Cardekho.com

రూ. 7.99 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన Citroen Basalt

ఆగష్టు 09, 2024 01:22 pm samarth ద్వారా ప్రచురించబడింది
163 Views

కొనుగోలుదారులు ఈరోజు నుంచి రూ.11,001 చెల్లింపుతో SUV-కూపేని బుక్ చేసుకోవచ్చు

Citroen Basalt Launched

  • ప్రారంభ ధరలు అన్ని బుకింగ్‌లు మరియు డెలివరీలపై అక్టోబర్ 31 వరకు మాత్రమే చెల్లుతాయి.
  • ఎల్‌ఈడీ లైటింగ్, 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు స్లోపింగ్ రూఫ్‌లైన్ వంటి బాహ్య అంశాలు ఉన్నాయి.
  • 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటో AC, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది.
  • బసాల్ట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలను పొందుతుంది: 1.2-లీటర్ N/A మరియు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్.

​​​​​​​ఆవిష్కరించిన కొద్ది రోజులకే, సిట్రోయెన్ బసాల్ట్ మార్కెట్‌లో విడుదల చేయబడింది. ఇది అంతర్గత దహన ఇంజిన్ (ICE)తో సిట్రోయెన్ యొక్క మొట్టమొదటి మాస్-మార్కెట్ SUV-కూపేగా గుర్తించబడింది, దీని ధర రూ. 7.99 లక్షలు (పరిచయ, ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా). సిట్రోయెన్ అధికారికంగా అగ్ర శ్రేణి వేరియంట్ ధరలను తెలియజేయనప్పటికీ, మేము దాని ధరను తెలుసుకున్నాము, ఇది రూ. 13.57 లక్షలుగా పేర్కొనబడింది.

Citroen Basalt Prices

ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ ఇప్పుడు SUV-కూపే కోసం రూ. 11,001 ముందస్తు చెల్లింపుతో బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. ప్రారంభ ధరలు అక్టోబర్ 31 వరకు చేసిన అన్ని బుకింగ్‌లు మరియు డెలివరీలకు చెల్లుబాటు అవుతాయి. మీరు తెలుసుకోవలసినవన్నీ ఇక్కడ ఉన్నాయి:

ఎక్స్టీరియర్

బసాల్ట్, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌ను పోలి ఉంటుంది, LED DRLల కోసం V-ఆకారపు నమూనా మరియు స్ప్లిట్ గ్రిల్ కూడా ఉంటుంది. ఇది LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లను పొందుతుంది, ఇది త్వరలో C3 ఎయిర్‌క్రాస్‌లో కూడా అందించబడుతుంది. ఫ్రంట్ బంపర్ ఎరుపు రంగులతో కూడిన సిల్వర్ ఫినిషింగ్ ను కలిగి ఉంది, ఇది స్పోర్టీ టచ్‌ను జోడిస్తుంది.

సైడ్ భాగం విషయానికి వస్ట్, ఇది కూపే రూఫ్‌లైన్‌ను పొందుతుంది మరియు 16-అంగుళాల డ్యూయల్-టోన్ ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. వెనుక భాగంలో, ఇది బ్లాక్-అవుట్ బంపర్‌లతో చుట్టబడిన హాలోజన్ టెయిల్ లైట్‌లను పొందుతుంది.

బసాల్ట్ యొక్క కొలతలు క్రింది విధంగా ఉన్నాయి:

కొలతలు

పొడవు

4352 మి.మీ

వెడల్పు (ORVMలు లేకుండా)

1765 మి.మీ

ఎత్తు (లాడెడ్)

1593 మి.మీ

వీల్ బేస్

2651 మి.మీ

బూట్ స్పేస్

470 లీటర్లు

సిట్రోయెన్ బసాల్ట్ ఐదు మోనోటోన్ రంగు ఎంపికలలో అందించబడుతుంది: పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ మరియు గార్నెట్ రెడ్. ఇది రెండు డ్యూయల్-టోన్ ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది: అవి వరుసగా ప్లాటినం గ్రే రూఫ్‌తో పోలార్ వైట్ మరియు పెర్లా నెరా బ్లాక్ రూఫ్‌తో గార్నెట్ రెడ్.

క్యాబిన్, ఫీచర్లు మరియు భద్రత

బసాల్ట్ యొక్క క్యాబిన్ దాని SUV తోటి వాహనం, C3 ఎయిర్‌క్రాస్ నుండి ఒకేలా డ్యాష్‌బోర్డ్, డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లేలు (10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ మరియు 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే) మరియు AC వెంట్‌ల రూపకల్పనతో సహా ఎలిమెంట్‌లను కూడా తీసుకుంటుంది.

ఇతర ఫీచర్లు ఆటోమేటిక్ AC, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు వెనుక సీట్లకు (87 మిమీ వరకు) సర్దుబాటు చేయగల తొడ కింద మద్దతు వంటివి అందించబడతాయి.

దీని భద్రతా కిట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెనుక పార్కింగ్ కెమెరా మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.

పవర్ ట్రైన్

బసాల్ట్ ఈ పవర్‌ట్రెయిన్ స్పెసిఫికేషన్‌లతో అందించబడుతుంది:

స్పెసిఫికేషన్

1.2-లీటర్ N/A పెట్రోల్

1.2-లీటర్ టర్బో-పెట్రోల్

శక్తి

82 PS

110 PS

టార్క్

115 Nm

205 Nm వరకు

ట్రాన్స్మిషన్

5-స్పీడ్ MT

6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT

క్లెయిమ్ చేసిన మైలేజీ

18 kmpl

19.5 kmpl, 18.7 kmpl

ప్రత్యర్థులు

సిట్రోయెన్ బసాల్ట్ నేరుగా టాటా కర్వ్ కి ప్రత్యర్థిగా నిలుస్తుంది, అదే సమయంలో మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, హ్యుందాయ్ క్రెటా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, కియా సెల్టోస్, సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్, స్కోడా కుషాక్ మరియు MG ఆస్టర్ వంటి వాటితో పోటీ పడుతుంది .

అన్ని తాజా ఆటోమోటివ్ అప్‌డేట్‌ల కోసం కార్దెకో యొక్క వాట్సప్ ఛానెల్‌ని అనుసరించండి

Share via

Write your Comment on Citroen బసాల్ట్

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర