కళ్ళకు పట్టుబడ్డ రాబోయే ఫియట్ లీనియా ఎలిగేంట్ లిమిటెడ్ ఎడిషన్

ఫియట్ లీనియా కోసం manish ద్వారా జూలై 29, 2015 05:55 pm సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఫియట్ లీనియా, ఒక కొత్త వేరియంట్ ను భారతదేశ మార్కెట్ లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త కారు పేరు ఫియట్ లీనియా ఎలిగేంట్ మరియు దీనిని భారతదేశం లో ప్రస్తుతం ఉన్న లీనియా రేంజ్ పైన ఈ లిమిటెడ్ ఎడిషన్ ను ఉంచి అమ్మకాలను జరుపబోతున్నారు. లీనియా ఎలిగేంట్, బాడీ కిట్ తో పాటు ముందు మరియు వెనుక బంపర్లు యాడ్-ఆన్స్ తో రాబోతుంది.

ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ లో చిన్న డెకాల్స్ తో పొందుపరచబడబోతుంది. ఫేస్లిఫ్టెడ్ లీనియా లా కాకుండా, ఈ వాహనం యొక్క ముందరి బంపర్ అన్ని క్రోం చేరికలతో పాటు గ్రిల్ పై బ్లాక్ చేరికలతో ఈ కొత్త లీనియా ఎలిగేంట్ వేరియంట్ విడుదల కాబోతుంది. ఈ వాహనం ఒక రేర్ స్పాయిలర్ తో పాటు ఫియాట్ సెడాన్ లో ఉన్న అనేక కాస్మటిక్ మార్పులతో క్లీన్ మరియు స్పోర్టి లుక్ తో రాబోతుంది.

పుంటో ఈవో లో ఉన్న బ్లాక్ రూఫ్ మరియు అల్లాయ్స్, ఈ కొత్త లీనియా ఎలిగేంట్ లో పొందుపరచబోతున్నారు. 

అంతర్గత భాగాల విషయానికి వస్తే, అనేక మార్పులతో మరియు ఒక టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ తో రాబోతుంది. యాంత్రికంగా ఎటువంటి మార్పులను చోటు చేసుకోలేదు. ముందున్న అదే ఇంజన్ లతో రాబోతుంది. అవి ఏమిటంటే, 1.3 లీటర్ డీజిల్ ఇంజన్, అత్యధికంగా 4000 rpm వద్ద 91.7 bhp పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా, 2000 rpm వద్ద 209 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. మరోవైపు, 1.4 లీటర్ టి-జెట్ ఇంజన్, 5000 rpm వద్ద 112.4 bhp పవర్ ను విడుదల చేస్తుంది మరియు 2200 rpm వద్ద 207 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ లీనియా ఎలిగేంట్, వచ్చే నెల మొదటిలో భారత షోరూం లలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ లీనియా ఎలిగేంట్ ధర, ఎమోషన్ వేరియంట్ పై రూ. 35,000 నుండి 40,000 ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి.   

ఫియాట్ అబార్త్, 595 వేరియంట్ ను వచ్చే నెల 4,2015 న భారదేశంలో ప్రవేశపెట్టేందుకు సిద్దంగా ఉంది. అంతేకాకుండా, ఇటాలియన్ కారు తయారీదారుడు కూడా దీపావళి 2015 ముందు 135 hp పవర్ విడుదల చేసే మోటార్ తో అవంచురా టి-జెట్ మరియు పుంటో టి-జెట్ అబార్త్ లను విడుదల చేసేందుకు సిద్దం గా ఉంది. ఈ కార్లను ప్రస్తుతం రోడ్లపై పరీక్షలు చేయిస్తున్నారు.

ఈ లీనియా ఎలిగేంట్ యొక్క అమ్మకాలు పెంపొందడానికి చాలా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా, దీని యొక్క అమ్మకాలు నెలకు 150 యూనిట్లకు తక్కువ కాకుండా ఉండేలా కృషి చేస్తున్నారు. ఈ ఫియాట్ లీనియా ఎలిగేంట్ వాహనం, మారుతి సియాజ్, హోండా సిటీ, వోక్స్వ్యాగన్ వెంటో, స్కొడా ర్యాపిడ్ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి వాహనాలకు గట్టి పోటీను ఇవ్వడానికి రాబోతుంది.

ఫియట్ ఇండియా, సి-సెగ్మెంట్ ఎస్యువి కింద ఐకానిక్ జీప్ బ్రాండ్ యొక్క నిర్మాణం మొదలు పెట్టడానికి తన మాతృ సంస్థ అయిన ఫియట్ క్రిస్లర్ ద్వారా $ 280 మిలియన్ పెట్టుబడిని తీసుకుంది. టాటా మోటార్స్ సహ-యాజమాన్యం అయిన రంజాంగాన్ కర్మాగారం లో దీని యొక్క ఉత్పత్తి ని 2017 లో ప్రారంబించేందుకై సన్నాహాలు జరుపుతున్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫియట్ లీనియా

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience