• English
  • Login / Register

విడుదలకు ముందే 6,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను అందుకున్న మారుతి ఇన్విక్టో

మారుతి ఇన్విక్టో కోసం rohit ద్వారా జూలై 06, 2023 11:56 am ప్రచురించబడింది

  • 119 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మారుతి ఇన్విక్టో నిజానికి టయోటా ఇన్నోవా హైక్రాస్ అని చెప్పవచ్చు, లుక్ పరంగా మార్పులతో మరియు ఫీచర్‌ల పరంగా తేడాలతో దీన్ని అందిస్తున్నారు

Maruti Invicto

  • మారుతి నెక్సా లైన్అప్ؚలో ఇన్విక్టో ఎనిమిదవ మోడల్; ఇది MPV శ్రేణిలో XL6కు ఎగువ స్థానంలో నిలుస్తుంది.

  • మారుతి తన కొత్త ప్రీమియం MPVని రెండు వేరియెంట్‌లలో అందిస్తోంది: జెటా+ మరియు ఆల్ఫా+. 

  • 7-మరియు 8-సీటర్ లేఅవుట్ؚలు రెండిటిలో అందిస్తున్నారు, మొదటి దానిలో మధ్య వరుసలో కెప్టెన్ సీట్‌లు ఉన్నాయి.

  • 10-అంగుళాల టచ్ؚస్క్రీన్, పవర్డ్ టెయిల్ؚగేట్ మరియు పనోరమిక్ సన్ؚరూఫ్ؚతో వస్తుంది.

  • టయోటా MPVలోని కెప్టెన్ సీట్‌ల ఒట్టోమ్యాన్ ఫంక్షనాలిటీ మరియు ADASలు ఇందులో లేవు.

  • ఇన్నోవా హైక్రాస్ؚలో ఉన్న 2-లీటర్ బలమైన-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ؚను ఇది కొనసాగిస్తుంది. 

  • ధర రూ.24.79 లక్షల నుండి రూ.28.42 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంటుంది.

మారుతి నెక్సా లైన్అప్ؚలో ఎనిమిదవ వాహనంగా మారుతి ఇన్విక్టో చేరింది. ఇన్విక్టో నిజానికి కొన్ని డిజైన్ మరియు ఫీచర్‌ల జాబితాలో మార్పులతో వస్తున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ అని చెప్పవచ్చు. విడుదల సమయంలో, ఈ కారు తయారీదారు తన కొత్త ఫ్లాగ్ؚషిప్ మోడల్ ధరను ప్రకటించే నాటికి 6,200 ప్రీ-లాంచ్ ఆర్డర్‌లను అందుకుంది అని వెల్లడించారు.

మారుతి కొత్త ప్రీమియం MPV అందిస్తున్న ముఖ్యమైన వివరాలను చూద్దాం:

వేరియెంట్ؚలు మరియు సీటింగ్ కాన్ఫిగరేషన్

Maruti Invicto captain seats
Maruti Invicto 7-seater variant

మారుతి ఇన్విక్టోని రెండు వేరియెంట్‌లలో అందిస్తుంది: జెటా+ మరియు ఆల్ఫా+, మొదటిది 7- మరియు 8-సీటర్ లేఅవుట్ؚలో లభిస్తుంది. ఇది ఆధారపడిన టయోటా MPVలో ఉన్నట్లుగా కాకుండా, 7-సీటర్ వర్షన్‌లో అందిస్తున్న ఈ మారుతి MPV మధ్య వరుస కెప్టెన్ సీట్‌లలో ఒట్టోమ్యాన్ ఫంక్షనాలిటీని అందించడం లేదు.

అందిస్తున్న ఫీచర్‌లు

Maruti Invicto cabin
Maruti Invicto panoramic sunroof

వెంటిలేటెడ్ ముందు సీట్‌లు, 10-అంగుళాల టచ్ؚస్క్రీన్, పనోరమిక్ సన్ؚరూఫ్ వంటి ఫీచర్‌లు ఇన్విక్టోలో ఉన్నాయి. మారుతి ఇందులో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు పవర్డ్ టెయిల్ؚగేట్, మెమరీ ఫంక్షన్ؚతో 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ؚతో అందిస్తుంది, ఇవి మారుతి కార్ؚలో మొదటిసారి వస్తున్న ఫీచర్‌లు. 

ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, 360-డిగ్రీ కెమెరా సెట్అప్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజీలు, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: జూన్ 2023లో ఎక్కువగా కొనుగోలు చేసిన కార్‌ల వివరాలు

హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ మాత్రమే

Maruti Invicto hybrid powertrainమారుతి మరియు టయోటా MPVల మధ్య భారీ తేడాలలో ఒకటి ఏమిటంటే, ఇన్విక్టో కేవలం ఇన్నోవా హైక్రాస్ e-CVT గేర్‌బాక్స్ؚతో జోడించబడిన 186PS (కంబైన్డ్) 2-లీటర్ బలమైన-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ؚతో వస్తుంది. ఇది 23.24kmpl క్లెయిమ్ చేసిన మైలేజ్‌ను అందిస్తుంది.

ధరలు మరియు పోటీదారులు

ఇన్విక్టో ధరను మారుతి రూ.24.79 మరియు రూ.28.42 లక్షల మధ్య నిర్ణయించింది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). దీని ప్రత్యక్ష పోటీదారులు టయోటా ఇన్నోవా హైక్రాస్ మరియు ఇది కియా క్యారెన్స్ ఖరీదైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

ఇక్కడ మరింత చదవండి: మారుతి ఇన్విక్టో ఆటోమ్యాటిక్

was this article helpful ?

Write your Comment on Maruti ఇన్విక్టో

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience