ఈ పండుగ సీజన్ؚలో విడుదల కానున్న 5 సరికొత్త SUVలు
హోండా ఎలివేట్ కోసం rohit ద్వారా ఆగష్టు 16, 2023 01:20 pm ప్రచురించబడింది
- 1.4K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ పండుగ సీజన్‌లో కొత్త విడుదలలో భాగంగా టాటా, హోండా మరియు మరిన్ని బ్రాండ్ؚల నుండి సరికొత్త మరియు నవీకరించిన మోడల్‌లు వస్తాయని ఆశించవచ్చు
పండుగ సీజన్ ఎంతో సంతోషాన్ని మరియు ఆనందాన్ని తీసుకువస్తుంది, ప్రత్యేకించి మీరు కారు ఔత్సాహికులు లేదా కొనుగోలుదారులు అయితే, ఈ సంతోషం రెట్టింపు అవుతుంది. ఈ సంవత్సరం కూడా భిన్నంగా ఏమి లేదు, 2023లో రానున్న నెలలలో అనేక కొత్త కార్ؚలు విడుదల కాబోతున్నాయి, ఇందులో చాలా వరకు SUV విభాగానికి చెందినవి. ఈ పండుగ సీజన్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న టాప్ ఐదు SUVలను ఇక్కడ చూద్దాం.
హోండా ఎలివేట్
ఇప్పటికే అనేక మోడల్‌లతో క్రిక్కిరిస కాంపాక్ట్ SUV విభాగంలో హోండా ఎలివేట్ؚను ప్రవేశపెడుతుంది. ఇది హోండా సిటీ ప్లాట్ؚఫారంపై ఆధారపడింది మరియు కొన్ని నెలల క్రితం ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో ఆవిష్కరించబడింది. ఈ SUV సీరీస్ ఉత్పత్తిని హోండా ఇప్పటికే ప్రారంభించింది మరియు రూ.5,000 చెల్లించి బుకింగ్ؚలను కూడా చేసుకోవచ్చు. సెప్టెంబర్‌లో విక్రయాలు జరగనున్నాయి మరియు ధరలు రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయని అంచనా.
అవే మాన్యువల్ మరియు CVT ట్రాన్స్ؚమిషన్ ఎంపికలతో ఈ కాంపాక్ట్ సెడాన్ 1.5-లీటర్ పెట్రోల్ పవర్ؚట్రెయిన్ؚను (121PS/145Nm) పొందింది. ఎలివేట్ EV వర్షన్ తయారీలో ఉన్నట్లు మరియు 2026 నాటికి విడుదల కానున్నట్లు హోండా ధృవీకరించింది. ఫీచర్ హైలైట్‌లలో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్, సింగిల్-పేన్ సన్ؚరూఫ్ మరియు వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. భద్రత సాంకేతికతలో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు మరియు రెండు కెమెరాలు (ఒకటి ఎడమ ORVM పై మరియు రెండవది వెనుక పార్కింగ్ యూనిట్ పై అమర్చబడింది) ఉన్నాయి.
సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్
ఇండియన్ లైన్అప్ؚలో, ఈ ఫ్రెంచ్ తయారీదారు నుండి వస్తున్న నాలుగవ మోడల్ అయినప్పటికీ, C5 ఎయిర్ؚక్రాస్ తరువాత సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ రెండవ SUVగా నిలుస్తుంది. ఇది C3 క్రాస్ؚఓవర్-హ్యాచ్ؚబ్యాక్ ప్లాట్ؚఫారంపై ఆధారపడింది, అయితే ఇది పొడవైనది, 5-మరియు 7-సీటర్ లేఅవుట్ؚలలో అందించబడుతుంది. దీని బుకింగ్ؚలు సెప్టెంబర్ؚలో ప్రారంభం కానున్నాయి మరియు ఇది అక్టోబర్ؚలో విడుదల అవుతుంది, ధరలు రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు.
110PS మరియు 190Nmను టార్క్‌ను విడుదల చేసే C3 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను C3 ఎయిర్ؚక్రాస్ పొందింది. కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది అయితే భవిష్యత్తులో ఆటోమ్యాటిక్ కూడా వస్తుందని ఆశించవచ్చు. ఇది సాధారణ ఫీచర్‌ల జాబితాను కలిగి ఉంది అయితే ఇందులో 10-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మాన్యువల్ AC వంటి అవసరమైనవి ఉన్నాయి. దీని భద్రతా కిట్ؚలో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ؚలు, రివర్సింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: పనోరమిక్ సన్ؚరూఫ్ కోసం చూస్తున్నారా? రూ.20 లక్షల కంటే తక్కువ ధరతో ఈ ఫీచర్‌ను పొందిన 10 కార్ؚల వివరాలు
టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్
వచ్చే రెండు నెలలలో, భారీగా నవీకరించిన టాటా నెక్సాన్ 2023ని మనం చూడవచ్చు. ఇది అనేకసార్లు పరీక్షించబడుతూ కెమెరాకు చిక్కింది, ఇటీవలి రహస్య చిత్రాలలో ప్రొడక్షన్‌కు సిద్దంగా ఉన్న మోడల్‌ను చూడవచ్చు. నవీకరించిన టాటా నెక్సాన్ ధరలు రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయని అంచనా.
టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ (సబ్-4మీ SUV రెండవ భారీ మిడ్-లైఫ్ నవీకరణ) కొత్త డిజైన్ؚను పొందనుంది, ఇది దీన్ని లోపల మరియు వెలుపల నుండి మరింత దృఢంగా మరియు ప్రీమియంగా కనిపించేలా చేస్తుంది. ప్రస్తుత మోడల్ؚలో ఉన్న 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚతోనే రావచ్చు అయితే కొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ؚను కూడా పొందువచ్చు. మాన్యువల్, AMT మరియు DCT ఎంపికలలో అందించవచ్చు. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు పూర్తిగా డిజిటల్ డిస్ప్లే వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఇందులో 360-డిగ్రీ కెమెరా, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؘలు వంటి భద్రత ఫీచర్‌లను టాటా అందించవచ్చు.
టాటా నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్
టాటా నెక్సాన్ నవీకరించిన ఇంటర్నల్ కంబుషన్ ఇంజన్ (ICE)ؚతో పాటుగా, ఈ మోడల్ స్వరూప EV వెర్షన్‌ను కూడా టాటా విడుదల చేయనుంది. కొత్త నెక్సాన్‌ను విక్రయించే సమయానికే సరికొత్త నెక్సాన్ EV విక్రయల కూడా జరగవచ్చని అంచనా, వీటి ధరలు రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు.
లుక్ పరంగా ICE వర్షన్ పొందిన నవీకరణలను ఇది కూడా పొందవచ్చు, ప్రస్తుత మోడల్‌లలో చూస్తినట్లు దీని పూర్తి ఎలక్ట్రిక్ స్వభావాన్ని సూచించే నిర్దిష్ట మార్పులు ఉండవచ్చు. ఇంతకు ముందు విధంగానే అవే రెండు వర్షన్‌లలో నవీకరించిన నెక్సాన్ EVని టాటా అందించవచ్చని భావిస్తున్నాము. ఇవి: ప్రైమ్ (30.2kWh బ్యాటరీ ప్యాక్; 312km పరిధి) మరియు మాక్స్ (40.52kWh బ్యాటరీ ప్యాక్; 453km పరిధి). 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, బ్యాటరీ రీజనరేషన్ కోసం ప్యాడిల్ షిఫ్టర్‌లు, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్‌లు ఉండవచ్చు. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు మరియు 360-డిగ్రీల కెమెరా వంటి వాటిని జోడించడంతో భద్రత మరింతగా మెరుగుపడింది, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؚలు మరియు రేర్ పార్కింగ్ సెన్సర్‌లు వంటి వాటిని కొనసాగిస్తుంది.
ఇది కూడా చదవండి: 1 లక్ష దాటిన టాటా EVల విక్రయాలు – నెక్సాన్ EV, టియాగో EV మరియు టిగోర్ EV
5-డోర్‌ల ఫోర్స్ గూర్ఖా
చాలా కాలం తరువాత విడుదల కానున్న SUV 5-డోర్‌ల ఫోర్స్ గూర్ఖా. దీని టెస్టింగ్ 2022 మొదట్లో ప్రారంభమైంది మరియు అప్పటి నుండి చాలాసార్లు పరీక్షించబడుతూ కనిపించింది. దీని విక్రయాలు ఈ పండుగ సీజన్ؚలో ప్రారంభం అవుతాయని మరియు ధరలు రూ.16 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటాయని అంచనా.
ఇటీవలి చిత్రాలు, ఈ 5-డోర్‌ల వెర్షన్ రెండు మరియు మూడవ వరుసలలో వరుసగా బెంచ్ సీట్లు మరియు కెప్టెన్ సీట్లను పొందవచ్చని సూచిస్తున్నాయి. ఇతర నవీకరణలలో సవరించిన లైటింగ్ సెట్అప్ మరియు భారీ 18-అంగుళాల అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. 3-డోర్‌ల మోడల్ؚలో ఉన్న అదే 2.6-లీటర్ డీజిల్ ఇంజన్ؚతో 5-డోర్‌ల గూర్ఖా (90PS/250Nm) రానుంది, కానీ మరింత సామర్ధ్యంతో రావచ్చు. అవే 5-స్పీడ్ మాన్యువల్ గేర్ؚబాక్స్‌ను పొందవచ్చు మరియు 4-వీల్ డ్రైవ్ ట్రెయిన్ؚలు ప్రామాణికంగా ఉండవచ్చు. ఇందులో 7-అంగుళాల టచ్ؚస్క్రీన్, మొదటి మరియు రెండవ వరుస పవర్ విండోలు మరియు మాన్యువల్ ACలు ఉండవచ్చు. ఫోర్స్ దీన్ని డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ؚలు, రివర్సింగ్ కెమెరా, మరియు రేర్ పార్కింగ్ సెన్సర్‌లతో అందించవచ్చు.
ఈ పండుగ సీజన్‌లో విడుదల అవుతాయని ఆశిస్తున్న SUVల వివరాలు ఇవి, వీటిలో దేని గురించి మీరు ఎక్కువగా వేచి చూస్తున్నారు, ఎందుకు? కామెంట్‌లో మాకు తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఉత్తమమైన ఫీచర్‌లు మరియు సరసమైన ధరలలో లభించే 10 CNG కార్ؚల వివరాలు