• English
  • Login / Register

75 శాతం మంది సన్‌రూఫ్ వేరియంట్‌లను ఎంచుకున్న హ్యుందాయ్ ఎక్స్టర్ కొనుగోలుదారులు

హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం tarun ద్వారా ఆగష్టు 10, 2023 07:12 pm ప్రచురించబడింది

  • 59 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఎక్స్టర్ యొక్క మిడ్-స్పెక్ SX వేరియంట్ ఇప్పుడు సన్‌రూఫ్‌ను అందిస్తుంది. ఇది ఇప్పుడు అత్యంత సరసమైన కార్లలో ఒకటి.

Hyundai Exter

  • మే మొదటి వారంలో బుకింగ్‌లు ప్రారంభమైన తర్వాత ఎక్స్టర్ 50,000 బుకింగ్‌లు పొందింది.

  • 75 శాతం బుకింగ్‌లు సన్‌రూఫ్ వేరియంట్‌లకు లభించింది, ఇది మొదటి మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి, దీని ధర రూ. 8 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

  • కొనుగోలుదారులలో 1/3 శాతం మంది AMT వేరియంట్‌లను ఎంచుకున్నారు. దీని ధర రూ.7.97 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

  • ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు డ్యూయల్ డాష్ క్యామ్‌లు ఉన్నాయి.

  • ధరలు రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉన్నాయి.

హ్యుందాయ్ ఎక్స్టర్ సరికొత్త మైక్రో SUV. ఇది మే మొదటి వారంలో ప్రారంభమై 50,000 బుకింగ్‌లను పొందింది. జూలై 10న దీని అమ్మకాలు ప్రారంభమయ్యాయి. హ్యుందాయ్ SUV ధరలు రూ. 6 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

డిమాండ్‌లో సన్‌రూఫ్ వేరియంట్లు

కొనుగోలుదారులలో 75 శాతం మంది హ్యుందాయ్ సన్‌రూఫ్‌ను ఎంచుకున్నారు. ఇది ఈ కొత్త ఫీచర్ వాహనం యొక్క ప్రజాదరణను చూపుతుంది. సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ధర రూ.8 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. సన్‌రూఫ్‌తో సరసమైన ధరలో ఉన్న కార్లలో ఇది ఒకటి.  ఎక్స్టర్ ఇప్పుడు EX, S, SX, SX (O) మరియు SX (O) కనెక్ట్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 

ఈ ఫీచర్ ఎక్స్టర్ యొక్క CNG వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ధర రూ.8.97 లక్షలు. ఇది CNG కొనుగోలుదారులకు  ఫీచర్-రిచ్ అనుభవాన్ని ఇస్తుంది.

ఇది కూడా చదవండి: టాటా పంచ్ CNG Vs హ్యుందాయ్ ఎక్స్టర్ CNG - స్పెసిఫికేషన్ మరియు ధర పోలిక

కొనుగోలుదారులు AMT వైపు కూడా దూసుకుపోతున్నారు

Hyundai Exter AMT

1/3 కంటే ఎక్కువ బుకింగ్‌లు AMT వేరియంట్‌ల కోసం జరిగాయి. హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క S వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తుంది. రూ. 7.97 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర. మీరు వాస్తవానికి దాదాపు రూ. 10 లక్షలకు (ఆన్-రోడ్) AMT-అనుకూలమైన వేరియంట్‌ను పొందవచ్చు.

ఎక్స్టర్లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 83PS , 114Nm శక్తిని ఇస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT యూనిట్లతో జత చేయబడింది. పాడిల్ షిఫ్టర్‌లు ఉండడంతో షిఫ్టింగ్ సులభంగా ఉంటుంది. మాన్యువల్ వేరియంట్‌లు 19.2kmpl ఇంధన సామర్థ్య సూచికను క్లెయిమ్ చేస్తుంది, అయితే AMT 19.4kmplని అందిస్తుంది.

దీని CNG కౌంటర్ 69PS మరియు 95.2Nm ని ఇస్తుంది, దీని మైలేజ్ 27.1km/kg.

మరిన్ని ఫీచర్లు

Hyundai Exter Infotainment System

హ్యుందాయ్ ఎక్స్టర్లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, డిజిటలైజ్డ్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్ మరియు క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, హిల్ హోల్డ్ అసిస్ట్, డ్యూయల్ కెమెరా డాష్ క్యామ్ మరియు రేర్ పార్కింగ్ కెమెరాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్, టాటా పంచ్‌ కంటే పైగా ఈ 7 ఫీచర్లను పొందుతుంది

ఎక్స్టర్ టాటా పంచ్, మారుతి ఇగ్నిస్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్, సిట్రోయెన్ C3 మరియు మారుతి ఫ్రాంక్స్ కు ప్రత్యర్థి.

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

మరింత చదవండి: ఎక్స్టర్ AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai ఎక్స్టర్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience