ఈ నవంబర్ؚలో విడుదల కానున్న 5 కార్‌ల వివరాలు
టాటా పంచ్ EV కోసం ansh ద్వారా అక్టోబర్ 31, 2023 03:10 pm ప్రచురించబడింది
- 266 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ జాబితాలో కొత్తగా పరిచయం చేస్తున్న టాటా పంచ్ EV, మెర్సిడెస్-AMG C43 వంటి పర్ఫార్మెన్స్ మోడల్‌లు ఉన్నాయి
2023 సంవత్సరంలో భారతదేశంలో, ఫేస్ؚలిఫ్ట్ؚలతో సహా భారీ సంఖ్యలో కొత్త కార్‌లు విడుదలయ్యాయి. సంవత్సరం చివరి నెలలలో, కొత్త కార్‌ల విడుదల కొంత నెమ్మదించింది అయితే, స్థానికంగా మరియు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొత్త మోడల్‌ల ఆవిష్కరణలు ఆశించవచ్చు. ఈ నవంబర్ؚలో విడుదలయ్యే లేదా ఆవిష్కరించబడే 5 కార్‌ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
మెర్సిడెస్-బెంజ్ GLE ఫేస్ؚలిఫ్ట్
ఫేస్ؚలిఫ్ట్ మెర్సిడెస్-బెంజ్ GLE ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయబడింది, దీన్ని నవంబర్ 2న భారతదేశంలో పరిచయం చేయనున్నారు. నవీకరించిన ఈ SUV తేలికపాటి మార్పులను, ఫీచర్ అప్ؚగ్రేడ్‌లను మరియు స్వచ్చమైన పవర్ؚట్రెయిన్ ఎంపికలను పొందుతుంది. ఇండియా-స్పెక్ మోడల్ 3-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికతో వచ్చే అవకాశం ఉంది, అంతేకాకుండా పెట్రోల్ ఎంపికను కూడా పరిచయం చేయవచ్చు. దీని ధర రూ. 93 లక్షల నుండి ఉండవచ్చు (ఎక్స్-షోరూమ్).
ఇది కూడా చదవండి: BMW i7 M70 xడ్రైవ్ Vs పర్ఫార్మెన్స్ EV సెడాన్ పోటీదారులు: స్పెసిఫికేషన్‌ల పోలిక
మెర్సిడెస్-AMG C43
నవీకరించిన GLEతో పాటు, మెర్సిడెస్ సరికొత్త C43 AMGని కూడా విడుదల చేస్తుంది. ఈ స్పోర్టీ పర్ఫార్మెన్స్ సెడాన్ 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది, ఇది మునుపటి జనరేషన్ 3-లీటర్ ఆరు-సిలిండర్‌ల యూనిట్ కంటే మరింత శక్తివంతమైనది. మెర్సిడెస్ C43 AMG ధర రూ.1 కోటి కంటే కొంత తక్కువగా ఉండవచ్చని అంచనా (ఎక్స్-షోరూమ్).
టాటా పంచ్ EV
గత కొన్ని నెలలో టాటా, నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్, హ్యారియర్ ఫేస్ؚలిఫ్ట్ మరియు సఫారీ ఫేస్ؚలిఫ్ట్ؚలతో అనేక పెట్రోల్/డీజిల్ కార్‌లను అలాగే EVలను కూడా విడుదల చేసింది. దీని సరికొత్త ఆవిష్కరణ టాటా పంచ్ EV మరియు ఈ చిన్న EV అనేక సార్లు టెస్ట్ చేస్తుండగా కనిపించింది, ఇది కొత్త టాటా నెక్సాన్ EV ఫీచర్‌లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, పంచ్ EV 500km కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటుందని టాటా తెలియజేసింది. పంచ్ ఎలక్ట్రిక్ వర్షన్ ప్రారంభ ధర రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా.
కొత్త –జెన్ రెనాల్ట్ డస్టర్
మూడవ-జెన్ డస్టర్ؚను నవంబర్ 29 తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడానికి రెనాల్ట్ సిద్ధంగా ఉంది. కొత్త డస్టర్‌ను మొదట పోర్చుగల్ؚలో డేసియా (రెనాల్ట్ బడ్జెట్ ఆధారిత బ్రాండ్) ద్వారా ఆవిష్కరించనున్నారు మరియు ఈ మోడల్ కొత్త డిజైన్‌తో వస్తుంది. నవీకరించిన SUV బహుళ పెట్రోల్ పవర్ؚట్రెయిన్ ఎంపికలతో వస్తుంది మరియు ఇది 2025 నాటికి భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. కొత్త డస్టర్ ధర రూ.10 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా.
ఇది కూడా చూడండి: 5-డోర్‌ల మహీంద్రా థార్ వరుస రహస్య చిత్రాలు, ముసుగులో మళ్ళీ కనిపించిన రేర్ ప్రొఫైల్
నాలుగవ-జెన్ స్కోడా సూపర్బ్
కొంతకాలంగా స్కోడా సూపర్బ్ భారతీయ మార్కెట్‌లో అందుబాటులో లేదు, ఇప్పటివరకు దీన్ని తిరిగి ప్రవేశపెట్టలేదు. ఇటీవల, ఈ కారు తయారీదారు 2024 సూపర్బ్ ఎక్స్‌టీరియర్ డిజైన్ స్కెచ్‌లను వెల్లడించింది, ఈ మోడల్ నవంబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనున్నారు. ఇది స్కోడా కొత్త ఆధునిక దృఢమైన డిజైన్‌ను కలిగి ఉంది అలాగే పెట్రోల్, డీజిల్ మరియు హైబ్రిడ్ ఇంజన్ ఎంపికలను పొందుతుంది. దీన్ని ఈ సంవత్సరం విడుదల చేయడం లేదు, వచ్చే సంవత్సరం విడుదల అవుతుందని అంచనా. ఇండియా-స్పెక్ స్కోడా సూపర్బ్ ధర రూ. 40 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.
ఈ నవంబర్ 2023లో ఆవిష్కరించనున్న కార్‌ల వివరాలు, మీరు దేని కోసం వేచి చూస్తున్నారు? క్రింద కామెంట్‌లలో మాకు తెలియజేయండి.
0 out of 0 found this helpful