• English
  • Login / Register

MG Astor 100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్‌ వివరణాత్మక గ్యాలరీ

ఎంజి ఆస్టర్ కోసం ansh ద్వారా మే 22, 2024 08:51 pm ప్రచురించబడింది

  • 258 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

దాని మార్పులు చాలావరకు కాస్మెటిక్ అయినప్పటికీ, దాని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం గ్రీన్ థీమ్‌ను అందించడం ఇందులోని ఒక ప్రత్యేక ఫీచర్.

MG Astor 100-Year Limited Edition

MG ఆస్టర్ ఇటీవల హెక్టర్, కామెట్ EV మరియు ZS EVలతో పాటు 100-ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్‌ను పొందింది, దాని యూనిట్లు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లను చేరుకోవడం ప్రారంభించాయి. మీరు స్పెషల్ ఎడిషన్ ఆస్టర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే మరియు దానిని తనిఖీ చేయాలనుకుంటే, మీరు ఈ వివరణాత్మక గ్యాలరీని చూడవచ్చు.

ఎక్స్‌టీరియర్

MG Astor 100-Year Limited Edition Front

బ్రిటీష్ రేసింగ్ గ్రీన్ కలర్ నుంచి ప్రేరణ పొందిన "ఎవర్‌గ్రీన్" షేడ్‌తో ఈ స్పెషల్ ఎడిషన్ వస్తుంది. ఇది బ్లాక్ రూఫ్‌ను పొందగా, గ్రిల్ మరియు బంపర్ వంటి ఇతర బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్ సాధారణ క్రోమ్‌కు బదులుగా డార్క్ క్రోమ్‌లో పూర్తయ్యాయి.

MG Astor 100-Year Limited Edition Side

సైడ్ నుండి చుస్తే, పెద్ద మార్పులు లేవు, కానీ మీకు ఆల్-బ్లాక్ అల్లాయ్ వీల్స్, ORVM హౌసింగ్‌లు మరియు రూఫ్ రెయిల్స్ లభిస్తాయి.

MG Astor 100-Year Limited Edition Rear

అయితే, వెనుక భాగంలో టెయిల్‌గేట్‌పై '100 ఇయర్స్' బ్యాడ్జింగ్ మినహా చెప్పుకోదగ్గ డిజైన్ మార్పులు లేవు.

ఇంటీరియర్

MG Astor 100-Year Limited Edition Dashboard

క్యాబిన్ ఇలాంటి బ్లాక్ మరియు గ్రే కలర్ ట్రీట్మెంట్ ఉంటుంది, డాష్‌బోర్డ్ ఫినిషింగ్ ఆల్-బ్లాక్ లో ఉంటుంది.

MG Astor 100-Year Limited Edition Front Seats
MG Astor 100-Year Limited Edition Rear Seats

ఫ్రంట్ మరియు రేర్ సీట్లు బ్లాక్ మరియు గ్రీన్ అప్హోల్స్టరీతో వస్తాయి మరియు ఫ్రంట్ సీట్లలో కూడా 100 సంవత్సరాల బ్యాడ్జింగ్ ఉంటుంది.

MG Astor 100-Year Limited Edition Touchscreen

కానీ, ఇన్ఫోటైన్‌మెంట్‌లో మాత్రమే పెద్ద మార్పలు ఉన్నాయి, ఇది కారు థీమ్‌కి సరిపోయేలా గ్రీన్ కలర్ యూజర్ ఇంటర్ఫేస్ మరియు బటన్లను పొందుతుంది.

పవర్ ట్రైన్

MG Astor 100-Year Limited Edition

MG ఆస్టర్ రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది: 5-స్పీడ్ మాన్యువల్ మరియు CVT ఎంపికతో వచ్చే 1.5-లీటర్ పెట్రోల్ యూనిట్ (110 PS మరియు 144 Nm) మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్తో జతచేయబడిన 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (140 PS మరియు 220 Nm). అయితే, 100 ఇయర్ ఎడిషన్ మునుపటితో మాత్రమే అందుబాటులో ఉంది.

ఫీచర్‌లు

MG Astor 100-Year Limited Edition

SUV యొక్క షార్ప్ ప్రో వేరియంట్ ఆధారంగా ఈ స్పెషల్ ఎడిషన్‌లో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే, రేర్ AC వెంట్స్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, 6-వే పవర్ అడ్జెస్టబుల్ డ్రైవర్ సీట్ మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: టాటా కర్వ్ ప్రొడక్షన్-స్పెక్ ఇంటీరియర్ మొదటిసారి కెమెరాలో చూడబడింది

భద్రత పరంగా 6 ఎయిర్ బ్యాగులు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ మరియు డీసెంట్ కంట్రోల్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు 360 డిగ్రీల కెమెరా ఉన్నాయి.

ధర

MG Astor 100-Year Limited Edition

ఈ స్పెషల్ ఎడిషన్ ఆస్టర్ యొక్క మిడ్-స్పెక్ షార్ప్ ప్రో వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది మరియు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్‌లలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ ధరలు రూ. 14.81 లక్షల నుండి రూ. 16.08 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. MG ఆస్టర్ హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, టయోటా హైరైడర్ మరియు వోక్స్వాగన్ టైగూన్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

మరింత చదవండి: ఆస్టర్ ఆన్ రోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఎంజి ఆస్టర్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience