సరికొత్త హోండా బ్రైయో 2017 సంవత్సరంలో విడుదల అవుతుంది
హోండా బ్రియో కోసం nabeel ద్వారా ఆగష్టు 19, 2015 12:04 pm సవరించబడింది
- 12 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హోండా వారు చిన్న కారుల విభాగంలోకి 2011 సంవత్సరంలో బ్రైయో అనే హ్యాచ్ బ్యాక్ తో ప్రవేశించడం జరిగింది. ఇప్పుదు దాని తరువాతి తరాన్ని 2017 లో విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. దీని విడుదల దగ్గర నుండి ఇది మార్కెట్ ని ఆకట్టుకోలేకపోయింది ఎందుకంటే ఇందులోని అంతర్ఘత లక్షణాలు అంతంత మాత్రము మరియూ బూట్ స్థలం తక్కువగా ఉండటం వలన. పైగా బ్రైయో కేవలం 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిను తో రావడం కారణంగా కస్టమర్లు మారుతీ స్విఫ్ట్ మరియూ హ్యుండై గ్రాండ్ ఐ10 వంటి డీజిల్ ప్రత్యామ్నాలకై చూస్తున్నారు.
కొత్త బ్రైయో లో మునుపటి లక్షణాలు ఉంటాయి కాని ధర కాస్త పెంచవచ్చు. వెనుక వైపు ఉన్న పెద్ద విండ్ స్క్రీన్ ఇక ఉండకపోవచ్చు మరియూ మరిన్ని మార్పులను పొందే అవకాశం ఉంది. ఈ కారు అదే వేదిక ఆధారంగా రూపొందించినా కూడా కొన్ని ప్రముఖ మార్పులను పొందే సూచనలు ఉన్నాయి. ట్రాన్స్మిషను విషయానికి వస్తే, ఈ కారు కి మాన్యువల్ తో పాటుగా ఆటోమాటిక్ గేర్ బాక్స్ కూడా అందించే అవకాశం ఉంది. ఈ కొత్త డిజైన్ తో పాటుగా, బ్రైయో అనే ట్యాగ్ ని కూడా తీసివేసీ ఏదైనా కొత్త పేరుతో సరికొత్తగా విడుదల చేయవచ్చు. ఈ కొత్త కారుతో హోండా మార్కెట్ పై ఆధిపత్యం చేసే ప్రయత్నం చేయవచ్చు కాకపోతే వారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఇప్పటికే ఈ విభాగంలో రాణిస్తున్న స్విఫ్ట్ మరియూ గ్రాండ్ ఐ10 వంటి వాటితో పోటీ పడవలసి ఉంటుంది.
0 out of 0 found this helpful