ఈ జూలైలో నెక్సా కార్‌లపై రూ.69,000 వరకు ప్రయోజనాలు
మారుతి ఇగ్నిస్ కోసం shreyash ద్వారా జూలై 09, 2023 03:14 pm ప్రచురించబడింది
- 394 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇగ్నిస్, సియాజ్ మరియు బాలెనోపై రూ.5,000 స్క్రాపేజ్ ప్రయోజనాన్ని కూడా మారుతి అందిస్తుంది
-
మారుతి ఇగ్నిస్‌పై గరిష్టంగా రూ.69,000 వరకు ఆదా చేయవచ్చు.
-
మారుతి బాలెనోపై కస్టమర్‌లు రూ.45,000 వరకు ఆదా చేయవచ్చు.
-
సియాజ్‌పై రూ.33,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.
-
XL6, ఫ్రాంక్స్ లేదా గ్రాండ్ విటారాలపై ఎటువంటి ఆఫర్‌లు లేవు.
-
అన్నీ ఆఫర్‌లు జూలై 2023 చివరి వరకు చెల్లుబాటు అవుతాయి.
ఇగ్నిస్, సియాజ్ మరియు బాలెనోలతో సహా, తమ నెక్సా మోడల్‌లపై జూలై ఆఫర్‌లను మారుతి ప్రకటించింది. ఇవి క్యాష్ డిస్కౌంట్‌లు, ఎక్స్ؚఛేంజ్ బోనస్ؚలు మరియు కార్పొరేట్ డిస్కౌంట్ؚలతో అందిస్తున్నారు. గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్ మరియు XL6 వంటి కొత్త మరియు మరింత ఖరీదైన మోడల్‌లపై ఎటువంటి ప్రయోజనాలు అందించడం లేదు. మోడల్-వారీ ఆఫర్ వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఇగ్నిస్
ఆఫర్‌లు |
మొత్తం |
ఇగ్నిస్ ప్రత్యేక ఎడిషన్ |
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 35,000 |
రూ. 15,500 వరకు |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 15,000 |
రూ. 15,000 |
అదనపు ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 10,000 |
రూ. 10,000 |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 4,000 వరకు |
రూ. 4,000 వరకు |
స్క్రాపేజ్ డిస్కౌంట్ |
రూ. 5,000 వరకు |
రూ. 5,000 వరకు |
గరిష్ట ప్రయోజనాలు |
రూ. 69,000 వరకు |
రూ. 49,500 వరకు |
-
పట్టికలో మారుతి ఇగ్నిస్ సాధారణ వేరియెంట్ؚలపై పేర్కొన్న ఆఫర్‌లు దీని మాన్యువల్ మరియు ఆటోమాటిక్ మోడల్‌లు రెండిటి పైనా చెల్లుబాటు అవుతాయి.
-
హ్యాచ్ؚబ్యాక్ ప్రత్యేక ఎడిషన్ కోసం, సూచించిన డిస్కౌంట్‌లు కేవలం డెల్టా వేరియెంట్‌పై మాత్రమే చెల్లుబాటు అవుతాయి, సిగ్మా వేరియెంట్‌పై క్యాష్ డిస్కౌంట్ కేవలం రూ.5,000కు తగ్గింది.
-
ఇగ్నిస్ ప్రత్యేక ఎడిషన్ కోసం, కస్టమర్‌లు రూ.29,990 మరియు రూ.19,500 అదనపు మొత్తాన్ని వరుసగా సిగ్మా మరియు డెల్టా వేరియెంట్‌లపై చెల్లించాలి.
-
కొత్త ఇగ్నిస్ కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు ఆల్టో, ఆల్టో K10 లేదా వ్యాగన్Rను ఎక్స్ؚఛేంజ్ చేస్తే, అదనపు ఎక్స్ؚఛేంజ్ బోనస్ వర్తిస్తుంది.
-
మారుతి ఇగ్నిస్ ధర రూ.5.84 లక్షల నుంచి రూ.8.16 లక్షల వరకు ఉంది.
ఇది కూడా చదవండి: అంతర్జాతీయంగా ఎగుమతి అవుతున్న, భారతదేశంలో తయారైన మోడల్ ల జాబితాలో చేరిన మారుతి ఫ్రాంక్స్
బాలెనో
ఆఫర్‌లు |
మొత్తం |
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 20,000 వరకు |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 10,000 వరకు |
అదనపు ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 10,000 వరకు |
స్క్రాపేజ్ డిస్కౌంట్ |
రూ. 5,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ. 45,000 వరకు |
-
పైన పేర్కొన్న డిస్కౌంట్‌లు కేవలం మారుతి బాలెనో లోయర్-స్పెక్ సిగ్మా మరియు డెల్టా వేరియెంట్‌లకు మాత్రమే వర్తిస్తాయి.
-
CNG మరియు హయ్యర్-స్పెక్ జెటా మరియు ఆల్ఫా వేరియెంట్ؚల కోసం, క్యాష్ డిస్కౌంట్ రూ.10,000కు తగ్గించారు.
-
ఇగ్నిస్ؚలా కాకుండా, బాలెనోపై కార్పొరేట్ డిస్కౌంట్ؚ అందించడం లేదు.
-
అదనపు ఎక్స్ؚఛేంజ్ ఆఫర్, ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ కోసం తమ స్విఫ్ట్ లేదా వ్యాగన్Rలను ఎక్స్ؚఛేంజ్ చేసే వారికి వర్తిస్తుంది.
-
మారుతి బాలెనో ధర రూ.6.61 లక్షల నుండి రూ.9.88 లక్షల వరకు ఉంది.
సియాజ్
ఆఫర్‌లు |
మొత్తం |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 25,000 వరకు |
స్క్రాపేజ్ డిస్కౌంట్ |
రూ. 5,000 వరకు |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 3,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ. 33,000 వరకు |
-
ఈ నెలలో అన్నిటి కంటే తక్కువ ప్రయోజనాలు సియాజ్‌పై అందిస్తున్నారు, ఎందుకంటే దీనిపై క్యాష్ డిస్కౌంట్ మరియు అదనపు ఎక్స్ؚఛేంజ్ బోనస్ లేవు.
-
పట్టికలో సూచించిన ఆఫర్‌లు మారుతి సెడాన్ అన్నీ వేరియెంట్ؚలపై చెల్లుబాటు అవుతాయి.
-
సియాజ్ ధర రూ.9.30 లక్షల నుండి రూ.12.29 లక్షల వరకు ఉంటుంది.
గమనిక
-
పైన పేర్కొన్న ఆఫర్‌లు, రాష్ట్రం, నగరంపై ఆధారపడి మారవచ్చు మరిన్ని వివరాల కోసం దయచేసి మీ సమీప నెక్సా డీలర్ؚషిప్ؚను సంప్రదించండి.
-
అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
ఇక్కడ మరింత చదవండి : మారుతి ఇగ్నిస్ AMT