2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడని బ్రాండ్లు
జనవరి 29, 2016 04:24 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ప్రపంచ వ్యాప్తంగా ఆటో ఎక్స్పో వారి ఉత్పత్తులు ప్రదర్శించడానికి ఇది అతిపెద్ద భారతీయ వేదిక. ఈ అవకాశం ఆటోమేకర్స్ కి మాత్రమే కాదు.ఆటోలో ఉన్నతాధికారులకు బ్రాండ్ మరియు దాని ఉత్పత్తులను ఒక అంతర్దృష్టి పొందుటకు కూడా ఉపయోగపడుతుంది. భారత మార్కెట్లో తెలిసిన దాదాపు అన్ని ఆటో బ్రాండ్లు అడుగుపెట్టాయి. కానీ వాటిలో కొన్ని ఈవెంట్ లో పాల్గొనటం లేదు.బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్, హర్లే-డేవిడ్సన్ ద్విచక్రవాహన విభాగంలో ప్రదర్శించటం లేదు. అయితే స్కోడా మరియు వోల్వో వంటి ప్రముఖ వాహనాలు కార్ల సెగ్మెంట్ లో పాల్గొనటం లేదు. భారత్ బెంజ్ , డైమ్లెర్ యొక్క ఉపసంస్థ, వంటి భారీ వాహనాలు కూడా ఈ ప్రదర్శన లో పాల్గోనటంలేదు. ఏ ఏ వాహనాలు ప్రదర్శనకు సిద్ధంగా లేవో ఒక జాబితా ఇవ్వబడింది.
స్కోడా;
2016 స్కోడా సూపర్;
అందరూ అత్యంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన స్కోడా ఎప్పుడూ స్టార్ గా ఉంటుంది. భారతదేశంలో ఆటోఎక్స్పో తన తాజా లగ్జరీ సెడాన్ ని పరిచయం చేయటానికి ఒక మంచి వేదిక. కానీ ఈ వాహనం యొక్క వీరాభిమానులు ఈ కారు కోసం ఇంకా కొంత సమయం వేచి ఉండాల్సిందే.
స్కోడా ఫాబియా R5;
స్కోడా యొక్క ప్రత్యేక ఉత్పత్తి ఫాబియాని 2014 ఎస్సెన్ మోటార్ షోలో మొట్టమొదట ప్రదర్శించారు. ఈ కారు 1.6 లీటర్ టర్బో ఇంజన్ తో వస్తుంది. సీక్వెన్షియల్, ఐదు స్పీడ్ గేర్ బాక్స్ సిస్టమ్తో రాబోతోంది. ప్రత్యేక ర్యాలీ కారు నిశిత పర్యవేక్షణ మరియు అభివృద్ధి కోసం 15 నెలలు పట్టింది. మరియు ఆధునిక భాగాలు సజావుగా మరియు సమర్ధవంతంగా ఉంటాయి.
స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 230;
ఈ కారు 2015 మొదటి వారంలో 85వ అంతర్జాతీయజెనీవా మోటార్ షోలో ప్రదర్శించ బడింది. ఒక 2.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇది 230bhpశక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆక్టావియా 6.7 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలుగుతుంది. దీని అత్యధిక వేగం250kmph.ఈ కారు భారతదేశంలో రోడ్లమీద అడుగు పెట్టడానికి అవకాశంలేదు. అంటే భారతీయులకి ఈ వాహనం చూసే అవకాశం ఇప్పుడు కూడా లేదు.
వోల్వో;
వోల్వో S90;
ఈ భారత ప్రత్యేకమయిన కారు కొంత కాలంగా ఆటో స్పేస్ లో ఉంది. సెడాన్ ఆవిష్కరణ భారతదేశం లో కొంత సమయం తీసుకుంటుంది. బహుశా అక్టోబర్ లో ఉండవచ్చు. కానీ వోల్వో ప్రేమికులు ఎక్స్పో వద్ద ఈ కారు ని దగ్గరగా చూసే అవకాశాన్ని కలిగి ఉండవచ్చు. ప్రారంభించిన తరువాత అది మెర్సిడెస్ E- క్లాస్, ఆడి A6, BMW-5 సిరీస్ మరియు జాగ్వార్ XF వాహనాలతో పోటీ ఇవ్వనుంది.
వోల్వో కాన్సెప్ట్ '26';
ఈ భావన పేటెంట్ విధానాల మరియు స్థానంలో సీటు డిజైన్, ని ప్రదర్శిస్తుంది. ఈ కారు యొక్క నమూనాలు మూడు రీతులలో ఉంటాయి. అవి డ్రైవ్ , క్రియేట్ ,మరియు రిలాక్స్ . "డ్రైవ్" మోడ్ అనగా సాధారణ క్యాబిన్ ని కలిగి ఉంటుంది. క్రియేట్ ,మరియు రిలాక్స్ నమూనాలలో అంతర్గత భాగాలు మరింత సౌకర్యా వంతంగా నిర్మించబడి ఉంటాయి. స్టీరింగ్ కూడా మడతలు కలిగి డాష్ బోర్డ్ మీద ఉంటుంది. మరియు ఒక పెద్ద డిస్ప్లే కూడా ఉంటుంది.
ఇది కూడా చదవండి;ఫోర్డ్ భారతదేశం కోసం మస్టాంగ్ ని నిర్ధారించింది. ఇది రెండవ త్రైమాసికంలో అమ్మకానికి వెళ్తుంది.