షెవీ వారు 2016 కమారో కి సంబంధించిన సామర్ధ్యపు వివరాలను విడుదల చేశారు
జైపూర్: షెవ్రొలే వారు కొత్త ఆరవ-తరం కమారో యొక్క సామర్ధ్యపు వివరాలను విడుదల చేశారు. ఈ 2016 కమారో ఎసెస్ ఇప్పటి వరకు ఉన్న అన్ని షెవీలకంటే వేగవంతమైనది అని, గనటకి 60 మైళ్ళని 4 సెకనుల్లో చేరుకుంటుంది. ఈ కొత్త ఎసెస్ లో 6.2 వీ8 455-హ్ప్ మోటర్ ని అమర్చి సరికొత్త 8-స్పీడ్ ప్యాడల్ షిఫ్ట్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేశారు. అందు చేత ఇది ఇప్పుడు 2015 ఫోర్డ్ మస్టాంగ్ జీటీ కంటే కూడా వేగవంతమైనది.
"కమారో యొక్క 2.0-లీటర్ టర్బో చార్జర్ 1960 లలోని ఎన్నో కార్లను సవాలు చేస్తుంది. ఇది 0.97 g కార్నరింగ్ ని కలిగి, మార్కెట్ లో ఉన్న అన్ని 2+2 కూపే ల కంటే ఉత్తమమైనది," అని కమారో కి చీఫ్ ఇంజినీరు అయిన అల్ ఓపెనెయిజర్ అన్నారు. "సమర్ధత వివరాలు కేవలం సగం కథ నే చెబుతాయి. తేలికైన బరువుని కలిగిన కమారో నడిపినప్పుడు ఇంకా ఎన్నో రెట్లు సమర్ధంగా ఉంటుంది. దీని బ్రేకులు మరింత శక్తిమంతంగా, మూలలకు మరింత చురుకుగా,వేగవంతంగా మరియూ నడిపేందుకు మరింత ఉల్లాస్భరితంగా ఉంటుంది," అని అన్నారు.
ఇతర ఆరవ తరం కమారో కూపే మోడల్స్ కి 275-hp (205) 2.0-లీటర్ టర్బో దాదాపు 0-60Kmph ని 5.4 సెకనుల్లో చేరుకుంటుంది మరియూ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంది. అమర్చబడిన 335-hp(250Kw) 3.6-లీటర్ V-6 మరియూ 8-స్పీడ్ ఆటోమాటిక్ తో కమరో 5.1 సెకనుల్లో గంటకి 60 మైళ్ళను చేరగలదు.