ఫియాట్ అబార్త్ అవెంచురా ధర స్వల్పంగా పెరిగింది!
అక్టోబర్ 30, 2015 04:59 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఫియాట్ అబార్ పుంటో మరియు అవెంచురా ని ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ లో రూ.9.95 లక్షలు ధర వద్ద ప్రారంభించింది. కానీ ఆశ్చర్యకరంగా, తయారీదారుల యొక్క అధికారిక వెబ్సైట్ లో అవెంచురా యొక్క ధర 10 లక్షలకు పైగా పెరిగినట్టుగా చూపిస్తుంది. అయితే, అది ఒక పెద్ద ధర పెంపు కాదు, కానీ ఇప్పటి వరకు ఫియట్ ఈ పెరుగుదల గురించి ఎటువంటి ప్రకటనలు చేయలేదని తెలుస్తుంది.
అబార్త్ అవెంచురా మరియు పుంటో అక్టోబర్ 19 న ప్రారంభించబడినది మరియు అది ప్రారంభించబడిన 10 రోజుల సమయంలోనే ధర ఊహించని విధంగా పెరిగింది. 10 లక్షలకు పైగా ధర ఉన్న కార్లకు ఈ అధనపు మొత్తం వర్తిస్తుంది. ఇది నగరాలలో ఉన్న వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ధరల పెంపు కూడా అంత ఎక్కువ లేకుండా సుమారు రూ.5500 మాత్రమే ఉంది. అయితే, కమ్యూనికేషన్ లేకపోవడం ఈ వివాదానికి కారణం అయ్యింది.
కార్లు గురించి మాట్లాడితే, అబార్త్ పుంటో ఎరుపు బాహ్య డికేల్స్, రేస్ స్ట్రైప్స్, ముందు మరియు వెనుక ఎరుపు చేరికలు, 16-అంగుళాల స్కార్పియన్ స్ట్రింగ్ వీల్స్ మరియు తక్కువ సస్పెన్షన్ లను కలిగి ఉంది. అయితే, అవెంచురా మాత్రమే సాధారణ చక్రాలు కలిగి మరియు టెయిల్ గేట్ పైన అబార్త్ బ్యాడ్జింగ్ తో అందించబడుతుంది.
రెండు కార్లు అదే 1.4 లీటర్ టి-జెట్ మోటార్ ద్వారా ఆధారితం చేయబడి పుంటోలో 145bhp శక్తిని మరియు అవెంచురా లో 140bhp శక్తిని అందిస్తుంది. ఈ రెండు కూడా నాలుగు చక్రాలు లో డిస్క్ బ్రేకులు కలిగి ఉంటాయి. అలానే సస్పెన్షన్లు బిరుసైన సెట్టింగ్ ని కలిగియుంటుంది మరియు ఈ వాహనం ఒక 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది.