క్రాష్ టెస్ట్ పోలిక: స్కోడా స్లావియా/వోక్స్వాగన్ విర్టస్ Vs హ్యుందాయ్ క్రెటా

స్కోడా స్లావియా కోసం tarun ద్వారా ఏప్రిల్ 11, 2023 12:58 pm ప్రచురించబడింది

  • 36 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

భద్రత రేటింగ్ పరంగా, భారతదేశంలోని సురక్షితమైన కార్‌లు మరియు అత్యంత ప్రజాదరణ పొందిన కార్‌లతో ఎలా పోటీ పడుతున్నాయో చూద్దాం

Volkswagen Virtus Vs Hyundai Creta

ఇటీవల ఐదు-స్టార్‌ల భద్రత రేటింగ్ؚను పొందిన కార్‌లు స్కోడా స్లావియా మరియు వోక్స్వాగన్ విర్టస్. ఈ సెడాన్‌లు ప్రస్తుతం భారతదేశంలోని సురక్షితమైన కార్‌లు, ఇవి వాటి SUV వర్షన్‌లను కొద్దిపాటి తేడాతో మించినాయి. రూ.11 లక్షల నుండి రూ.19 లక్షల (ఎక్స్-షోరూం) ఉన్న విస్తృతమైన ధర పరిధితో, ఈ సెడాన్‌లు కాంపాక్ట్ SUVలు మరియు కొన్ని మిడ్ؚసైడ్ SUVలతో పరోక్షంగా పోటీ పడుతున్నాయి. 

ఇప్పుడు, ప్రస్తుతం భారతదేశంలో సురక్షితమైన కార్‌లు మరియు అత్యధికంగా అమ్ముడవుతున్న SUV హ్యుందాయ్ క్రెటాల మధ్య క్రాష్ టెస్ట్ పోలికను ఇప్పుడు పరిశీలిద్దాం. అయితే, స్లావియా మరియు విర్టస్ నవీకరించిన మరియు కఠినమైన గ్లోబల్ NCAP ప్రమాణాలకు అనుగుణంగా క్రాష్ టెస్ట్ నిర్వహించబడ్డాయని గమనించండి. క్రెటాపై కేవలం ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్ నిర్వహించగా, ఈ సెడాన్‌లపై సైడ్ బ్యారియర్, సైడ్ పోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ టెస్ట్ؚలు కూడా నిర్వహించారు. 

సమగ్ర స్కోర్‌ల పోలిక 


స్లావియా / విర్టస్ 

క్రెటా (పాత పారామితుల ప్రకారం పరీక్షించబడింది)

అడల్ట్ ఆక్యుపెంట్ భద్రత

34 పాయింట్‌లకు 29.71 (5 స్టార్‌లు)

17 పాయింట్‌లకు 8 (3 స్టార్‌లు)

చైల్డ్ ఆక్యుపెంట్ భద్రత

49 పాయింట్‌లకు 42 (5 స్టార్‌లు)

49 పాయింట్‌లకు 28.29 (3 స్టార్‌లు)

ఈ సెడాన్‌లు అన్నీ అడల్ట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ భద్రతలో ఐదు స్టార్ స్కోర్‌లు సాధించాయి. క్రెటా ప్రతి దానిలో మూడు స్టార్‌ల స్కోర్‌ను సాధించాయి. స్లావియా మరియు విర్టస్ ఫుట్ؚవెల్ ఏరియా మరియు బాడీؚషెల్ ఇంటిగ్రిటీలు స్థిరమైనవిగా మరియు మరింత లోడింగ్ؚలను తట్టుకునే సామర్ధ్యం ఉన్నవిగా రేట్ చేయబడ్డాయి, హ్యుందాయ్ క్రెటా ఈ విషయంలో అస్థిరంగా ఉంది. 

ఇది కూడా చదవండి: టాటా నెక్సాన్ Vs స్కోడా కుషాక్ – క్రాష్ టెస్ట్ రేటింగ్ؚల పోలిక 

అడల్ట్ ఆక్యుపెంట్ భద్రత 

స్కోడా స్లావియా/విర్టస్:

Volkswagen Virtus

  • స్లావియా మరియు విర్టస్ؚలు తల, మెడ, డ్రైవర్ తొడలు, మరియు సహ ప్రయాణీకుల కాళ్ళకు మెరుగైన భద్రతను కనపరిచాయి. 

  • ముందు కూర్చునే ప్రయాణీకుల ఛాతీకి తగినంత భద్రత లభించింది. 

