Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

MG Hector తదుపరి డిజైన్ ఇదేనా?

ఎంజి హెక్టర్ కోసం rohit ద్వారా ఆగష్టు 16, 2023 01:29 pm ప్రచురించబడింది

వూలింగ్ ఆల్మాజ్ పేరుగల దీని ఇండోనేషియన్ మోడల్ – ముందు భాగంలో పూర్తిగా సరికొత్త డిజైన్ లాంగ్వేజ్ؚను కలిగి ఉంది

  • MG హెక్టార్/హెక్టార్ ప్లస్ జంటను ఇండోనేషియాలో వూలింగ్ ఆల్మాజ్ؚ పేరుతో విక్రయిస్తున్నారు.

  • ఇటీవల గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో (GIIAS) దిని ఫేస్ؚలిఫ్ట్ మోడల్‌ను ప్రదర్శించారు.

  • SUV ముందు భాగం ప్రస్తుతం క్రోమ్ అలంకరణలతో రీడిజైన్ చేసిన ఎయిర్ డ్యామ్ؚను కలిగి ఉంది.

  • దీని క్యాబిన్ లేఅవుట్ 2021 MG హెక్టార్ؚను పోలి ఉంది, కానీ పూర్తి నలుపు రంగు థీమ్ؚలో వస్తుంది.

  • పనోరమిక్ సన్ؚరూఫ్, నిలువుగా ఉండే టచ్ؚస్క్రీన్ మరియు 360-డిగ్రీల కెమెరా వంటి ఫీచర్‌లు కూడా ఉన్నాయి.

  • 1.5-లీటర్ టర్బో-పెట్రో ఇంజన్ మరియు 2-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ ఎంపికలలో అందించబడుతుంది.

MG హెక్టార్ మరియు MG హెక్టార్ ప్లస్ జంట, ప్రపంచ వ్యాప్తంగా వివిధ పేర్లతో బహుళ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి, వీటిలో ఇండోనేషియాలోని వూలింగ్ అల్మాజ్ కూడా ఉంది. దక్షిణ ఆసియా దేశాలలో విడుదల చేయడానికి ఈ SUVకి ప్రస్తుతం భారీ సవరణను అందించారు మరియు ఇటీవల నిర్వహించిన గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షోలో (GIIAS) ప్రదర్శించారు.

అప్డేట్ؚలో భాగం ఏమిటి?

ఇండియా-స్పెక్ హెక్టార్ బోల్డ్ؚ లుక్ విధంగానే, దీని ఇండోనేషియన్ వర్షన్ కూడా ప్రస్తుతం ముందు భాగంలో మరిన్ని మార్పులను పొందింది. ఇండోనేషియన్ కార్ తయారీదారు ఈ SUV యొక్క భారీ గ్రిల్‌ను మరియు హెడ్‌లైట్ క్లస్టర్ స్థానంలో పైన వూలింగ్ లోగో కలిగి ఉండే క్లోజ్డ్ ఆఫ్ పోర్షన్ؚను (EVలో కనిపించినట్లు) తీసుకువచ్చారు. మిగిలిన ముందు బంపర్, క్రోమ్-ఫినిష్ కలిగి ఉండే త్రికోణ అలంకరణలను (హైబ్రిడ్ వర్షన్ؚలో చివరి వరుస నీలం రంగులో ఉంటుంది) మరియు LED హెడ్‌లైట్లను కలిగి ఉంది. ఇది ముందు భాగం దిగువ మధ్యలో చిన్న ఎయిర్ డ్యామ్ؚను కలిగి ఉంది.

ఈ SUV పక్క భాగాలలో చేసిన ఏకైక మార్పు సరికొత్త అలాయ్ వీల్స్ సెట్. వెనుక వైపు, ఆల్మాజ్ కొత్త టెయిల్‌లైట్‌లను వూలింగ్ బ్యాడ్జ్ؚతో అనుసంధానం చేసే మెరిసే నలుపు రంగు పట్టీతో ఉంది. ఈ కారు తయారీదారు వెనుక బంపర్ؚను కూడా రీడిజైన్ చేశారు, ఇప్పుడు ఇది క్రోమ్ స్ట్రిప్ؚతో వస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ పండుగ సీజన్ؚలో విడుదల కానున్న 5 కొత్త SUVలు

సుపరిచితమైన ఇంటీరియర్

2021 హెక్టార్ గురించి తెలిసిన వారికి, కొత్త వూలింగ్ అల్మాజ్’ ఇంటీరియర్ సుపరిచితంగా కనిపిస్తుంది (పూర్తి నలుపు రంగు థీమ్ మరియు హైబ్రిడ్ వర్షన్ కోసం కాంట్రాస్ట్ బ్లూ స్టిచింగ్). ప్రధానంగా మధ్యలో నిలువుగా అమర్చిన భారీ టచ్ؚస్క్రీన్‌తో, క్యాబిన్ లేఅవుట్ సారూప్యంగా కనిపిస్తుంది.

ఇందులో ఉన్న ఫీచర్‌లలో పనరోమిక్ సన్ؚరూఫ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. దీని భద్రత సాంకేతికతలలో 360-డిగ్రీల కెమెరా, అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు మల్టీపుల్ ఎయిర్ బ్యాగ్ؚలు ఉన్నాయి.

బోనెట్ క్రింద హైబ్రిడ్ సెట్అప్

ఇండోనేషియా-స్పెక్ హెక్టార్ (ఆల్మాజ్) రెండు ఇంజన్ ఎంపికలలో అందించబడుతుంది: 140PS 1.5-లీటర్ టర్బో-పెట్రో యూనిట్ మరియు 2-లీటర్ బలమైన-హైబ్రిడ్ ఇంజన్. ఇవి రెండూ ఆటోమ్యాటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. మొదటి దానిలో CVT మరియు రెండవ దానిలో e-CVT ఉంటాయి.

మరొక వైపు, ఇండియా-స్పెక్ MG హెక్టార్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ (143PS/250Nm) మరియు 2-లీటర్ డీజిల్ (170PS/350Nm) ఇంజన్ ఎంపికలను పొందుతుంది. 6-స్పీడ్ మాన్యువల్ ప్రామాణికంగా అందించబడుతుంది, 8-స్టెప్ CVT ఐచ్ఛికంగా కూడా పెట్రోల్ ఇంజన్‌నుؚ పొందవచ్చు. ఇవి రెండూ ముందు వీల్స్ؚకు శక్తిని అందిస్తాయి. MG డిజైన్ అప్ؚడేట్ؚను తీసుకువస్తున్నప్పటికీ, హెక్టార్ SUVల పవర్‌ట్రెయిన్ؚలలో ఎటువంటి మార్పు ఉండదని ఆశిస్తున్నాము.

ఇది కూడా చదవండి: పనోరమిక్ సన్ؚరూఫ్ కోసం చూస్తున్నారా? రూ.20 లక్ష కంటే తక్కువ ధర కలిగిన ఈ 10 కార్ؚలలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది

MG హెక్టార్ ధరలు మరియు పోటీదారులు

ఇండియా-స్పెక్ హెక్టార్ – ఐదు, ఆరు మరియు ఏడు – బహుళ సీటింగ్ కాన్ఫిగరేషన్ؚలలో విక్రయించబడుతుంది – చివరి రెండిటినీ ‘హెక్టార్ ప్లస్’ పేరుతో అందిస్తున్నారు, MG హెక్టార్ శ్రేణిని రూ.15 లక్షల నుండి రూ.23.58 లక్షల (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) ధరతో విక్రయిస్తుంది. 5-సీట్ల హెక్టార్, టాటా హ్యారియర్, జీప్ కంపాస్, మహీంద్రా XUV700 మరియు మహీంద్రా స్కార్పియో N వంటి వాటితో పోటీ పడుతుంది. మరొక వైపు దీని 3-వరుసల వర్షన్ టాటా సఫారి, మహీంద్రా XUV700 (7-సీటర్) మరియు హ్యుందాయ్ ఆల్కాజార్ؚలతో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: MG హెక్టార్ ఆన్ؚరోడ్ ధర

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 59 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన ఎంజి హెక్టర్

Read Full News

explore similar కార్లు

ఎంజి హెక్టర్

Rs.13.99 - 21.95 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్13.79 kmpl
డీజిల్13.79 kmpl
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్
వీక్షించండి మే ఆఫర్లు

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.7.51 - 13.04 లక్షలు*
Rs.43.81 - 54.65 లక్షలు*
Rs.9.98 - 17.90 లక్షలు*
Rs.13.99 - 21.95 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర