కొత్త టొయోటా వీడియోలో సరికొత్త ఇన్నోవా ప్రదర్శితమయ్యింది
నవంబర్ 18, 2015 10:25 am nabeel ద్వారా ప్రచురించబడింది
- 13 Views
- 6 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఈ సరికొత్త ఇన్నోవాకై అంతటా ఆసక్తి నెలకొంది. రకరకాల వీడియోలలో చిత్రాలను చూపెడుతూ టొయోటా వారు కూడా కస్టమర్లను కనువిందు చేస్తున్నారు. తాజాగా టొయోటా ఇండొనేషియా వారి వీడియోలో 2016 ఇన్నోవా కూడా దర్శనమిచ్చింది. ఇదే మొదటి సారి ఈ కారు నడపబడుతూ కనపడింది.
రాబోయే ఇన్నోవా లో టచ్‌స్క్రీన్ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టం తో మెరుగైన స్క్రీన్ రిజొల్యూషన్, కొత్త స్టీరింగ్ వీల్, కొత్త డ్యాష్‌బోర్డ్, ఆంబియంట్ లైటింగ్, కాప్టెయిన్ సీట్లు, స్మార్ట్ స్టోరేజి ఇంకా కప్ హోల్డర్లు ఉంటాయి. బయట వైపున, కారు కి ముందు వైపు యాంగులర్ గా ఉండి, బలమైన బాడీ లైన్లు డబల్ బ్యారెల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ తో ఎల్ఈడీ డీఆర్ఎల్స్ కి హైలైట్ గా ఉంటాయి. ఒక వెడల్పాటి అడ్డ క్రోము బార్లు గ్రిల్లుపై ఉండి, వీల్ ఆర్చెస్ అందంగా ఉండి, అల్లోయ్ వీల్స్ కూడా ఉంటాయి.
సాంకేతికంగా, ఇప్పుడు ఇందులో మరింత సమర్ధవంతమైన 2.4-లీటర్ టర్బో చార్జడ్ డైరెక్ట్ ఇంజెక్షన్ మిల్లు ఉండి, ఇది 149bhp శక్తి మరియూ 342Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. పైగా, అంతర్జాతీయంగా, ఈ తరువాతి తరం ఇన్నోవా కి 2.0-లీటర్ వీవీటీ-ఐ పెట్రోల్ ఇంజినుతో పాటు డీజిల్ లో కూడా లభ్యం అవుతుంది.