ఏప్రిల్ 2023లో విడుదల కానున్న 5 కార్‌లు
టయోటా ఇనోవా క్రైస్టా కోసం tarun ద్వారా మార్చి 29, 2023 02:47 pm ప్రచురించబడ ింది
- 28 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జాబితాలో EV, సరికొత్త సబ్‌కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ మరియు రెండు కొత్త పనితీరు-కేంద్రీకృత కార్లు ఉన్నాయి.
ఏప్రిల్ నెలలో అధిక సంఖ్యలో కార్‌లు విడుదల కాకపోయినా, విడుదలకు సిద్దంగా ఉన్న కార్‌లు ఉత్సాహాన్ని కలిగించనున్నాయి. మారుతి కొత్త SUV-క్రాస్ ఓవర్‌ను తీసుకువస్తుండగా, MG మాత్రం అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారును తీసుకు రానుంది. బడ్జెట్ కార్‌లు మాత్రమే కాకుండా, రెండు వేగవంతమైన మరియు ఖరీదైన కార్‌లు కూడా మార్కెట్‌లో విడుదలకు సిద్దామవుతున్నాయి.
ఏప్రిల్ 2023లో విడుదల కాబోతున్న, ఆవిష్కరించబోతున్న ఐదు కార్‌ల వివరాలు:
మారుతి ఫ్రాంక్స్
అంచనా విడుదల తేదీ – ఏప్రిల్ ప్రారంభంలో
అంచనా ధర – రూ.8 లక్షల నుండి
మారుతి ఫ్రాంక్స్ ఏప్రిల్ మొదటి వారంలో మార్కెట్‌లో విక్రయానికి అందుబాటులోకి వస్తుంది. ఈ బాలెనో-ఆధారిత క్రాస్ ఓవర్ؚను ఆటో ఎక్స్ؚపో 2023లో ఆవిష్కరించారు, ఇప్పటికే ఇది డీలర్ؚషిప్ؚల వద్ద ప్రదర్శన, బుకింగ్ؚల కోసం అందుబాటులో ఉంది. బాలెనో 90PS 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్ మరియు 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో ఫ్రాంక్స్ؚను అందిస్తారు. దీనిలో తొమ్మిది-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్ప్లే, వైర్ؚలెస్ చార్జర్, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, ESC మరియు 360 డిగ్రీల కెమెరా ఉంటాయి. బ్రెజ్జా విధంగానే ఇది కూడా సబ్ కాంపాక్ట్ SUV విభాగానికి చెందినదే కానీ మరింత చవకైన ధరతో వస్తుంది. దీని విక్రయ ధర సుమారుగా రూ.8 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.
MG కామెట్ EV
అంచనా విడుదల తేదీ – ఏప్రిల్ మధ్యలో
అంచనా ధర – రూ.9 లక్షల నుండి
MG అందిస్తున్న చిన్న రెండు డోర్‌ల ఎలక్ట్రిక్ కార్, కామెట్ EV, ఇది భారతదేశంలో ఏప్రిల్ నెలలో అందుబాటులో ఉంటుందని అంచనా. ఈ నాలుగు–సీటర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 3 మీటర్‌ల కంటే తక్కువ ఎత్తు గల వాహనం, ఇది టాటా నానో కంటే చిన్నది. ఇండోనేషియన్-స్పెక్ ఎయిర్ EV 17.3kWh మరియు 26.7lWh బ్యాటరీ ప్యాక్ؚ ఎంపికలతో వస్తుంది, ఇవి వరుసగా 200 నుండి 300 కిలోమీటర్‌ల మీలేజ్‌ను అందిస్తాయని అంచనా. ఈ రెండు ఎంపికలు భారతదేశంలో కూడా అందుబాటులో ఉంటాయని అంచనా. ఇందులో ఉండే ఫీచర్‌లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫో టైన్మెంట్ డ్రైవర్ డిస్ప్లే, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, AC, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, వెనుక పార్కింగ్ కెమెరాలు ఉండవచ్చు. కామెట్ EV ధర సుమారు రూ.9 లక్షల నుండి ప్రారంభం అవుతుందని అంచనా, ఇది టాటా టియాగో EV, సిట్రోయెన్ eC3లతో పోటీ పడనుంది.
టయోటా ఇనోవా క్రిస్టా టాప్-ఎండ్ వేరియెంట్ؚలు
అంచనా విడుదల తేదీ – ఏప్రిల్ చివరిలో
అంచనా ధర – రూ.22 లక్షల నుండి
ఇటీవల టయోటా ఇన్నోవా క్రిస్టా బేస్-స్పెక్ G మరియు GX వేరియెంట్‌ల ధరలను ప్రకటించింది. అయితే, VX మరియు ZX వేరియెంట్‌ల ధరలు ఇంకా ప్రకటించవలసి ఉంది, బహుశా ఏప్రిల్ؚలో ప్రకటిస్తారని అంచనా. క్రిస్టా ఇప్పుడు డీజిల్-మాన్యువల్ కాంబినేషన్ؚలో అందుబాటులో ఉంటుంది, ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో 150PS పవర్ 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ؚను కలిగి ఉంటుంది. టాప్-ఎండ్ వేరియెంట్‌ల ఫీచర్‌ల జాబితాలో ఎనిమిది-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, పవర్డ్ డ్రైవర్ సీట్, ఏడు వరకు ఎయిర్ బ్యాగ్‌లు మరియు రేర్ పార్కింగ్ కెమెరాలు ఉన్నాయి.
లంబోర్ఘిని ఉరుస్ S
విడుదల తేదీ – ఏప్రిల్ 13
నవీకరించబడిన ఉరుస్, S వేరియెంట్ రూపంలో, భారతదేశంలో ఈ నెలలో విడుదల కానుంది. 666PS పవర్ 4.4-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజన్‌తో ఈ SUV మరింత వేగవంతమైన పనితీరును మరియు పవర్‌ను అందిస్తుంది. కేవలం 3.7 సెకన్‌లలో 0-100kmph వేగాన్ని అందుకోగలదు. ఉరుస్ S మునపటి మోడల్ కంటే కొంత భిన్నంగా కనిపిస్తుంది, మరింత ధృఢమైన వంపులను, నవీకరించబడిన బంపర్‌ను మరియు కత్తిరించబడినట్లు కనిపించే ముందు భాగాన్ని కలిగి ఉంటుంది. ఎయిర్ సస్పెన్షన్, డ్రైవింగ్ మోడ్ؚల వంటి ఫీచర్‌లు ఇంతకు ముందులానే కొనసాగుతున్నాయి.
మెర్సిడెస్ AMG GT S E పనితీరు
విడుదల తేదీ – ఏప్రిల్ 11
జర్మన్ తయారీదారు నుండి వస్తున్న మొదటి ప్లగ్-ఇన్-హైబ్రిడ్ AMG ఏప్రిల్ ప్రారంభంలో భారతదేశ రోడ్లపై పరిగెత్తనుంది. ఇందులో ఉన్న 4-లీటర్‌ల ట్విన్-టర్బో V8, 639PS పవర్ మరియు 900Nm టార్క్‌ను అందిస్తుంది. 204PS/320Nm రేర్ ఆక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ؚ ICE ఇంజన్ؚకు మద్దతు ఇస్తుంది. ఈ పూర్తి సెట్అప్ 843PS పవర్ మరియు 1470Nm అధిక టార్క్‌ను అందిస్తుంది! 6.1kWh బ్యాటరీ ప్యాక్ పనీతీరును మెరుగుపరుస్తుంది మరియు 12 కిలోమీటర్‌ల కనీస మైలేజ్‌ను అందిస్తుంది. ఈ నాలుగు-డోర్‌ల GTని ప్రామాణిక వర్షన్ؚతో పోలిస్తే లోపల, వెలుపల తేలికపాటి స్టైలింగ్ మార్పులతో మృధువైన వంపుతో స్పోర్టి స్టైల్‌ను కలిగి ఉంటుంది; ఇందులో చాలా వరకు PHEVకి ప్రత్యేకం.
BS6 ఫేజ్ 2కు అనుకూలమైన కార్ లు
మహీంద్రా, నిస్సాన్, హోండా, MG మరియు టయోటా వంటి కారు తయారీదారులు మినహా అనేక కారు తయారీదారులు తమ BS6 ఫేజ్2 అనుకూల లైనప్ؚను విడుదల చేశారు. ఇకపై కూడా కొనసాగాలని ఆశిస్తున్న వాహనాలు అన్నీ ఏప్రిల్ ప్రారంభంలో RDE-అనుకూలంగా మారాలి.
0 out of 0 found this helpful