హైబ్రిడ్ వాహనాల తయారీలో ఎలక్ట్రిక్ పవర్ సహాయంతో 8 మిలియన్ యూనిట్ల అమ్మకాలను చేరుకున్న టయోటా

ఆగష్టు 24, 2015 11:49 am manish ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

గతంలో ఒక మిలియన్ యూనిట్ మైలురాయి తో ప్రారంభమయి , కేవలం ఈ 10 నెలల మధ్య  8 మిలియన్లకు పైగా హైబ్రిడ్ వాహనాలు టయోటా మోటార్ కార్పొరేషన్ ద్వారా అమ్ముడయ్యాయి. యజమానులకు మరియు పర్యావరణానికి 8 మిలియన్ ల వాహనాల విక్రయం బాగా ఆలోచించదగ్గ విషయంగా చెప్పవచ్చు. టయోటా జూలై 31 నాటికి, ఇదేవిధమైన గాసోలిన్ శక్తితో తయారైనటువంటి దాని హైబ్రిడ్ వాహనాల ఫలితంగా , 58 మిలియన్ టన్నుల సిఓ2 ఉద్గారాలను తగ్గించి వేసింది. ఇంకా ఈ వాహనాలు కూడా అదే విధమైన స్పేస్ మరియు పనితీరు గణాంకాలను అందిస్తాయి. అదనంగా, టయోటా యొక్క హైబ్రిడ్ వాహనాల వలన దాదాపు 22 మిలియన్ కిలోలీటర్ల గ్యాసోలైన్ వినియోగం తగ్గినట్లు తెలిసింది. ఈ హైబ్రిడ్ వాహనాలు లేకపోతే ఇదే పరిమాణంలో గ్యాసోలైన్ తరిగిపోయి ఉండేది. ముఖ్యంగా భారతదేశంలో మొత్తం సిఓ2 ఉద్గారం దాదాపు 8 మిలియన్ టన్నులు, అనగా 3.55% సిఓ2 ఉద్గారం తగ్గించబడింది. ఇది భారతదేశం యొక్క వార్షిక ఆయిల్ దిగుమతిలో దాదాపు 13.3% ఉంటుంది.

90 దేశాలలో ఈ నెల నాటికి, టయోటా 30 హైబ్రిడ్ ప్యాసెంజర్ కారు మోడళ్లను మరియు ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడళ్ కారును విక్రయించింది. టయోటా ఇప్పుడు కరోల్లా హైబ్రిడ్, లెవిన్ హైబ్రిడ్ (చైనాలో మాత్రమే), ఆర్ ఏవి4 హైబ్రిడ్ వంటి హైబ్రిడ్ మోడళ్లను ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వీటితో పాటుగా టయోటా కొత్త హైబ్రిడ్ మోడళ్లను కూడా ఇంతకు ముందు లేని అన్ని మార్కెట్లలో అందిచడానికి ప్రయత్నం చేస్తోంది.

భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్థానికంగా క్యామ్రీ హైబ్రిడ్ తయారీ, ఆగస్ట్ 2013 టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకెఎం) ద్వారా రూపొందించబడినది. ప్రపంచంలో టయోటా హైబ్రిడ్ వాహనాల తయారీకి భారతదేశంను 9 వ దేశంగా లేదా ప్రాంతంగా చెప్పవచ్చు. క్యామ్రీ హైబ్రిడ్ యొక్క ప్రజాదరణ, క్యామ్రీ హైబ్రిడ్ యొక్క అన్ని కొత్త కార్లు ప్రారంభం అయ్యాక మే 2015 లో పెరిగింది. ప్రస్తుతం క్యామ్రీ హైబ్రిడ్ అమ్మకాలు, భారతదేశంలో మొత్తం క్యామ్రీ అమ్మకాల కంటే 80% ఎక్కువగా(గ్యాసోలిన్ ఇంజన్ రకాలలో సహా) ఉన్నట్లు తెలిసింది. 

టయోటా కూడా దాని హైబ్రిడ్ టెక్నాలజీని సాధించిన పురోగతుల ద్వారా నాన్- హైబ్రిడ్ కార్లను మెరుగుపరుస్తూ పని చేస్తుంది. ఈ అభివృద్ధిలో వాటి పనితీరు మెరుగుపరచడం, దాని ఉత్పత్తి శ్రేణి ని విస్తరించడం, నాన్-హైబ్రిడ్ వాహనాలు మరియు వాటి ఖర్చులు తగ్గించడం వంటి అంశాలు విలీనమై ఉన్నాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience