సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ గురించి మీరు తెలుసుకోవలసిన 5 ముఖ్యాంశాలు
మే 02, 2023 11:32 am tarun ద్వారా సవరించబడింది
- 33 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ కొత్త మూడు-వరుసల కాంపాక్ట్ SUV ఆగస్ట్ నాటికి మార్కెట్ؚలోకి ప్రవేశించనుంది
భారతదేశంలో, సిట్రోయెన్ అందించే నాలుగవ వాహనం C3 ఎయిర్ؚక్రాస్ తెరను తొలగించింది. తీవ్రమైన్ పోటీ ఉన్న కాంపాక్ట్ SUV విభాగంలోకి ఇది ప్రవేశించి హ్యుందాయ్ క్రెటా వంటి వాటితో పోటీ పడనుంది, అయితే దీనిలో ప్రత్యేకమైన 7-సీటర్ లేఅవుట్ ప్రతిపాదన ఉంది. C3 ఎయిర్ؚక్రాస్ గురించి అనేక వివరాలు ఇంకా వెల్లడి కావలసి ఉండగా, దీని గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు ఇక్కడ అందించాము:
ఇతర సిట్రోయెన్ؚల నుండి ప్రేరణ పొందింది
C3 ఎయిర్ؚక్రాస్ డిజైన్, C3 హ్యాచ్‌బ్యాక్ మరియు C5 ఎయిర్‌క్రాస్ؚల కలయికగా ఉంటుంది. నిటారైన ఫ్రంట్ ప్రొఫైల్ మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్ؚలను చూస్తే భారీ SUV ఆకారం గుర్తుకు వస్తుంది. మరొక వైపు, హాలోజన్ హెడ్ؚల్యాంప్ؚలతో LED DRLలు మరియు క్రోమ్ స్ప్లిట్ గ్రిల్ ఉన్నాయి, ఇవి C3 నుండి ప్రేరణ పొందాయి.
సరికొత్త 17-అంగుళాల అలాయ్ వీల్స్ మరియు సన్నని బాడీ క్లాడింగ్‌తో ధృఢమైన లుక్‌ను కనపరుస్తుంది. రేర్ ప్రొఫైల్ నిటారైన, ధృఢమైన తీరును కొనసాగిస్తుంది, చుట్టూ ఉన్న టెయిల్ ల్యాంపులు, బాడీ-క్లాడింగ్ ఇంటిగ్రేటెడ్ బంపర్ మరియు స్కిడ్ ప్లేట్ కూడా ఉంటాయి.
పరిమాణం ముఖ్యమైన అంశం
పొడవు |
4300మిమీ |
వెడల్పు |
1796మిమీ |
ఎత్తు |
1654మిమీ |
గ్రౌండ్ క్లియరెన్స్ |
200మిమీ |
వీల్ؚబేస్ |
2671మిమీ |
బూట్ కెపాసిటీ |
511 లీటర్ ల వరకు (మూడవ వరుసను తొలగించనప్పుడు) |
కాంపాక్ట్ SUV విభాగంలో, C3 ఎయిర్ؚక్రాస్ అత్యధిక వీల్ؚబేస్ కలిగి ఉందని చెప్పుకోవచ్చు, ఇతర కొలతలు కూడా పోటీదారులతో సమానంగా ఉన్నాయి. ఇది ఐదు మరియు ఏడు-సీటర్ ఫార్మాట్‌లలో లభిస్తుంది, రెండవ ఫార్మాట్ؚలో మూడవ వరుస సీట్‌లను తొలగించే సౌకర్యం ఉంది.
ఫీచర్‌లు, మరీ ఎక్కువగా లేవా?
దీని హ్యాచ్ؚబ్యాక్ వెర్షన్ؚ విధంగానే, C3 ఎయిర్ؚక్రాస్ తన పరిమిత ఫీచర్‌ల జాబితాలో అంతగా ఆకట్టుకోదు. 10-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, రెండవ వరుస రూఫ్ؚకు అమర్చిన AC వెంట్ؚలు, మరియు ఐదు ఫాస్ట్-ఛార్జర్ పోర్ట్ؚలతో వస్తుంది.
దీనిలో ఆటోమ్యాటిక్ AC మరియు క్రూజ్ కంట్రోల్ ఫీచర్‌లు లేవు, వీటిని ఇందులో అందించవలసింది. ఈ రంగంలోని పోటీదారులతో పోలిస్తే, దీనిలో వెంటిలేటెడ్ సీట్‌లు, వైర్ؚలెస్ ఛార్జింగ్ మరియు సన్ؚరూఫ్ వంటి ప్రీమియం ఫీచర్‌లు కూడా లేవు.
భద్రత విషయంలో, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ؚబ్యాగ్ؚలు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ (ప్రామాణికం)లతో వస్తుంది. విడుదలకు ముందు, భద్రత ఫీచర్‌లకు సంబందించిన మరిన్ని వివరాలు విడుదలకు ముందు తెలుస్తాయని ఆశిస్తున్నాము, కానీ విడుదల సమయంలో ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు ఉండకపోవచ్చు.
పవర్ؚట్రెయిన్ ఎంపికలు
సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ؚను ఆరు-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚకు జోడించిన 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగిన కేవలం ఏకైక పవర్‌ట్రెయిన్ؚతో మాత్రమే విడుదల చేయనుంది. ఇది C3 హ్యాచ్ؚబ్యాక్ؚలో ఉన్న, 110PS పవర్ మరియు 190Nmగా టార్క్‌ను అందించే ఇంజన్, కానీ SUV కొంత మార్పుతో వస్తుండొచ్చు. ఆటోమ్యాటిక్ తదుపరి దశలో పరిచయం చేయబడుతుంది. C3 ఎయిర్ؚక్రాస్ EVకి కూడా ప్రణాళికలో ఉంది, ఎందుకంటే దీని ప్లాట్ఫార్మ్ؚకు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ؚను కూడా కలిగి ఉండే సామర్ధ్యం ఉంది.
ధర అంచనా మరియు పోటీదారులు
సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ ధర సుమారు రూ.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని ఆశిస్తున్నాము. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్, మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి వాటితో పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి : C3 ఆన్ؚరోడ్ ధర