  • ఈ సెడాన్‌లపై సైడ్ బ్యారియర్ మరియు పోల్ ఇంపాక్ట్ పరీక్షలు కూడా కఠినమైన నిబంధనల ప్రకారం నిర్వహించబడ్డాయి. 

  • సైడ్ బ్యారియర్ ఇంపాక్ట్ పరీక్షలో పెల్విస్‌కు మెరుగైన భద్రత, తల, ఛాతీ మరియు కడుపుకు తగినంత భద్రతను అందిస్తుంది. 

  • VGA జంట తల, మెడ మరియు పెల్విస్‌కు మెరుగైన భద్రతను, సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షలో ఛాతీకి చెప్పుకోదగిన భద్రతను అందిస్తుంది. 

హ్యుందాయ్ క్రెటా

Hyundai Creta Gets A 3-Star Rating In Global NCAP Tests

  • ఫ్రంటల్ ఇంపాక్ట్ విషయంలో, క్రెటా సహ డ్రైవర్ తలకు మరియు ముందు ప్రయాణీకుల మెడకు మెరుగైన భద్రతను, డ్రైవర్ తలకు తగినంత భద్రతను అందిస్తుంది. 

  • డ్రైవర్ ఛాతీకి మోస్తరు భద్రత పొందగా, సహ డ్రైవర్ؚకు తగినంత భద్రత అందింది. 

  • ఇద్దరు ప్రయాణీకుల మోకాళ్ళకు మోస్తరు భద్రత లభించగా. డ్రైవర్ కాలి ఎముకలకు బలహీనమైన మరియు తగినంత భద్రత లభించింది, సహ డ్రైవర్ విషయంలో మెరుగైన మరియు తగినంత భద్రత లభించింది. 

  • కొత్త టెస్టింగ్ నిబంధనలు దీనికి వర్తించనందున, సైడ్ బ్యారియర్ మరియు పోల్ ఇంపాక్ట్ పరీక్షలు క్రెటాపై నిర్వహించలేదు. 

చైల్డ్ ఆక్యుపెంట్ భద్రత:

Volkswagen Virtus

స్కోడా స్లావియా మరియు VW విర్టస్ విషయంలో, వెనుక సీట్‌లలో ఉంచిన మూడు సంవత్సరాలు మరియు 18-నెలల వయసు ఉన్న డమ్మీలకు పూర్తి భద్రత లభించింది. అయితే, క్రెటా విషయంలో మూడు సంవత్సరాల వయసు ఉన్న డమ్మీ తలకు, ఛాతీకి బలహీనమైన భద్రత మరియు 18 నెలల వయసు డమ్మీకి తగినంత భద్రత లభించింది.  

ప్రామాణిక భద్రత ఫీచర్‌లు

స్కోడా స్లావియా / వోక్స్వాగన్ విర్టస్:

skoda slavia review

  • సెడాన్‌లు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, ఐదు సీట్‌లకు మూడు-పాయింట్‌ల సీట్ బెల్ట్ؚలు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు మరియు TPMSను ప్రామాణికంగా పొందాయి.

  • టాప్ ఎండ్ వేరియెంట్ؚలలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ కెమెరా మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ ఉన్నాయి

హ్యుందాయ్ క్రెటా

Hyundai Creta Gets A 3-Star Rating In Global NCAP Tests

  • ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, మరియు ISOFIX చైల్డ్ సీట్‌లు ప్రస్తుతం క్రెటాలో ప్రామాణికం. 

  • అయితే, క్రాష్ టెస్ట్ సమయంలో, కేవలం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు మరియు EBDతో ABS మాత్రమే ప్రామాణికంగా వస్తాయి. 

  • క్రెటా టాప్ ఎండ్ వాహనాలలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ మరియు రేర్ పార్కింగ్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: హ్యుందాయి i20 Vs టాటా అల్ట్రోజ్: క్రాష్ టెస్ట్ రేటింగ్ؚల పోలిక 

సారాంశం

స్కోడా స్లావియా మరియు వోక్స్వాగన్ విర్టస్ ఖచ్చితంగా సురక్షితమైన కార్‌లు అయినప్పటికీ, క్రెటా ఇప్పుడు అనేక అదనపు ఫీచర్‌లను ప్రామాణికంగా పొందింది. కొత్త ప్రోటోకాల్ మరియు మరిన్ని ఫీచర్‌లతో, హ్యుందాయ్ SUV మెరుగైన భద్రత రేటింగ్ؚను అనుకోవచ్చు. 

ఇక్కడ మరింత చదవండి: స్లావియా ఆటోమ్యాటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన స్కోడా స్లావియా

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience