కొత్త ఆడి Q7 యొక్క వివరాలు
ఆడి క్యూ7 2006-2020 కోసం అభిజీత్ ద్వారా ఫిబ్రవరి 15, 2016 12:46 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ ఆడీ పెవీలియన్ ఆటో ఎక్స్పో వద్ద ఒక మంచి స్థానాన్ని పొందగలిగింది అనే అంశం ఆ ఈవెంట్ కి వచ్చిన వారందరికీ తెలిసిన విషయమే. ఈవెంట్ లో A8 ప్రోలోగ్ కాన్సెప్ట్, ఎల్లో R8 వి ప్లస్, TT, ఎరుపు ఎస్3 వంటి కొన్ని కార్లు అందరినీ ఆకర్షించాయి. ఇవి ఆ ప్రాంతంలో 50-70 మీటర్ల దూరం నుండి గమనించగా కనిపించాయి. అలా గమనించగా కనిపించిన ఇంకొక వాహనం తదుపరి తరం A4. కాసేపు ఆగండి, ఇప్పుడు నేను 50-70 మీటర్ల దూరం నుండి చూశాము అని చెప్పా కదా! అవును అండి మరి అక్కడ నాలాంటి వారు చాలా మంది ఉన్నారు కదా, దీని బట్టి ఈవెంట్ లో ఎంతమంది జనం ఉన్నారో మీరు ఊహించగలరు. కానీ నేను అక్కడ ఆడి ని చూశాక కాసేపు అలా ఆశ్చర్యంగా ఉండిపోయాను, తరువాత అది కొత్త Q7 వాహనం అని గ్రహించాను. మొదటిసారి చూసి తప్పు వాహనంగా గుర్తించినందుకు బాదపడ్డాను కానీ అవి తదుపరి తరం ఎస్యువి లో అందించబడ్డ నవీకరణలు అని తెలుసుకున్నాను.
మొదటి చూపులో!
నిజాయితీగా చెప్పాలంటే, కొత్త క్యు7 వాహనం అవుట్గోయింగ్ క్యు7 యొక్క బాసర్ అపీల్ ని తొలగించి ఈ సారి సాధారణంగా తేలికైనదిగా మరియు మునుపటిదానితో పోలిస్తే అద్భుతమైన ఆధునికతను కలిగి ఉంది. ఎందుకో నేను చెప్తాను.
క్యు7 ఇపుడు ఆడి యొక్క తాజా డిజైన్ భాషతో సమలేఖనం చేయబడి మరియు సింగిల్ ఫ్రేం గ్రిల్ లోకి విలక్షణముగా ఉంచబడిన మాట్రిక్స్ LED హెడ్ల్యాంప్స్ తో మరింత పదునుగా కనిపిస్తుంది. అలానే ఈ పదునుదనం "క్వాట్రో" తో ఉన్న షోల్డర్ క్రీజ్ మరియు ఓఆర్విఎం తో ప్రక్క భాగాలకు కూడా పాకింది.
ఈ వాహనంలో డైమండ్ కట్ అలాయ్ వీల్స్ నల్లని స్పోకులను కలిగి ఉన్నాయి. మీరు పైన చిత్రాన్ని గనుక చూసినట్లయితే అవుటర్ రింగ్ తో ఈ నల్లని స్పోక్ లు బయటకి చొచ్చుకొనిపోయే విధంగా ఉన్నాయి. సాధారణంగా వెనుక భాగాలు ఎప్పుడూ ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ వలన ప్రాముఖ్యం పొందుతాయి. ఇప్పుడు ఈ టెయిల్ ల్యాంప్స్ సొగసైన లేవుట్ ని కలిగి ఉంది. అంతేకాక, ప్లాస్టిక్ క్లాడింగ్ అంతటా ఉండడం వలన కొద్దిగా కఠినమైనదిగా కనిపిస్తుంది.
కూర్చుంటే ఏ విధంగా ఉండబోతుంది?
