• English
  • Login / Register

5 చిత్రాలలో Hyundai Exter యొక్క బేస్-స్పెక్ EX వేరియంట్‌ తనిఖీ

హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం shreyash ద్వారా సెప్టెంబర్ 22, 2023 08:53 pm ప్రచురించబడింది

  • 84 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

బేస్-స్పెక్ హ్యుందాయ్ ఎక్స్టర్  ధర రూ. 6 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంది.

Hyundai Exter

జూలై 2023లో విడుదల అయిన తరువాత, హ్యుందాయ్ ఎక్స్టర్‌కు మరింత డిమాండ్ పెరిగింది మరియు ఈ ధర శ్రేణిలోని ఇతర కార్ؚలకు గట్టి పోటీని ఇస్తోంది. హ్యుందాయ్ దీన్ని ఆరు విస్తృత వేరియెంట్ؚలలో అందిస్తోంది –EX, S, SX, SX (O), మరియు SX (O) కనెక్ట్. ఎక్స్టర్ విక్రయాలు మొదలై రెండు నెలల పైగా అయ్యింది కాబట్టి, దీని బేస్-స్పెక్ వేరియెంట్ؚలు కూడా డీలర్ షిప్ؚలకు చేరుకున్నాయి. ఈ కథనంలో, ఎక్స్టర్ బేస్-స్పెక్ EX వేరియెంట్ అందిస్తున్నది ఏమిటో పరిశీలిద్దాం.

దీని ఫ్రంట్ లుక్ؚతో ప్రారంభిద్దాం, బేస్-స్పెక్ ఎక్స్టర్ؚలో బై-ఫంక్షనల్ ప్రొజెక్టర్ హెడ్ؚల్యాంపులు లేవు; వీటికి బదులుగా ఇందులో సాధారణ హాలోజెన్ హెడ్ؚలైట్ సెట్అప్ؚతో వస్తుంది. అదనంగా, ఈ మైక్రో SUV వేరియెంట్ؚలో LED DRLలు కూడా లేవు. అయితే, H-ఆకారపు ప్యాటర్న్ అదే హౌసింగ్ؚలో హైలైట్ చేయబడింది, ఇండికేటర్ వెనుక వైపు అమర్చబడింది.

అలాగే, ఇది మాట్ ఫినిష్ కలిగి ఉన్న నల్లపు రంగు గ్రిల్ؚతో వస్తుంది, హయ్యర్-వేరియెంట్ؚలలో నలుపు రంగు పెయింట్ చేసిన గ్రిల్ ఉంటుంది. అయితే ప్రామాణిక ఫిట్మెంట్ؚగా సిల్వర్ స్కిడ్ ప్లే మాత్రం వస్తుంది.

ప్రొఫైల్ విషయానికి వస్తే, బేస్-స్పెక్ ఎక్స్టర్, వీల్ కవర్ؚలు లేకుండా చిన్నవైన 14-అంగుళాల స్టీల్ వీల్స్ పై నడుస్తుంది. ఇండికేటర్‌లు సైడ్ ఫెండర్‌పై అమర్చబడ్డాయి, OVMలు మరియు డోర్ హ్యాండిల్ؚలు బాడీ రంగులో లేవు. అయితే, రూఫ్ రెయిల్స్ లేనప్పటికీ, వీల్ ఆర్చ్ؚలు మరియు ‌డోర్ల పై సైడ్ క్లాడింగ్ؚతో ధృడమైన రూపాన్ని నిలుపుకుంది.

వెనుక భాగానికి వస్తే, ఎక్స్టర్ EX ఇప్పటికీ మధ్యలో హ్యుందాయ్ లోగో కలిగి, నల్లపు రంగు స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడిన H-ఆకారపు LED టెయిల్ ల్యాంపులను కలిగి ఉంది. సిల్వర్ రంగు ఫినిష్‌తో స్కిడ్ ప్లేట్ؚలను కూడా చూడవచ్చు. అయితే రేర్ డీఫాగర్, రేర్ వైపర్ మరియు రేర్ స్పాయిలర్ లేకపోవడం హయ్యర్ వేరియెంట్ؚల నుండి దీన్ని భిన్నంగా ఉండేలా చేస్తాయి.

బేస్-స్పెక్ ఎక్స్టర్ లోపల వైపు, మీరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లేదా స్పీకర్ సెట్అప్ؚ లేదు. అయితే, ఇది సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ؚతో వస్తుంది, స్టీరింగ్ వీల్ؚను నియంత్రించడానికి కొత్త బటన్‌లు కూడా ఉన్నాయి. అలాగే, ఎక్స్టర్ ఈ ప్రత్యేకమైన వేరియెంట్ కేవలం ఫ్రంట్ పవర్ విండోలతో మాత్రమే వస్తుంది, అయితే హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ؚను మీరు గమనించవచ్చు.

ఈ ఎక్స్టర్ లోపల ఉండే ఇతర సౌకర్యాలలో మాన్యువల్ AC కంట్రోల్‌లు, ORVMల కోసం మాన్యువల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉన్నాయి. ఆటో-డిమ్మింగ్ IRVM, డ్యూయల్ డ్యాష్ కామ్ సెట్అప్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆటో-డిమ్మింగ్ ఫీచర్‌లను అందించడం లేదు. 

పవర్ؚట్రెయిన్ తనిఖీ

హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది, ఇది 83PS పవర్ మరియు 114NM టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ యూనిట్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడుతుంది. ఈ మైక్రో SUV EX వేరియెంట్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికతో మాత్రమే లభిస్తుంది. 

ఇది ఇంజన్ CNG మోడల్‌లలో కూడా పని చేస్తుంది, అయితే అవుట్ؚపుట్ 69PS మరియు 95NM ఉంటుంది, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ ఎంపిక మాత్రమే ఉంటుంది. 

ధర & పోటీదారులు 

ఎక్స్టర్ ధరను హ్యుందాయ్ రూ.6 లక్షల నుండి రూ.10.10 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు నిర్ణయించింది. ఇది టాటా పంచ్ؚతో నేరుగా పోటీ పడుతుంది, మారుతి ఇగ్నిస్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్, సిట్రోయెన్ C3, మరియు మారుతి ఫ్రాంక్స్ؚలకు ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు.

ఇక్కడ మరింత చదవండి: ఎక్స్టర్  AMT

was this article helpful ?

Write your Comment on Hyundai ఎక్స్టర్

1 వ్యాఖ్య
1
G
gb muthu
Sep 24, 2023, 3:32:42 PM

Wow, how interesting. If only it was a 6 seater. 60/40 front row seating assisted by dashboard mounted gear-selector.

Read More...
    సమాధానం
    Write a Reply

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience