ప్రత్యేకం: భారతదేశంలో రహస్య చిత్రాలలో కనిపించిన నవీకరించబడిన హ్యుందాయ్i20
ఈ పండుగ సీజన్‌లో విక్రయానికి సిద్దంగా ఉంటుందని అంచనా
-
2022 చివరి నుండి హ్యుందాయ్ ప్రపంచవ్యాప్తంగా నవీకరించబడిన i20ని పరీక్షిస్తోంది.
-
ఈ టెస్ట్ మోడల్‌లో సరికొత్త అల్లాయ్ వీల్స్; ముందు మరియు వెనుక భాగాలు పాక్షికంగా కప్పబడి ఉన్నట్లుగా భారతదేశంలో చిక్కిన రహస్య చిత్రాలలో చూడవచ్చు
-
లోపలి భాగంలో, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ మరియు డ్యాష్‌క్యామ్ (కొత్తది) ఉన్నట్లు కనిపించింది.
-
అదనపు ఫీచర్లలో యాంబియాంట్ లైటింగ్ మరియు వెంటిలేటెడ్ ముందు సీట్లు ఉన్నాయి.
-
ప్రస్తుత మోడల్లో ఉన్నట్లుగా 1.2 లీటర్ N.A. మరియు 1 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుందని అంచనా.
-
హ్యుందాయ్ దీన్ని రూ.8 లక్షల (ఎక్స్ షోరూం) ప్రారంభ ధరతో విడుదల చేయనుంది.
2022 చివరిలో, నవీకరించబడిన హ్యుందాయ్ i20 మొదటి రహస్య చిత్రాలు దాని స్వదేశం నుండి ఆన్‌లైన్‌లో కనిపించాయి. ప్రస్తుతం, నవీకరించబడిన ఈ హ్యాచ్‌బ్యాక్ రహస్య చిత్రాలను భారతదేశంలో మేం ప్రత్యేకంగా పొందాము.
ఏమి చూడవచ్చు?
ఈ రహస్య చిత్రాలలో నవీకరించబడిన i20 సిల్వర్ రంగులో పెయింట్ చేయబడి, ముందు మరియు వెనుక భాగాలలో పాక్షికంగా నలుపు రంగులో కవర్ చేయబడి ఉన్నట్లు చూడవచ్చు. i20 సరికొత్త అల్లాయ్ వీల్ డిజైన్‌ను కూడా చూడవచ్చు. ఇటీవలి చిత్రాలలో కార్ ముందు భాగం కనిపించకపోయినా, ప్రపంచవ్యాప్తంగా కనిపించిన సరికొత్త i20కి అనుగుణంగా మార్పులు ఉంటాయని ఆశించవచ్చు. ఇందులో సవరించిన గ్రిల్ డిజైన్, నవీకరించిన LED లైటింగ్, మెరుగైన బంపర్‌లు ఉండవచ్చు.
ఇంటీరియర్ పరంగా నవీకరణలు
నవీకరించబడిన i20 స్పష్టమైన ఇంటీరియర్ చిత్రాలు లేనప్పటికీ, హ్యుందాయ్ దీనికి కొత్త అప్‌హోల్స్టరీ మరియు బహుశా సరికొత్త క్యాబిన్ థీమ్‌ను అందిస్తుందని ఆశిస్తున్నాము. చెప్పాలంటే, ఇందులో టచ్‌స్క్రీన్ సిస్టమ్ (ప్రస్తుత మోడల్‌లో ఉన్న 10.25-అంగుళాల యూనిట్) మరియు డ్యాష్‌క్యామ్ (కొత్త ఫీచర్)ను చూడవచ్చు. భారతదేశంలో వెన్యూ N లైన్ మరియు త్వరలో రానున్న ఎక్స్టర్ మైక్రో SUV తర్వాత నవీకరించబడిన i20 డ్యాష్‌క్యామ్ ను పొందిన మూడవ హ్యుందాయ్ కారుగా నిలుస్తుంది.
ప్రస్తుత i20 క్యాబిన్
నవీకరించబడిన i20లో ఉన్న ఇతర ఫీచర్‌లలో ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, కనెక్టడ్ కార్ టెక్ మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటివి ఉండవచ్చు. కొత్త ఫీచర్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు యాంబియంట్ లైటింగ్ ఉండవచ్చు.
భద్రత అంశాల పరంగా, నవీకరించబడిన i20లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందిచవచ్చు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు రివర్సింగ్ కెమెరా ఉండవచ్చు.
ఇవి కూడా చదవండి: AI అంచనా ప్రకారం రూ. 20 లక్షల లోపు భారతదేశంలోని టాప్ 3 ఫ్యామిలీ SUVలు ఇవే
పవర్ట్రెయిన్లో ఏవైనా మార్పులు ఉన్నాయా?
హ్యుందాయ్ తమ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ పవర్‌ట్రెయిన్ ఎంపికలలో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చని అంచనా. ఇది 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ (83PS/114Nm) మరియు 1-లీటర్ టర్బో-పెట్రోల్ (120PS/172Nm) ఇంజన్ ఎంపికలతో కొనసాగవచ్చు. మునుపటి మోడల్ 5-స్పీడ్ AMT లేదా CVTతో ఉండవచ్చు, కానీ రాబోయే మోడల్ 7-స్పీడ్ DCTని (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్) మాత్రమే కలిగి ఉంటుంది.
భారతదేశంలో విడుదల మరియు ధర
భారతదేశంలో హ్యుందాయ్ నవీకరించబడిన i20ని ఈ పండుగ సీజన్‌లో విడుదల చేయవచ్చని ఆశిస్తున్నాము. దీని ధర రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మారుతి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ మరియు టయోటా గ్లాంజాలకు పోటీగా నిలుస్తుంది.
ఇది కూడా చదవండి: i20 ఆన్ రోడ్ ధర
Write your Comment on Hyundai ఐ20
Ab Company ko isme bhi Verna wala 159bhp wala engine dena chahiye.