దీని బాహ్య భాగాలు ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మీరు కారుని దగ్గరగా పరిశీలిస్తే గనుక ఈ కారులో అందించబడే అంశాలు గురించి తెలుస్తాయి. దీనిలో అంతర్భాగాల గురించి చెప్పాలంటే, ఎక్కడ నుండి మొదలు పెట్టాలో తెలియడం లేదు. ఎందుకంటే అన్ని అంశాలతో నిండి ఉంది కనుక. దీనిలో డాష్బోర్డ్ ఇన్స్టృమెంటల్ క్లస్టర్ తో మొదలు పెట్టి ప్యాసింజర్ వైపుగా ఉన్న ఏ/సి వెంట్లతో డామినేట్ చేయబడింది. దీనిలో డాష్బోర్డ్ పైన ముడుచుకొనే సమాచార వినోద వ్యవస్థ స్క్రీన్ అందించబడుతుంది. దీనిలో ఇతర ముఖ్యాంశాలు ఆడి యొక్క తాజా వాస్తవిక కాక్పిట్, ఇది చాలా సహజమైనదిగా ఉంది. దీనిలో నావిగేట్ చెయ్యడానికి సహాయపడే హై డెఫినిషన్ గ్రాఫిక్స్ అందించినందుకు తయరీదారునికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.
దీనిలో ఒక ఆధునిక బోస్ మ్యూజిక్ సిస్టమ్ కలిగి ఉంది. MMI నావిగేషన్ తో కలిసి 10 స్పీకర్లు పనిచేస్తాయి మరియు MMI టచ్ మరియు వాయిస్ కమాండ్ మద్దతు అందించడం జరుగుతుంది.
సాధారణంగా వాహనంలో చెప్పుకోవలసిన మరొక విషయం నాణ్యత, కానీ ఈ వాహనం విషయంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, అబ్భుతమైన నాణ్యతను కలిగి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది దాని వర్గంలో అద్భుతమైన నాణ్యతను కలిగి ఉంటుంది. ఈ కారు లోపల శబ్ధం వినిపించకుండా ఉండేందుకు ఆధునిక ధ్వని తగ్గించే పదార్థాలను కలిగి ఉంది.
అంతర్గత వివరాలు:
తదుపరి తరం క్యు7 వాహనం సస్పెన్షన్ పరంగా తక్కువ బరువు మరియు ఏరోడైనమిక్స్ పరంగా అద్భుతంగా ఉంది. ఈ కారు సస్పెన్షన్ పరంగా 100 కిలోలు తక్కువ బరువు ని కలిగి ఉండగా, చివరి తరం క్యు7 తో పోలిస్తే 220 కిలోలు తక్కువ బరువుని కలిగి ఉంటుంది. ఈ కొత్త Q7 వేగవంతంగా వెళ్ళేందుకు ఇది ఒక కారణం.
ఈ వాహనంలో అదే 3.0 V6 టీడీఐ ఉన్నప్పటికీ, శక్తి అద్భుతంగా మరియు ఆశ్చర్యంగా పెరుగుదలను చూసింది. ఈ మోటార్ 183 కిలోవాట్ల శక్తిని అందిస్తుంది మరియు 8-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అందించబడి ఆల్ వీల్ డ్రైవ్ క్వాట్రో ని సాధ్యం చేస్తుంది. ఈ వ్యవస్థ అవసరం మరియు రోడ్డు బట్టి నాలుగు చక్రాలకి శక్తిని వేరియబుల్ గా అందిస్తుంది.
చివరిగా ఈ వాహనం BMWX5 లేదా మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్ ఈ రెండూ కూడా తాజా Q7 తరువాతే వస్తాయి. అయితే, X5 లేదా జిఎల్-క్లాస్ ని గనుక చూసినట్లయితే అవి క్యు7 కంటే మరింత ఎస్యువి లా కనిపిస్తాయి
0 out of 0 found this helpful