sudhir
Jan 15, 2024, 12:39:31 PM

Excellent all the best. But it's high time Hyundai has to come out with Hybrid tec cars. I am surprised why its still not happening. I am eagerly waiting for hybrid CRETA from Hyundai.

Read More...
    సమాధానం
    Write a Reply

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience