అబార్త్ పుంటో ఈవో vs ఫోక్స్వ్యాగన్ పోలో జిటి టి ఎస్ ఐ

ఆగష్టు 06, 2015 04:30 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

జైపూర్:పోలో జిటి టిఎస్ ఐ పనితీరు కోసం చూస్తున్న భారత ఔత్సాహికులకు మాత్రమే అందుబాటులో ఉన్న హాట్ హాచ్ గా పరిగణిస్తారు. దాని అత్యాధునికమైన జర్మన్ సాంకేతిక మరియు నాణ్యత వలన ఇది గుర్తించబడినది. ఇది పనితీరు మరియు సౌకర్యం రెండు సమతుల్య సమ్మేళనంగా ఉందని భావిస్తున్నారు. కానీ ప్రాథమిక అంశమైన బాలెన్సింగ్ విషయానికి వస్తే ఈ హ్యాచ్బ్యాక్స్ సరిగ్గా వాహనాన్ని సమత్ల్య పరచలేదు. కానీ మీకు థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుంది. యాక్సిలేటర్ పెడల్ నొక్కిన ప్రతీసారీ మీకు ఏదో ఆనందాన్ని కలిగిస్తుంది. 

ఇటీవల ఫియాట్ అబార్త్ 595 కాంపిటిజన్ ని ప్రారంభించిన సమయంలో అబార్త్ పుంటో ఈవో ని ప్రదర్శించారు. ఈ ఇటాలియన్ ఉత్పత్తి భారతదేశం యొక్క మాత్రమే హాట్ హాచ్ ఫోక్స్వ్యాగన్ పోలో జిటి టిఎస్ ఐ తో ఏ విధంగా పోటీ పడుతుందో, ఈ హాట్ హచ్ దాని ఆధిపత్యాన్ని ఏ విధంగా కాపాడుకుంటుందో చూద్దాం. 

యుద్ధంలో విజయం సాధించేది ఎవరు?

బాహ్య భాగాలను పరిగణలోనికి తీసుకుంటే, ఏ ఒక్కరూ కూడా సాధారణ పోలో కి జిటి టి ఎస్ ఐ పోలో కి తెడాని గుర్తించలేరు. ఒకవేళ మీరు కారు యొక్క అనుచరుడు లేదా జిటి బాడ్జ్ ని గుర్తించినపుడు మాత్రమే తేడా ని గుర్తించగలరు. మరోవైపు అబార్త్ పుంటో ఈవో బోనెట్ మరియు టెయిల్గేట్ పైన అబార్త్ చిహ్నంతో, స్పోర్టీ లుక్ ఇచ్చే అబార్త్ అనే అక్షరాలతో, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ తో, ఓఆర్విఎం పైన ఎరుపు మరియు ఆరంజ్ రంగు చేరికలు మరియు అనేకమైన అంశాలతో వినియోగదారులను ఆకర్షిస్తుంది. అంతేకాక, దీనిలో ముందర మరియు వెనుక బంపర్స్ కి అదే రంగుతో అలంకరించిన గ్రిల్ ఉంది. ఇది పక్కన పెడితే, ఇంజిన్ శబ్ధం వలన పొందే అనుభూతి ఈ జిటిటీఎస్ ఐ లో లోపించాయి. 

అబార్త్ లోపలి విషయానికి వస్తే, ఫియాట్ లో ఉండే ప్రామాదిక లక్షణాలైనటువంటి అవే సీట్లు మరియు అంతర్గత భాగాలు అందించబడ్డాయి. కానీ, అన్నీ నలుపు రంగులో అందించబడ్డాయి. బేదాల విషయానికి వస్తే, అల్యూమినియం రేసింగ్ పెడల్స్, సీట్ల పై ఎరుపు మరియు పసుపు రంగు తో కూడిన డిజైన్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో పసుపు చేరికలు మరియు మళ్ళీ స్టీరింగ్ వీల్ పై స్కార్పియాన్ వంటి అంశాలను కలిగి ఉంది. ఈ వాహనం, సాదారణ పుంటో నుండి అంతర్గత భాగాలను తీసుకుంది. పోలో తో పోలిస్తే నాణ్యత ఒక సమస్య అని చెప్పవచ్చు.

పోకిరి!

అబార్త్ పుంటో ఈవో లో, 1.4 లీటర్ టి- జెట్ మోటార్ పొందుపరచబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 145 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 200 ఎన్ ఎం కంటే ఎక్కువ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ వాహనం లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ స్విచ్ ను గుర్తించలేనప్పుడు ఈ కారు స్లైడింగ్ నుండి కారును ఆపగలమో లేదో అన్న అనుమానం ఉంటుంది.

మరోవైపు, వోక్స్వాగన్ పోలో జిటి టిఎస్ ఐ వాహనం, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 10 సెకన్ల కన్నా తక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా ఈ ఇంజన్, ఆధునిక 7 స్పీడ్ ఆటోమేటిక్ తో జత చేయబడి ఉంటుంది. మరోవైపు ఈ పోలో జిటి వాహనం, 190 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే పుంటో ఈవో వాహనం విషయానికి వస్తే, 200 కె ఎం పి హెచ్ కు పైగా వేగాన్ని చేరుకోగలుగుతుంది. దాని కంటే ముందు ఈ వాహనం 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 9 సెకన్ల సమయం పడుతుంది.

ధర?

జిటి టి ఎస్ ఐ ఎంత ధర ఉంటుందో మనకి తెలుసు మరియు అబర్త్ పుంటో ఈవో ఒక సరసమైన ఉత్పత్తిగా వస్తున్నదని ఫియాట్ సూచించింది. సరసమైన ఉత్పత్తి అనగా అది 10 లక్షల ధరకంటే తక్కువ ఉండి కూడా మంచి పనితీరును కనబరుస్తుందని అర్థం. ఇది జరిగితే, ఈ కారు భారతదేశం యొక్క మొట్టమొదటి హాట్ హాచ్బాక్ అవుతుంది.

పిఎస్ : చాలా మంది ఈ ఇటాలియన్ ఉత్పత్తి కొరకు చాలా మంది నాతో కలిపి ఎదురు చూస్తున్నరని నమ్ముతున్నాను. కానీ దాని ప్రారంభం కొరకు మనం దీపావళి పండగ వరకు ఎదురు చూడాలి. మీరు సాదరణ కార్లను కొనడం కంటే అబార్త్ కారుని కొనడం ఉత్తమం అనేది నా సలహా. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన అబార్ట్ పుంటో EVO

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience