Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి ఇన్విక్టో మరియు టయోటా ఇన్నోవా హైక్రాస్ మధ్య ఐదు కీలకమైన భేదాలు

మారుతి ఇన్విక్టో కోసం ansh ద్వారా జూలై 07, 2023 12:51 pm ప్రచురించబడింది

ఈ MVPలు మొదట్లో ఒకేలాగా అనిపించినా వాటి యొక్క రూపకల్పన, ఇంజన్, లక్షణాలు మరియు మిగితా అంశాల్లో నిర్దిష్టమైన తేడాలు కలిగి ఉన్నాయి.

భారతీయ కారు తయారీదారు తమ సరికొత్త ఫ్లాగ్షిప్ మోడల్ కారు మారుతి ఇన్విక్టోను ఎట్టకేలకు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా, ఈ ప్రీమియం MVP జపనీస్ కారు తయారీదారుచే రూపకల్పన చేయబడి అత్యంత ప్రాచుర్యం పొందిన టయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క రీబాడ్జ్ వెర్షన్ అని చెప్పవచ్చు. చాలా అంశాలలో ఈ రెండు కార్లు ఒకేలా ఉన్నప్పటికీ, ఇవి కొనుగోలుదారులకు తమవైన విలువలను తమ తమ రీతుల్లో అందిస్తున్నాయి.

స్టైలింగ్

దూరం నుంచి ఈ రెండు కార్లు ఒకేలా అనిపించినా సరిగ్గా గమనిస్తే వీటి మధ్య ఉన్న భేదాలను సులువుగా గుర్తించవచ్చు. ముందు భాగంలో ఇన్విక్టోకు ఒక భిన్నమైన గ్రిల్ అమర్చబడింది. ఈ ఫీచర్ గ్రాండ్ విటారా నుండి స్వీకరించినట్టు అర్థమవుతుంది. అలాగే ఇన్విక్టో పూర్తిగా భిన్నంగా అమర్చబడిన క్రోమ్ ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది. ప్రొఫైల్ పరంగా హై క్రాస్ యొక్క టాప్ వేరియంట్లలో లభ్యమైన 18 ఇంచుల అల్లాయ్ వీల్స్కు బదులుగా ఇన్విక్టోకు కేవలం పదిహేడు ఇంచుల అల్లాయ్ వీల్స్ మాత్రమే అమర్చటం జరిగింది. కాగా ఈ అల్లాయ్స్ డిజైన్ పరంగా కూడా భిన్నంగా ఉంటాయి. ఇక ఇన్విక్టోకి వెనుక భాగంలో ప్రత్యేకంగా నెక్సాకు మాత్రమే కలిగిన ట్రై ఎలిమెంట్ LED టైల్ లాంప్స్స్ ను, అలాగే 'హైబ్రిడ్' బాడ్జ్ ను అమర్చారు.

ఈ రెండు కార్ల లోపలి క్యాబిన్లు కూడా ఒక్క రంగు విషయంలో తప్ప చాలావరకు ఒకేలాగా ఉంటాయి. హైక్రాస్ చెస్ట్నట్ బ్రౌన్ మరియు నలుపు కలగలిపిన క్యాబిన్ రంగును కలిగి ఉంటుంది. అలాగే, డాష్బోర్డ్, సెంటర్ కన్సోల్ మరియు డోర్ల పై సిల్వర్ ఎలిమెంట్స్ను గమనించవచ్చు. కాగా ఇన్విక్టోలో వెండికి బదులు కాపర్ ఎలిమెంట్స్ తో కూడిన నలుపు రంగు క్యాబిన్ దర్శనమిస్తుంది.

లక్షణాలు

హైక్రాస్ లోని ఫీచర్లకు మించి ఇన్విక్టోలో ఎలాంటి అదనపు ఫీచర్లు కనపడకపోగా ఇన్విక్టొలో కొన్ని ప్రీమియం ఫీచర్లు లోపించి ఉంటాయి. హైక్రాస్ లో అమర్చిన తొమ్మిది స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్కు బదులుగా మారుతి MVPలో ఆరు స్పీకర్ల సౌండ్ సిస్టమ్ ఉంటుంది. పైగా ఇందులో హై క్రాస్లో లభ్యమైనట్లు అధిక సౌకర్యవతమైన పవర్డ్ ఒట్టోమన్ సీట్లు ఉండవు.

ఇది కూడా చదవండి: ప్రారంభానికి ముందే మారుతి ఇన్విక్టోను బుక్ చేసుకున్న ఆరువేల మంది.

అయితే, ఇన్విక్టోలో లోపించిన అతి ముఖ్యమైన అంశం అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS). ఇది లేనందున ఇన్విక్టోలో లేన్ కీప్, డిపార్చర్ అసిస్ట్ (నిష్క్రమణ సహాయం), అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ (అనుకూల క్రూజ్ నియంత్రణ) మరియు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ (ఆటో అత్యవసర బ్రేకింగ్) లాంటి అతి ముఖ్యమైన భద్రతా ఫీచర్లు ఉండవు.

ఇంజిన్

ఇక ఈ MPVలకు శక్తిని సమకూర్చే పరికరాల మాటకు వస్తే, రెండిటి మధ్యలో సారూప్యతలు మరియు తేడాలు ఉన్నాయి. రెండిటికీ eCVT గేర్ బాక్స్ తో అనుసంధానించబడిన 2 లీటర్ బలమైన హైబ్రిడ్ ఇంధన పవర్ట్రైన్ (186PS and 206Nm) ఉన్నా, ఇన్విక్టో మాత్రం ఇన్నోవా హైక్రాస్ లో సాధారణంగా కనిపించే రెండు లీటర్ల పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉండదు. ఇందువల్ల, దాని టయోటా ప్రతిరూపానికంటే మారుతి MPV అధిక ప్రారంభ ధర కలిగి ఉంటుంది.

వారంటీ మరియు సేవలు

టయోటా, ఇన్నోవా హైక్రాస్ తో కలిపి, మూడేళ్ల స్టాండర్డ్ వారంటీ లేదా ఒక లక్ష కిలోమీటర్లను అందిస్తోంది. అదనంగా ఈ వారంటీని ఐదేళ్లకు కానీ 2.2 లక్షల కిలమీటర్లకు కానీ పొడిగించుకోవచ్చు. సాధారణంగా మారుతి అందించే స్టాండర్డ్ వారంటీ కవరేజ్ తో పోల్చి చూస్తే, ఇన్విక్టోకి రెండేళ్ల లేదా 40,000 కిలోమీటర్ల ప్యాకేజీ, ఐదేళ్లకు లేదా ఒక లక్ష కిలోమీటర్లకు పొడిగించుకునే వెసులుబాటును కలిపించే అవకాశం ఉంది. రెండు బ్రాండ్లలోనూ హైబ్రిడ్ పవర్ట్రైన్ యొక్క బ్యాటరీకి మాత్రం ఎనిమిది యేళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల కవరేజ్ ఒకే విధంగా లభిస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ జూలై నెలలో ఇన్నోవా క్రిస్టా కంటే రెండింతలు ఎక్కువగా పెరగనున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ వెయిటింగ్ పీరియడ్.

అయితే, దేశంలో సుమారు నాలుగు వేల సర్వీస్ స్టేషన్లు కలిగిన మారుతి వినియోగదారులకు సేవలు అందించడంలో ముందంజలో ఉంది. మరోవైపు టయోటాకు జూన్ 2023 నాటికి కేవలం 587 టచ్ పాయింట్స్ మాత్రమే ఉండటం గమనార్హం. దీనివల్ల చిన్న చిన్న పట్టణాల్లో మరియు నగరాల్లో ఉండేవాళ్ళు సర్వీస్ సునాయాసంగా దొరికే కారుని కొనటానికే మొగ్గు చూపుతారు కాబట్టి ఈ అంశంలో మారుతికి ప్రాధాన్యత లభిస్తుంది.

ధర

టయోటా ఇన్నోవా హైక్రాస్

మారుతి ఇన్విక్టో

18.82 లక్షల నుండి 30.26 లక్షలు.

24.79 లక్షల నుండి 28.42 లక్షలు

*అన్ని ధరలు ఎక్స్ షోరూం ఢిల్లీ నుండి

సాధారణంగా లభించే పెట్రోల్ పవర్ట్రైన్ లేనందువల్ల మారుతి ఇన్విక్టో యొక్క ప్రారంభ ధర మరింత ఎక్కువగా ఉండగా, దీని బలమైన హైబ్రిడ్ వేరియంట్లు సంబంధిత హైక్రాస్ వేరియంట్ల కంటే సరసమైన ధరల్లో లభిస్తాయి. ఇందువల్ల అదే పవర్ట్రైన్ తో ఇది మరింత సులభతరంగా మారుతుంది. అయితే మీరు సరియైన ఎంపిక చేసుకుంటున్నారో లేదో తెలుసుకోవటానికి ఇక్కడ మరిన్ని ఫీచర్ల తేడాలను పరిగణించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: మారుతి ఇన్విక్టో Vs టయోటా ఇన్నోవా వర్సెస్ కియా క్యారెన్స్: ధరల అంచనా

ఇన్విక్టోను ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పుడు రెండు బలమైన-హైబ్రిడ్ ప్రీమియం MPVలలో నుండి ఒకటి ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారులకు కలిగింది. ఈ రెండిట్లో మీరు దేన్ని ఎంపిక చేసుకుంటారు మరియు ఎందుకు అనే విషయాన్ని కింద కామెంట్ల రూపంలో మాకు తెలపండి.

ఇక్కడ మరింత చదవండి: ఇన్విక్టో ఆటోమేటిక్

a
ద్వారా ప్రచురించబడినది

ansh

  • 376 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మారుతి ఇన్విక్టో

R
rajesh kumar pal
Jul 8, 2023, 12:53:31 PM

Toyota Innova Hycrose

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.10.44 - 13.73 లక్షలు*
Rs.10.52 - 19.67 లక్షలు*
Rs.2 - 2.50 సి ఆర్*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర