Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ SUVని వివరిస్తున్న 12 చిత్రాలు

సిట్రోయెన్ aircross కోసం ansh ద్వారా మే 02, 2023 11:45 am ప్రచురించబడింది

ఎట్టకేలకు కాంపాక్ట్ SUVని ఆవిష్కరించారు మరియు ఇది ఈ సంవత్సరం చివరిలో విడుదల కానుంది

ఫ్రెంచ్ కారు తయారీదారు సిట్రోయెన్ నుండి వస్తున్న ఈ సరికొత్త కాంపాక్ట్ SUV సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ 5 మరియు 7-సీటర్ లేఅవుట్ؚతో అందిస్తున్నారు. ఈ కారు తయారీదారు SUVని ఆవిష్కరించారు; దీని ధరలు మరియు బుకింగ్ వివరాలు ఇంకా వెల్లడించలేదు. C3 ఎయిర్ؚక్రాస్ లుక్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఫ్రంట్

C3 ఎయిర్ؚక్రాస్ ఫ్రంట్ ప్రొఫైల్, C3 మరియు C5 ఎయిర్ؚక్రాస్ؚల కలయిక కనిపిస్తుంది. దీని ముందు భాగం C5 ఎయిర్ؚక్రాస్ విధంగా భారీగా మరియు ధృఢంగా ఉంది, కానీ హెడ్ؚల్యాంపులు మరియు DRLలు C3 హ్యాచ్ؚబ్యాక్ؚలో ఉన్న విధంగా ఉన్నాయి. ఫాగ్ ల్యాంపుల అమరిక కూడా C3 హ్యాచ్ؚబ్యాక్ؚను పోలి ఉంది.

ఇది కూడా చదవండి: మీరు తెలుసుకోవలసిన సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ 5 ముఖ్యాంశాలు

ముందు నుండి, దీని ధృఢమైన తీరు కారణంగా హ్యాచ్ؚబ్యాక్‌తో పోలిస్తే ఈ SUV అదనపు వెడల్పును కూడా గమనించవచ్చు.

సైడ్

ఈ కాంపాక్ట్ SUV C3పై ఆధారపడినప్పటికీ, మూడవ వరుసను సర్దుబాటు చేయగలిగేలా గణనీయమైన పొడవును కలిగి ఉంటుంది. క్యాబిన్ؚను మరింత విశాలంగా చేయడానికి వీల్ؚబేస్ 100మిమీ కంటే ఎక్కువ పొడిగించబడింది. కొలతల పరంగా C3 ఎయిర్ؚక్రాస్, ఈ కారు తయారీదారు ఇతర రెండు మోడల్‌ల మధ్య స్థానంలో నిలుస్తుంది. పక్క నుంచి చూస్తే, హ్యాచ్ؚబ్యాక్ؚను పోలిన డోర్ హ్యాండిల్స్ؚతో పొడవైన, చదునైన బాడీని కలిగి ఉంది మరియు వాటి రెండు మోడల్‌ల విధంగానే డోర్ క్లాడింగ్ؚను పొందుతుంది.

మరొక వైపు, దీని అలాయ్ వీల్ డిజైన్ ఇతర రెండు మోడల్‌ల కంటే భిన్నంగా ఉంటుంది. C3 ఎయిర్ؚక్రాస్ؚలో 4-స్పోక్ؚలు, నలుపు మరియు సిల్వర్ రంగు ఫినిష్ؚతో 17-అంగుళాల అలాయ్ వీల్స్ కలిగి ఉంటుంది.

రేర్

దీని రేర్ ప్రొఫైల్ కూడా ధృఢంగా ఉంటుంది. ఈ SUV రెండు రిఫ్లెక్టర్లను కలిగి ఉన్న నలుపు మరియు బూడిద రంగు బంపర్ؚతో వెడల్పైన వెనుక భాగాన్ని కలిగి ఉంది. C3 ఎయిర్ؚక్రాస్ؚలో రెండు టెయిల్ ల్యాంపుల మధ్య కనెక్టింగ్ ఎలిమెంట్ కూడా ఉంది, ఇది భారతదేశంలో అందిస్తున్న ఈ కారు తయారీదారు ఇతర రెండు మోడల్‌ల డిజైన్‌లో ఇది కనిపించదు.

కానీ దీని టెయిల్ ల్యాంపుల డిజైన్ C3 హ్యాచ్ؚబ్యాక్ؚలో ఉన్న వాటిని పోలి ఉంటుంది, రెండు లైట్ ఎలిమెంట్ؚలు బయటకు వచ్చినట్లు ఉంటుంది. ఈ ల్యాంపులలో ఇండికేటర్‌ల పైన ఫ్రాస్టెడ్ యారోల ఆకర్షణీయమైన డిజైన్ؚను కూడా గమనించవచ్చు.

క్యాబిన్ మరియు ఫీచర్‌లు

ఇప్పుడు ఎక్స్ؚటీరియర్ నుండి C3 ఎయిర్ؚక్రాస్ ఇంటీరియర్ విషయానికి వద్దాము. దీని క్యాబిన్ కొంతమేరకు C3 హ్యాచ్ؚబ్యాక్ؚను పోలి ఉన్నప్పటికీ, తేలికపాటి వంపులతో నలుపు మరియు గోధుమ రంగు క్యాబిన్ థీమ్ؚతో అందించబడుతుంది.

10-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, AC వెంట్ؚలు మరియు డ్యాష్ؚబోర్డ్ؚలు ఒకే విధమైన డిజైన్ؚను పొందాయి. కానీ C3 హ్యాచ్ؚతో పోలిస్తే, దీనికి ఉన్న ప్రధానమైన తేడా 7-అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే.

C3 ఎయిర్‌క్రాస్ؚ ఇప్పటికీ మాన్యువల్ ACతోనే అందిస్తున్నారు, కానీ ఇండిపెండెంట్ ఫ్యాన్ కంట్రోల్‌తో రూఫ్‌కు అమర్చిన రేర్ AC వెంట్ؚలతో వస్తుంది. బహుళ ఎయిర్ؚబ్యాగ్ؚలు, EBDతో ABS, రేర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రేర్ వాషర్ మరియు వైపర్, మరియు రేర్ వ్యూ కెమెరా ఉండవచ్చని ఆశిస్తున్నాము.

వెనుక వైపు, 3-వరుసల సీటింగ్ లేఅవుట్ వస్తుంది, రెనాల్ట్ ట్రైబర్ؚలో ఉన్నట్లుగా చివరి వరుస సీట్‌లను తొలగించవచ్చు. కానీ ఈ కాంపాక్ట్ SUV ఖచ్చితంగా 5-సీటర్ లేఅవుట్ؚలో అందించబడుతుంది, దీని కారణంగా రూఫ్-ఇంటిగ్రేటెడ్ రేర్ AC వెంట్ؚలను కోల్పోవచ్చు.

పవర్ؚట్రెయిన్

C3 ఎయిర్ క్రాస్ 6-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించిన 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది. ఈ యూనిట్ కూడా C3 హ్యాచ్ؚలో ఉన్నదే మరియు 110PS పవర్ మరియు 190 Nm టార్క్‌ను అందిస్తుంది. ప్రస్తుతానికి, 3-వరుసల కాంపాక్ట్ SUV ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚను పొందటం లేదు, కానీ దీన్ని తరువాత జోడించవచ్చు.

ధర మరియు పోటీదారులు

ఈ C3 ఎయిర్ؚక్రాస్ ఆగస్ట్ؚలో విడుదల అవుతుంది అని అంచనా, ప్రారంభ ధర రూ.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఈ కాంపాక్ట్ SUV హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్వాగస్ టైగూన్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా హైరైడర్ వంటి వాటితో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: C3 ఆన్ؚరోడ్ ధర

Share via

Write your Comment on Citroen aircross

S
sandeep singh
Apr 29, 2023, 4:14:42 PM

Beautiful car for indian;s

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర