ఆర్ ఎస్6 అవాంట్ ను రూ1.35కోట్ల వద్ద ప్రవేశపెట్టిన ఆడి ఇండియా
ఆడి ఆర్ కోసం akshit ద్వారా జూన్ 04, 2015 03:35 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ: ఆడి ఇండియా, ఏస్ క్రికెటర్ బ్రాండ్ అంబాసిడర్ అయిన విరాట్ కోహ్లీ సమక్షంలో "ఆర్ ఎస్6 అవంత్" ను ప్రవేశపెట్టారు. దీనిని ఒక కోటి 35 లక్షల ధర వద్ద ప్రవేశపెట్టారు. ఏ6 యొక్క ఎస్టేట్ వెర్షన్ సిబియు విదానం ద్వారా భారతదేశంలో కి దిగుమతి అయ్యేవి. మరియు ఈ పోర్ట్ఫోలియో లో ఉన్న ఈ ఆర్ ఎస్ కార్ల యొక్క దిగుమతి కూడా ఈ సిబియు విదానం ద్వారానే ప్రవేశపెడుతున్నారు.
ఆర్ ఎస్6 అవంత్ ఫీచర్ల విషయానికి వస్తే, అందంగా చెక్కిన మరియు అంటిపెట్టుకునే విధంగా ఉండే సొగసైన మాట్రిక్స్ హెడ్లైట్లు మరియు డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్. క్యాబిన్ లోపలి బాగం అంతా నలుపు రంగు తో పాటు 3-స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఇల్యుమినేటేడ్ డోర్ సిల్స్ మరియు ఆర్ ఎస్ లోగో ను వీటి భాగాల మద్యలో మరింత అందాన్ని చేకూర్చడానికి అమర్చారు.
ఇటీవల రంగప్రవేశం చేసిన ఆర్ ఎస్7 స్పోర్ట్బాక్ లో ఉన్న అదే 4.0-లీటరు వి8 టిఎఫ్ ఎస్ ఐ ద్వి టర్బో ఇంజన్ ను ఇప్పుడు కొత్త గా ప్రవేశపెట్టిన ఆర్ ర్స్6 వాహనానికి అమర్చారు. ఈ ఇంజెన్ అత్యధికంగా 560bhp పవర్ ను ఉత్పత్తి చేయగా 1750 నుండి 5500rpm వద్ద 700Nm గల అత్యధిక టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజెన్ 8-స్పీడ్ మల్టిట్రోనిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటుంది మరియు క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ తో ప్రవేశపెట్టబడింది. 0 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరడానికి 3.9 సెకన్ల సమయం పదుతుంది. మరోవైపు, ఈ వాహనాలు అత్యధికంగా 305 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలవు. ఈ ఎస్టేట్ వాహనాల ముఖ్య ఉపయోగం ఏమిటంటే, చాలా ఎక్కువ స్పేస్ ను కలిగి ఉంటుంది, అంతేకాకుండా ఈ వాహనాలు ఎక్కువ పవర్ ను మరియు అధిక పనితీరును ఇచ్చే విధంగా ఉంటాయి. భారతదేశంలో ఇది వరకు ఎప్పుడు ఈ ఎస్టేట్ ను చూడలేదు. ఈ విభాగంలో ఆడి ఆర్ ఎస్6, మొట్టమొదటి కారు.