• English
  • Login / Register

షెవ్రొలే ట్రెయిల్‌బ్లేజర్ రూ. 26.4 లక్షలకు విడుదల అయ్యింది

చేవ్రొలెట్ ట్రైల్ కోసం konark ద్వారా అక్టోబర్ 21, 2015 03:00 pm సవరించబడింది

  • 17 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: షెవ్రొలే వారు వారి ఎస్‌యూవీ ట్రెయిల్‌బ్లేజర్ ని రూ. 26.4 లక్షలకు విడుదల చేశారు.  ఇది ఈ కంపెనీ వారికి కాప్టివా తరువాత రెండవ ప్రీమియం ఎస్‌యూవీ మరియూ ప్రస్తుతం సీబీయూ ఉత్పత్తిగా ఉండనుంది. ఇందులో 2.8-లీటర్ డ్యూరామ్యాక్స్ ఇంజిను ఉండి ఇది 200ps శక్తి ఇంకా 500Nm టార్క్ విడుదల చేయగలదు. ఇది సెగ్‌మెంట్ కి లీడర్ అయిన టొయోటా ఫార్చునర్  సామర్ధ్యం కంటే 30ps/157Nm  ఎక్కువ. కాకపోతే, ట్రెయిల్‌బ్లేజర్ కేవలం 2 వీల్ డ్రైవ్ లో లభించి దీనికి 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ జత చేసి ఉంటుంది.

ట్రెయిల్‌బ్లేజర్ 4,878mm పొడవు, 1,902mm వెడల్పు మరియూ 1,847mm ఎత్తు ఉంటుంది. ఈ కారు 2,068mm కేజీల బరువుని మోయగలదు మరియూ 231mm యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉంటుంది. హిల్ స్టార్ట్ అస్సిస్ట్, హిల్-డిసెంట్ కంట్రోల్ మరియూ వాటర్ వేడింగ్ కెపాసిటీ 800mm గా ఉండటం వంటి అనేక లక్షణాలు ఈ కారులో ఉంటాయి. 

షెవ్రొలే కుటుంబానికి చెందిన డ్యువల్-పోర్ట్ గ్రిల్లు తో వెనక్కి దువ్వినటువంటి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియూ ఫాగ్ ల్యాంప్ చుట్టుతలకు కొత్త డిజైన్ వంటివి ఈ కారు ముందు వైపు రూపాన్ని అందంగా తీర్చిదిద్దుతాయి. పక్క వైపున పెద్ద అద్దాల ఫ్రేములు మరియూ క్రిందికి ఉన్న వీల్ ఆర్చెస్ ఉంటాయి.  వెనుక వైపున ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ తో క్రోము పూతలు ఉంటాయి. లోపల షెవ్రొలే వారి మైలింక్ 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టము కి బ్లూటూత్/ఆగ్జ్-ఇన్/యూఎస్‌బీ కనెక్టివిటీ వంటివి ఉంటాయి. ఈ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టం కి శాటిలైట్ నావిగేషన్ మరియూ ఒక రివర్స్ పార్కింగ్ క్యామెరా కి సెన్సర్స్ తో పాటు డిస్ప్లే కూడా ఉంది. 

was this article helpful ?

Write your Comment on Chevrolet ట్రైల్

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience