Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

కొనసాగుతున్న టెస్టింగ్, కొత్త ఎలక్ట్రానిక్ 4WD షిఫ్టర్ؚతో రానున్న 5-డోర్‌ల ఫోర్స్ గూర్ఖా

ఫోర్స్ గూర్ఖా 5 తలుపు కోసం rohit ద్వారా జూన్ 13, 2023 07:15 pm ప్రచురించబడింది

ఫోర్స్ తన SUVని రూ.16 లక్షల (ఎక్స్-షోరూమ్) అంచనా ధరతో పండుగ సీజన్‌లో విడుదల చేస్తుందని అంచనా

  • పొడవైన వీల్ؚబేస్ కలిగిన గూర్ఖాని ఫోర్స్ 2022 ప్రారంభం నుండి పరీక్షిస్తుంది.

  • సరికొత్త టెస్ట్ మోడల్ పూర్తిగా కప్పబడి కనిపించింది.

  • 4-వీల్ డ్రైవ్ ట్రెయిన్ కోసం షిఫ్ట్-ఆన్-ఫ్లై కంట్రోలర్ మరియు చివరి వరుసలో క్యాప్టెన్ సీట్‌లతో వస్తుంది.

  • 7-అంగుళాల టచ్ؚస్క్రీన్, బహుళ వెంట్ؚలతో మాన్యువల్ AC మరియు పవర్ విండోలు వంటి ఫీచర్‌లను ఇందులో ఆశించవచ్చు.

  • 3-డోర్‌ల మోడల్ؚ ఉన్నట్లుగానే 2.6-లీటర్ డీజిల్ ఇంజన్ؚను కలిగి ఉంటుంది.

2022 ప్రారంభం నుండి అనేక సార్లు 5-డోర్‌ల ఫోర్స్ గూర్ఖా టెస్ట్ మోడల్ కనిపించింది. ప్రస్తుతం, ఈ ఆఫ్-రోడర్ రహస్య చిత్రాల, మరి కొన్ని వివరాలను వెల్లడిస్తూ ఆన్ؚలైన్ؚలో కనిపించాయి.

ఏం కనిపించాయి?

5-డోర్‌ల గూర్ఖా ఇప్పటికే డీలర్ షిప్‌ల వద్దకు చేరుకున్నప్పటికీ, పూర్తిగా కప్పిన మోడల్ ఇటీవల రోడ్లపై కనిపించడాన్ని బట్టి, ఫోర్స్ ఇంకా దాన్ని పరీక్షిస్తున్నట్లే కనిపిస్తుంది. ఇంతకు ముందు కనిపించిన టెస్ట్ మోడల్‌లలో ఉన్నట్లుగానే అవే స్నార్కెల్ మరియు భారీ 5-స్పోక్ 18-అంగుళాల అలాయ్ వీల్స్ ఇందులో కూడా కనిపించాయి. 5-డోర్‌ల గూర్ఖా తాత్కాలిక ఫోర్స్ సిటిలైన్ హెడ్ؚలైట్‌లను కలిగి ఉంది, ప్రొడక్షన్-స్పెక్ మోడల్ LED DRLలు ఉన్న గుండ్రని ప్రొజెక్టర్ హెడ్ؚలైట్ క్లస్టర్‌లతో వస్తుంది. డిజైన్ ఎలిమెంట్‌లలో చెప్పుకోదగిన విషయం, 3-డోర్‌ల గూర్ఖాలో ఉన్న విధంగానే వెనుక వైపు టెయిల్ؚగేట్‌కు అమర్చిన స్పేర్ వీల్‌ను కలిగి ఉంది.

కొత్త రహస్య చిత్రాలలో గమనించదగిన ఆసక్తికరమైన విషయం, 4-వీల్ డ్రైవ్ؚట్రెయిన్ (4WD) కోసం పునర్నిర్మించిన కంట్రోలర్. 4WD కోసం మాన్యువల్ లివర్ కలిగిన 3-డోర్‌ల గూర్ఖాలో ఉన్నట్లుగా కాకుండా పొడవైన వీల్ؚబేస్ కలిగిన ఈ SUV వర్షన్ؚలో 4WD సిస్టమ్ؚను ఆపరేట్ చేయడానికి సెంటర్ కన్సోల్ వద్ద ఎలక్ట్రానిక్ షిఫ్ట్-ఆన్-ఫ్లై రొటేటర్ ఉంది.

సంబంధించినది: అనేక మోడల్‌లతో గూర్ఖా లైన్అప్ؚను విస్తరించనున్న ఫోర్స్ గూర్ఖా

క్యాబిన్ మరియు ఎక్విప్మెంట్

మునుపటి రహస్య చిత్రాలలో చూసినట్లు, 5-డోర్‌ల గూర్ఖా ముదురు గ్రే రంగు క్యాబిన్ థీమ్ؚను కలిగి ఉంటుంది. 5-డోర్‌ల గూర్ఖా 3-వరుసల ఆఫరింగ్‌గా కూడా వస్తుంది, ఇందులో రెండు మరియు వరుసలలో బెంచ్ మరియు కెప్టెన్ సీట్‌లు వరుసగా ఉంటాయి.

ఎక్విప్మెంట్ విషయానికి వస్తే, 5-డోర్‌ల గూర్ఖాలో 7-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, ముందు మరియు వెనుక (రెండవ వరుస) పవర్ విండోలు, బహుళ వెంట్ؚలతో మాన్యువల్ ACని ఫోర్స్ అందించవచ్చు. దీని భద్రత నెట్ؚలో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ؚలు, రివర్సింగ్ కెమెరా మరియు రేర్ పార్కింగ్ సెన్సర్‌లు ఉంటాయని అంచనా.

బోనెట్ؚలో డీజిల్ పవర్

3-డోర్‌ల మోడల్ؚలో ఉన్నట్లుగానే 5-డోర్‌ల గూర్ఖా 2.6-లీటర్ డీజిల్ ఇంజన్ؚతో (90PS/250Nm) అందించవచ్చు, బహుశా మరింత మెరుగైన ఇంజన్‌ను కూడా అందించవచ్చు. 5-స్పీడ్‌ల మాన్యువల్ గేర్‌బాక్స్, 4-వీల్ డ్రైవ్ؚట్రెయిన్ కూడా ఉంటుందని అంచనా.

ఇది కూడా చూడండి: టెస్టింగ్‌ను వేగవంతం చేసిన ఫోర్స్ గూర్ఖా, త్వరలోనే విడుదల కావచ్చు

విడుదల మరియు ధర అంచనా

5-డోర్‌ల గూర్ఖా విక్రయాలు ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో రూ.16 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మొదలవుతాయని అంచనా. దీని ప్రత్యక్ష పోటీదారు 5-డోర్‌ల మహీంద్రా థార్. ఇది ఇటీవల విడుదలైన మారుతి జిమ్నీకి మరింత ప్రీమియం ఎంపికగా నిలుస్తుంది.

చిత్రం మూలం

ఇక్కడ మరింత చదవండి: గూర్ఖా డీజిల్

Share via

Write your Comment on Force గూర్ఖా 5 తలుపు

M
makbul ahmed azad
Feb 8, 2024, 9:53:47 PM

Launch Karo bhai sirf date pe date

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.2.84 - 3.12 సి ఆర్*
కొత్త వేరియంట్
ఫేస్లిఫ్ట్
Rs.1.03 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.11.11 - 20.50 లక్షలు*
కొత్త వేరియంట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర