• English
  • Login / Register

లిమిటెడ్ యానివర్సరీ ఎడిషన్ తో మొదటి పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న ఎలైట్ ఐ20

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 కోసం nabeel ద్వారా ఆగష్టు 17, 2015 11:59 am ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఎలైట్ ఐ 20 కారులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఎవియన్ వ్యవస్థను పరిచయం చేసిన తర్వాత, హ్యుందాయ్ దాని యొక్క మొదటి సంవత్సరం సందర్భంగా యానివర్సరీ రోజున ఈ కారులో ఎక్కువ సౌకర్యాలను జోడించడానికి నిర్ణయించుకుంది. వారు ఎలైట్ ఐ 20 యానివర్సరీఎడిషన్ ను రూ 6.69 లక్షల వద్ద పెట్రోల్ వేరియంట్ ను, రూ. 7.84 లక్షల వద్ద డీజిల్ వేరియంట్ ను ఎక్స్-షోరూమ్ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కొత్త ఎడిషన్ స్పోర్ట్ ట్రిం లెవెల్ లో ఉన్న కారణంగా అధనంగా రూ.30000 పెంచడం జరిగింది. ఈ అదనపు మొత్తం కూడా కాస్మెటిక్ అప్ గ్రెడ్స్ కోసం కేటాయించబడింది. ఈ అదనపు లక్షణాలను డీలర్స్ వద్ద బిగించుకోవచ్చు. ఈ పరిమిత 600 యూనిట్ల వాహనాలలో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటుగా 2-డిన్ సంగీతం వ్యవస్థ కూడా ఉంటుంది. ఆరు స్పీకర్లు మరియు వాతావరణం నియంత్రణ వ్యవస్థ కూడా ప్రామాణికంగా ఉంటుంది. వీటితోపాటుగా, పార్సెల్ ట్రే, బాడ్జింగ్, ఫ్లోర్ మ్యాట్స్, సీటు కవర్లు మరియు డోర్ సిల్ ప్లేట్లు డీలర్ల వద్ద చివరిలో బిగించబడి వస్తాయని భావిస్తున్నారు.

విద్యుత్ శాఖలో, ఈ కారు 1.2 లీటర్ నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జతచేయబడి 82bhpశక్తిని మరియు 115Nm టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. ఇతర వేరియంట్ 1.4-లీటర్ ఇంజన్ కలిగియుండి సిక్స్-స్పీడ్ మాన్యువల్ వ్యవస్థతో జతచేయబడి 89bhp శక్తిని మరియు 220Nm టార్క్ ని అందిస్తుంది.

ఈ నెల ప్రారంభంలో, ఈ వాహన తయారీసంస్థ 7 అంగుళాల టచ్స్క్రీన్ ఆడియో విజువల్ నావిగేషన్ వ్యవస్థను దాని ఐ 20 ఫ్యామిలీలో పరిచయం చేసి హోండా కొత్త జాజ్ కి పోటీ ఇస్తుంది. ఈ కారులో ఉండే ఎవిఎన్ వ్యవస్థని క్రెటా నుండి స్వీకరించింది. ఈ వ్యవస్థ ఎలైట్ ఐ20 యొక్క కొత్త వేరియంట్ అయిన ఎలైట్ ఐ 20 ఆక్టివ్ కోసం పరిచయం చేయబడింది. ఈ కొత్త వేరియంట్ పూర్తిగా నవీఎకరించబడిన మోడల్.

was this article helpful ?

Write your Comment on Hyundai ఎలైట్ ఐ20 2017-2020

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience