తదుపరి 15 రోజులలో ప్రారంభం కాబోయే కార్లు
మారుతి బాలెనో 2015-2022 కోసం manish ద్వారా అక్టోబర్ 19, 2015 10:48 am ప్రచురించబడింది
- 21 Views
- 2 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
పండుగ సీజిన్ దగ్గర ఉన్న కారణంగా చాలా కార్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. తయారీదారులు భారత మార్కెట్ కొరకు అద్భుతమైన కార్లను అందించబోతున్నారు. వాటిలో ముఖ్యంగా ఎదురు చూస్తున్న మూడు కార్లు మరో 15 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మేము ఈ నెల ఆఖరిలో రాబోయే కార్ల యొక్క జాబితాను మీ ముందు ఉంచాము.
అబార్త్ పుంటో ఈవో - అక్టోబర్ 19
ఫియట్ దాని తదుపరి లైనప్ అబార్త్ పుంటో ఈవో ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ కారు అంతకు ముందు లీనియా సెడాన్ లో చూసిన అదే 1.4 లీటర్ టి-జెట్ మోటార్ తో అమర్చబడి ఉంటుంది. ఇది 145bhp శక్తిని అందిచి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు నాలుగు చక్రాలు లో డిస్క్ బ్రేక్లును కలిగి ఉంటుంది మరియు తేలు ఆకారపు సూక్ష్మ అలాయి వీల్స్ తో అందించబడుతుంది. సౌందర్యపరంగా, కారు అబార్త్ బ్యాడ్జింగ్, విభిన్న రంగు పధకాలు, రేసింగ్ చారలు మరియు స్పోర్టి అబార్త్ లోగో తో అందించబడుతుంది. హ్యాండ్లింగ్ సామర్ధ్యం మెరుగుపరిచేందుకు ఈ కారు కొత్త సస్పెన్షన్ ని కలిగి ఉంటుంది మరియు 20mm రైడ్ ఎత్తు ని తక్కువగా కలిగి ఉంటుంది.
చేవ్రొలెట్ ట్రయల్బ్లేజర్ - అక్టోబర్ 21
తదుపరి చెవీ, దాని ప్రీమియం ఎస్యూవీ షెవ్రొలె ట్రయల్బ్లేజర్ ని టయోటా ఫార్చ్యూనర్ కి పోటీ దారిగా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ కారు ఫార్చ్యూనర్ కంటే పెద్దది మరియు ఎత్తు లో కొంచెం చిన్నది. ఈ ఎస్యువి సిబియు మార్గం ద్వారా రానున్నది మరియు 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ తో విభాగంలో అత్యధికంగా 197bhp శక్తిని అందించబోతున్నది. ఇది అటోమెటిక్ గేర్ బాక్స్ తో జత చేయబడుతుంది. ఈ పవర్ప్లాంట్ 2.5-లీటర్ ఇంజన్ 161bhp
శక్తిని అందించే ఇంజిన్ ని అనుసరిసరిస్తుంది. ఈ కారు 4X2 లేదా 2 వీల్ డ్రైవ్ ఆకృతీకరణపై ఆధారపడి ఉంటుంది.
మారుతి సుజుకి బాలెనో (అక్టోబర్ 26)
భారతదేశపు వాహన తయారీసంస్థ మారుతి సుజికి హోండా జాజ్ మరియు హ్యుందాయి ఎలైట్ ఐ20 కి పోటీదారిగా బాలెనో ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. దీనిలో ఇంజిన్ విషయానికి వస్తే, మారుతి 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ డిడిఐఎస్ డీజిల్ ఇంజన్ తో అందించబడుతుంది మరియు సంస్థ ఎస్ హెచ్విఎస్ హైబ్రిడ్ టెక్నాలజీ తో జతచేయబడుతుంది. 1.0 లీటర్ బూస్టర్ జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 110bhp శక్తిని అందించవచ్చని అంచనా. దీని అగ్ర శ్రేణి మోడల్ 7.0-అంగుళాల టచ్స్క్రీన్ స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థ, ఆపిల్ కార్ ప్లే, ఎల్ఇడి డే టైం రన్నింగ్ ల్యాంప్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, వాతావరణ నియంత్రణ వంటి సౌకర్య లక్షణాలతో అందించబడుతుంది. బాలెనో మారుతి ప్రీమియం డీలర్షిప్ నెక్సా ద్వారా ఎస్-క్రాస్ మరియు సియాజ్ లతో పాటూ అమ్మకాలకు వెళుతుంది.