షెవ్రొలే ట్రెయిల్‌బ్లేజర్ అమేజాన్.కాం లో అందుబాటులో ఉంది
అక్టోబర్ 15, 2015 10:12 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
రాబోయే ట్రెయిల్‌బ్లేజర్ ను షెవ్రొలే వారు అమేజాన్ ఇండియా తో భాగస్వామ్యం అయ్యి అమ్మకానికి పెట్టనున్నారు. ఇదే కాకుండా కస్టమర్లు వాహనాన్ని షోరూముల్లో కూడా అక్టోబరు 21, 2015 నుండి బుకింగ్ చేసుకోవచ్చు.
జెనరల్ మోటర్స్ ఇండియా కి ప్రెసిడెంట్ ఇంకా మ్యానేజింగ్ డైరెక్టర్ అయిన మిస్టర్. అరవింద్ సక్సేనా గారి మాటల్లో," షెవ్రొలే ట్రెయిల్‌బ్లేజర్ ఒక శక్తివంతమైన కారు. దీనిని మేము ఘనంగా ప్రవేశపెట్టడం కోసం ఇలా అమేజాన్ లో అందిస్తున్నాము. ప్రీమియం వాహనాలకు ఇది ఒక కొత్త రకమైన ప్రకటనా విధానం. షెవ్రొలే కస్టమర్లకు ఇది ఒక నూతన అనుభవం అందిస్తుంది," అన్నారు.
"గత ఏడాది 2014 లో 40 మిలియన్ మంది ఆన్‌లైన్ కొనుగోలు చేయగా ఈ ఏడాది 65 మిలియన్ మంది కొనుగోలు చేయవచ్చును అని అంచనా. అందుకే మేము షెవ్రొలే ని ఆన్‌లైన్ కొనుగోలు చేసే విధంగా అందిస్తున్నాము," అని మిస్టర్ సక్సేనా గారు అన్నారు.
అమేజాన్ ఇండియా కి వైస్ ప్రెసిడెంట్ ఇంకా కంట్రీ మ్యానేజర్ అయిన అమిత్ అగర్వాల్ గారు," దేశంలోని మా కస్టమర్లకు ఇటువంటి ఆఫర్ ని అందించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. భారతదేశంలో డిజిటల్ ఎకానమీ పెరుగుతుండటంతో కస్టమర్ కొనుగోలు చేసే విధానం కూడా మారుతోంది. ఇది అందుకు ఒక ఉదాహరణ," అని తెలిపారు.
షెవ్రొలే ట్రెయిల్‌బ్లేజర్ ఇప్పుడు పూర్తి వివరాలతో వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంది. ఈ ఎస్‌యూవీ ని నామమాత్రపు మొత్తంతో బుక్ చేసుకోవచ్చును మరియూ కస్టమర్ మనసు మార్చుకుంటే ఇది తిరిగి పొందవచ్చును.
ఈ ఎస్6యూవీ టొయోటా ఫార్చునర్ మరియూ మిత్సుబిషి పజెరో స్పోర్ట్ తో తలపడనుంది.