• English
  • Login / Register

మారుతి ఇన్విక్టో Vs టయోటా ఇన్నోవా హైక్రాస్ Vs కియా క్యారెన్స్: ధరల పోలిక

మారుతి ఇన్విక్టో కోసం rohit ద్వారా జూలై 07, 2023 12:29 pm ప్రచురించబడింది

  • 62 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హైబ్రిడ్-ఓన్లీ మారుతి ఇన్విక్టో MPV, ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ వేరియెంట్ؚల కంటే తక్కువ ధరకు వస్తుంది, కానీ ధర అనేది ముఖ్యమైన ఇతర అంశాలలో ఒక భాగం మాత్రమే.

Maruti Invicto vs Toyota Innova Hycross vs Kia Carens

టయోటా ఇన్నోవా హైక్రాస్‌పై ఆధారపడిన మారుతి ఇన్విక్టో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ఇది మారుతి కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్‌గా, ప్రస్తుతం MPV లైన్అప్ؚలో XL6 కంటేపై స్థానంలో నిలుస్తుంది. ఈ కారును నెక్సా షోరూమ్ؚల ద్వారా అందిస్తున్నారు. ఇన్విక్టో ధరను మారుతి రూ.24.79 లక్షలుగా నిర్ణయించింది (పరిచయ ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా ధర)

పోటీదారులు మరియు ప్రత్యామ్నాయా వాహనాలతో పోలిస్తే, ఈ MPV ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

పెట్రోల్-ఆటో

మారుతి ఇన్విక్టో

టయోటా ఇన్నోవా హైక్రాస్

కియా క్యారెన్స్ 

 

G (7-సీటర్)/ G (8-సీటర్) – రూ. 18.82 లక్షలు/ రూ. 18.87 లక్షలు*

లగ్జరీ ప్లస్ టర్బో DCT (6-సీటర్)/ లగ్జరీ ప్లస్ టర్బో DCT (7-సీటర్)- రూ. 18.40 లక్షలు/ రూ. 18.45 లక్షలు

 

G (7-సీటర్)/ G (8-సీటర్) – రూ. 19.67 లక్షలు/ రూ. 19.72 లక్షలు

 

జెటా+ (7-సీటర్)/ జెటా+ (8-సీటర్) – రూ. 24.79 లక్షలు/ రూ. 24.84 లక్షలు

VX హైబ్రిడ్ (7-సీటర్)/ VX హైబ్రిడ్ (8-సీటర్) – రూ. 25.30 లక్షలు/ రూ. 25.35 లక్షలు

 
 

VX (O) హైబ్రిడ్ (7-సీటర్)/ VX (O) హైబ్రిడ్ (8-సీటర్) – రూ. 27.27 లక్షలు/ రూ. 27.32 లక్షలు

 

ఆల్ఫా+ (7-సీటర్) – రూ. 28.42 లక్షలు

   
 

ZX హైబ్రిడ్ (7-సీటర్) – రూ. 29.62 లక్షలు

 
 

ZX (O) హైబ్రిడ్ (7-సీటర్) – రూ.30.26 లక్షలు

 

*G వేరియెంట్ ఫ్లీట్ ఆపరేట్ లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

  • మారుతి ఇన్విక్టో అత్యధిక ఎంట్రీ-పాయింట్ ధరను కలిగి ఉంది, దీనికి కారణం ఇది కేవలం 2-లీటర్‌ల పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ؚతో వస్తుంది. మరొకవైపు, దీని డోనర్ మోడల్, ఇన్నోవా హైక్రాస్ؚలో మరింత చవకైన ఎంట్రీ వేరియెంట్ – GX అందుబాటులో ఉంది, ఇది సుమారు రూ.5 లక్షల తక్కువ ధరకు లభిస్తుంది. ఇది ఎటువంటి ఎలక్ట్రిఫికేషన్ లేకుండా, తక్కువ ఫీచర్‌లతో అందించబడుతుంది.

Maruti Invicto

  • అంతేకాకుండా, ఇన్విక్టో కేవలం రెండు వేరియెంట్ؚలలో అందించబడుతుంది – జెటా+ మరియు ఆల్ఫా+. ఫీచర్‌ల పరంగా ఇవి రెండు మెరుగ్గా ఉన్నాయి మరియు వరుసగా హైక్రాస్ VX మరియు ZX హైబ్రిడ్ వేరియెంట్ؚలకు దగ్గరగా ఉంటాయి. ఇవికాకుండా, ఈ పోల్చిన వేరియెంట్ؚలు అన్నిటిలో, మారుతి MPV మరింత చవకైనది.

  • ఇన్విక్టో జెటా+ ధర హైక్రాస్ VX హైబ్రిడ్ కంటే రూ.49,000 తక్కువ, ఆల్ఫా+ ధర ZX హైబ్రిడ్ కంటే రూ.1.2 లక్షలు తక్కువ. ఈ ధర తేడాకు ఒక కారణం ఉంది, మారుతి MPVలో, ఆ వేరియెంట్ؚలలో ఉండే ఫీచర్ జాబితాకు సమానమైన ఫీచర్ జాబితా లేదు మరియు ప్రతి పోలికలో కొన్ని ఫీచర్‌లు మరియు సౌకర్యాలు లేవు.

Maruti Invicto hybrid powertrain

  • ఇన్విక్టో మరియు ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ వేరియెంట్ؚలు రెండూ 186PS (కంబైన్డ్) 2-లీటర్ బలమైన-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ؚతో వస్తాయి, ఇది e-CVTతో జత చేయబడుతుంది. 23.34kmpl క్లెయిమ్ చేసిన మైలేజీని అందిస్తుంది.

  • ఈ జాబితాలో కియా క్యారెన్స్ అత్యంత చవకైన ఎంపిక, ఎందుకంటే ఇన్విక్టో మరియు ఇన్నోవా హైక్రాస్ؚలు పరిమాణం, డిజైన్ మరియు పనితీరు విషయంలో ఒక సెగ్మెంట్‌పై స్థాయిలో ఉన్నాయి. 7-స్పీడ్ డ్యూయల్-క్లఛ్ ఆటోమ్యాటిక్ؚతో జోడించిన కొత్త 160PS టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో పూర్తి ఫీచర్‌లతో వచ్చే కియా MPV వేరియంట్, ఎంట్రీ-లెవెల్ ఇన్విక్టో కంటే సుమారు రూ.6.3 లక్షలు మరింత చవకైనది. 

  • కేవలం న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో మాత్రమే వచ్చే ఎంట్రీ-లెవెల్ టయోటా ఇన్నోవా హైక్రాస్ కూడా రూ.1 లక్ష వరకు ఎక్కువ ధరతో వస్తుంది మరియు కేవలం కనీస మౌలిక ఫీచర్ సౌకర్యాలను అందిస్తుంది. హైక్రాస్ G వేరియెంట్ మాత్రమే, టాప్-స్పెక్ క్యారెన్స్ؚ ధరతో దగ్గరగా ఉంటుంది, కానీ టయోటా దీన్ని ప్రత్యేకంగా ఫ్లీట్ కొనుగోలుదారులకు మాత్రమే విక్రయిస్తుంది. 

  • కియా MPVలో కూడా రెండు ఇతర పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తుంది – 115PS 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్ అత్యంత చవకైన వేరియెంట్ؚలకు శక్తిని అందిస్తుంది, మరొకటి 115PS 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. క్యారెన్స్ ఇంజన్ؚలు అన్నీ సొంత ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికను పొందుతాయి, టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ؚలు 6-స్పీడ్ iMTతో (క్లఛ్ పెడల్ లేకుండా మాన్యువల్) ప్రామాణికంగా వస్తాయి.

Toyota Innova Hycross ottoman functionality for the captain seats

  • రెండిటిలో ప్రీమియం ఆఫరింగ్‌గా ఇన్నోవా హైక్రాస్ؚలో, మారుతి కంటే ఎక్కువగా కెప్టెన్ సీట్ల కోసం ఒట్టోమ్యాన్ ఫంక్షనాలిటీ, JBL సౌండ్ సిస్టమ్, 18-అంగుళాల అలాయ్ వీల్స్, మరియు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి కొన్ని ఫీచర్‌ల అనుకూలతలు ఉన్నాయి.

  • అయితే, మీరు మార్కెట్‌లో పాత డీజిల్ MPV కోసం చూస్తుంటే, టయోటా ఇన్నోవా క్రిస్టాను పరిగణించవచ్చు, దీని ధర రూ.19.38 లక్షల నుండి రూ.25.68 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంటుంది. ఇది కేవలం మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚలో మాత్రమే లభ్యమవుతుంది మరియు ఇన్విక్టో మరియు ఇన్నోవా హైక్రాస్ؚలో చూసిన ఎటువంటి ప్రీమియం సౌకర్యాలతో రాదు అని గమనించాలి.

సంబంధించినది: విడుదలకు ముందే 6,000 కంటే ఎక్కువ బుకింగ్ؚలు అందుకున్న మారుతి ఇన్విక్టో

ఇది కూడా చదవండి: ఇన్విక్టో ఆటోమ్యాటిక్

was this article helpful ?

Write your Comment on Maruti ఇన్విక్టో

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience