Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

కొత్త ఇంజన్‌ను పొందుతున్న 2024 Maruti Suzuki Swift, వివరాలు వెల్లడి!

మారుతి స్విఫ్ట్ కోసం rohit ద్వారా నవంబర్ 08, 2023 03:27 pm ప్రచురించబడింది

కొత్త స్విఫ్ట్, తన సొంత దేశంలో సరికొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ؚను పొందనుంది

  • అక్టోబర్ 2023 జపాన్ మొబిలిటీ షోలో, ప్రొడక్షన్ؚకు సిద్దంగా ఉన్న కొత్త స్విఫ్ట్ؚను కాన్సెప్ట్ؚగా సుజుకి ఆవిష్కరించింది.

  • ప్రస్తుతం, ఈ కారు తయారీదారు నవీకరించిన హ్యాచ్‌బ్యాక్ؚను తన సొంత దేశంలో అధికారికంగా ఆవిష్కరించింది.

  • ఇటీవల మొదటిసారిగా భారతదేశంలో పరీక్షిస్తూ కనిపించింది.

  • ప్రస్తుత ఇండియా-స్పెక్ స్విఫ్ట్ؚలో MT మరియు AMT ఎంపికలతో 90PS 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ యూనిట్ ఉంది.

  • కొత్త స్విఫ్ట్ లో 9-అంగుళాల టచ్ؚస్క్రీన్, 6 వరకు ఎయిర్ బ్యాగ్ؚలు మరియు బ్లైండ్ స్పాట్ డెటెక్షన్ ఉన్నాయి.

  • ఇది భారతదేశంలో 2024 ప్రారంభంలో విడుదల కావచ్చు. ధరలు రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావొచ్చు.

అక్టోబర్ 2023 జపాన్ మొబిలిటీ షోలో, ప్రొడక్షన్ؚకు సిద్దంగా ఉన్న నాలుగవ-జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కాన్సెప్ట్ؚ కారుగా ఆవిష్కరించబడింది. ఇటీవల, మన దేశంలో కూడా మొదటిసారిగా రహస్యంగా పరీక్షించబడింది. ప్రస్తుతం, ఆటో ఈవెంట్ؚలో ప్రదర్శించిన ఈ జపాన్-స్పెక్ హ్యాచ్ؚబ్యాక్ నవీకరించిన ఇంజన్-గేర్‌బాక్స్ ఎంపికలను కారు తయారీదారు వెల్లడించారు.

ప్రస్తుత పవర్‌ట్రెయిన్‌లో నవీకరణలు

ప్రస్తుతం కొత్త స్విఫ్ట్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది, ప్రస్తుత 4-సిలిండర్ K-సీరీస్ ఇంజన్ؚకు బదులుగా, తాజ పవర్ ట్రెయిన్ సెట్అప్ 3-సిలిండర్ Z-సీరీస్ యూనిట్‌తో వస్తుంది. తక్కువ స్పీడ్ؚలో అధిక టార్క్ؚను అందించడానికి నాలుగు నుండి మూడు సిలిండర్ؚలకు మారడం జరిగింది అని సుజుకి తెలియజేసింది. చెప్పాలంటే, వీటి సామర్ధ్య వివరాలను ప్రస్తుతానికి తెలియ చేయలేదు. జపాన్-స్పెక్ స్విఫ్ట్ కూడా తేలికగా ఉండటానికి మరియు పవర్ؚట్రెయిన్ ఇంధన సామర్ధ్యాన్ని పెంచడానికి అభివృద్ధి చేసిన CVT ఆటోమ్యాటిక్ؚను కలిగి ఉంటుంది.

ఇండియా-స్పెక్ స్విఫ్ట్ ఇంజన్

సూచన కోసం, ప్రస్తుత ఇండియా-స్పెక్ మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ (90PS/113Nm) నుండి శక్తిని పొందుతుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ؚతో జోడించబడింది. భారతదేశానికి రానున్న సరికొత్త మారుతి స్విఫ్ట్ కొత్త ఇంజన్ؚలో మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికలను రెండిటినీ అందిస్తుందని అంచనా.

జపాన్ؚలో, నాలుగవ-జెన్ సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ పవర్ؚట్రెయిమ్ ఎంపిక మరియు ఆల్-వీల్-డ్రైవ్ సెట్ؚఅప్ؚతో అందించబడుతుంది, వీటిలో ఏదీ ఇండియా-స్పెక్ హ్యాచ్ؚబ్యాక్ؚతో రాకపోవచ్చు.

ఇతర నవీకరణల సమీక్ష

భారతదేశంలో కనిపించిన నాలుగవ-జెన్ స్విఫ్ట్ؚలో, హనీకోంబ్ నమూనాؚతో ఉన్న గుండ్రని గ్రిల్, పూర్తి-LED లైటింగ్ మరియు కొత్త అలాయ్ వీల్స్ؚ స్పష్టంగా కనిపించాయి. ఈ వివరాలన్నీ జపాన్ؚలో ప్రదర్శించిన మోడల్ؚతో సరిపోలుతున్నాయి. లోపలి వైపు, జపాన్-స్పెక్ స్విఫ్ట్ؚలో ఉండే అదే నలుపు మరియు లేత గోధుమ రంగు డ్యాష్ؚబోర్డు లేఅవుట్ ఉన్నాయి. బాలేనో మరియు గ్రాండ్ విటారాలో ఉన్న అదే స్టీరింగ్ వీల్, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ మరియు ఇన్ؚస్ట్రుమెంట్ క్లస్టర్ؚను కలిగి ఉండవచ్చు.

ఫీచర్‌ల విషయానికి వస్తే, కొత్త స్విఫ్ట్ 9-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటో క్లైమేట్ కంట్రోల్ؚలను పొందుతుంది. దీని భద్రత కిట్ؚలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), 360-డిగ్రీల కెమెరా సెటప్ మరియు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) స్యూట్ ఉన్నాయి. ఇండియా-స్పెక్ హ్యాచ్ؚబ్యాక్ؚలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాప్టివ్ హై బీమ్ సిస్టమ్, లేన్ అసిస్ట్ؚల వంటి ADAS ఫీచర్‌లు ఉండకపోవచ్చు, అయితే ఇక్కడ రహస్యంగా పరీక్షించిన వాహనాలలో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఉంది.

ఇది కూడా చదవండి: 2022లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలలో ప్రతిరోజూ 460 మంచి మరణించారు! ఎక్కువగా మరణాలు ఎక్కడ సంభవించాయో చూడండి

విడుదల మరియు ధర

కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ మన దేశానికి 2024 ప్రారంభంలో వస్తుందని అంచనా, దీని అంచనా ధర రూ.6 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఇది నేరుగా హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ؚతో పోటీ పడుతుంది, ఇదే ధరలో రేనాల్ట్ ట్రైబర్ సబ్-4మీ క్రాస్ ఓవర్ MPV ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ఇక్కడ మరింత చదవండి: మారుతి స్విఫ్ట్ AMT

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 582 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మారుతి స్విఫ్ట్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర